నేటి నుంచి జ‌నంపై విద్యుత్ భారం

ఈ నెల నుంచి రాష్ట్ర ప్ర‌జ‌లు విద్యుత్ భారాన్ని మోయాల్సి వుంటుంది. వ‌చ్చే నెల నుంచి ఆ భారం మ‌రింత పెర‌గ‌నుంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విద్యుత్ చార్జీలు పెంచేది లేద‌ని, వీలైతే…

ఈ నెల నుంచి రాష్ట్ర ప్ర‌జ‌లు విద్యుత్ భారాన్ని మోయాల్సి వుంటుంది. వ‌చ్చే నెల నుంచి ఆ భారం మ‌రింత పెర‌గ‌నుంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విద్యుత్ చార్జీలు పెంచేది లేద‌ని, వీలైతే త‌గ్గిస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు అనేక సంద‌ర్భాల్లో ప్ర‌చారం చేశారు. జ‌నం నిజ‌మే అని న‌మ్మారు. విద్యుత్ చార్జీల పెంపే కాదు, ఇంకా చంద్ర‌బాబు ఇచ్చిన చాలా హామీల్ని జ‌నం న‌మ్మ‌డం వ‌ల్లే కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరాక‌..ఆరు నెల‌ల‌కే పాల‌నా త‌త్వం బోధ‌ప‌డుతోంది. ఈ నెల నుంచి రూ.6,029 కోట్లు చొప్పున స‌ర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ వినియోగ‌దారుల‌పై భారం వేశారు. డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి రాష్ట్ర ప్ర‌జానీకం నుంచి ఈ భారం ప‌డ‌నుంది. ఈ భారం చాల‌ద‌న్న‌ట్టు అద‌నంగా రూ.9,412 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని వేశారు. మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చంద‌మంటే ఇదే.

మ‌రోవైపు ప్ర‌జ‌ల ఆదాయం పెర‌గ‌డం లేదు. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌రలు, ఇత‌ర‌త్రా ఖ‌ర్చులు పెరిగి కుటుంబాలు అప్పులపాల‌వుతున్నాయి. ఇవేవీ పాల‌కుల‌కు ప‌ట్ట‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వం పేరుతో ప్ర‌జ‌ల న‌డ్డి విరిచేలా విద్యుత్ చార్జీలా భారాన్ని వేస్తున్నారు. స‌ర్దుబాటు చార్జీల భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌నే విజ్ఞ‌ప్తుల‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. ఎన్నుకున్న పాపానికి పాల‌కులు విధిస్తున్న భారాన్ని మోయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని జ‌నం అనుకునే ప‌రిస్థితి.

16 Replies to “నేటి నుంచి జ‌నంపై విద్యుత్ భారం”

  1. సీబీన్ హామీల మీద నమ్మకం కంటే జగన్ గారి పాలన మీద అసహ్యం తో కూటమి ని గెలిపించారు

    1. Amaravathi kosam AP janalu konchem thyagam cheyyali.. Government ki Sampada ivvadaniki (Amaravathi kosam) AP prajaloooo.. ready ga undandi… Lekapothe amaravathi raadu..Nenooo amaravathi vaasine…naakoo amaravathi kaavali.

  2. Arey L*ja GA. Development needs money. Inka nayam 1960s lo rates kadatham analedu. money kattakunda facilities kaavali ante aa Jaffa gaadini janam ennukune vaaru ra. Public wants development and they are ready to pay what is necessary for that.

  3. Development needs money. Inka nayam 1960s lo rates kadatham analedu. money kattakunda facilities kaavali ante aa Jaffa gaadini janam ennukune vaaru ra. Public wants development and they are ready to pay what is necessary for that.

  4. ఆ బిల్ వెనక ఏ కారణం చేత పెంచవలసి వచ్చిందో ప్రజలకు తెలియపరచాలి గత ప్రభుత్వ లంచాల వల్ల ఏ విధంగా ఎలక్ట్రిసిటీ వ్యవస్థను పాడుచేశారో జనాలకు బిల్ వెనక వివరం గ తెలియ చేయాలి

Comments are closed.