అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?

విజయనగరం జిల్లాలో యువ మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ ఒక విధంగా జాక్‌ పాట్‌ కొట్టారనే అంటున్నారు. ఆయనకు పిలిచి టిక్కెట్‌ ఇచ్చారు. ఆ మీదట కీలక శాఖలతో మంత్రి పదవిని అప్పగించారు. అయితే…

విజయనగరం జిల్లాలో యువ మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ ఒక విధంగా జాక్‌ పాట్‌ కొట్టారనే అంటున్నారు. ఆయనకు పిలిచి టిక్కెట్‌ ఇచ్చారు. ఆ మీదట కీలక శాఖలతో మంత్రి పదవిని అప్పగించారు. అయితే ఆయన కంటే ముందు ఆయన సొంత బాబాయ్‌ గజపతినగరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఉండేవారు. ఆయనే కొండపల్లి అప్పలనాయుడు.

ఆయన 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు. ఈసారి టిక్కెట్‌ దక్కితే పక్కాగా గెలుపు ఖాయమని, ఆ మీదట సీనియారిటీతో మంత్రియోగం పడుతుందని లెక్క వేసుకున్నారు.

అయిదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసినా చివరి నిముషంలో ఆయనకు టిక్కెట్‌ దక్కలేదు. అంతా కోట రాజకీయం మూలంగానే జరిగిందని అశోక్‌ గజపతిరాజు వర్గం మీద అప్పలనాయుడు అనుచరులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సీటును త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని నాడు హైకమాండ్‌ తరఫున పెద్దలు హామీ ఇచ్చారట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది.

రెండు విడతలుగా నామినేటెడ్‌ పదవుల భర్తీ జరిగింది. కీలక పదవులు అన్నీ అందరికీ ఇచ్చేశారు. అప్పలనాయుడు ఊసు మాత్రం ఎక్కడా లేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు అని అంటున్నారు.

మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌ హవా సాగుతోంది. దాంతో అప్పలనాయుడుకు రాజకీయంగా దారి కనిపించడంలేదు అని ప్రచారం సాగుతోంది.

3 Replies to “అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?”

Comments are closed.