కొడుక్కి నాగార్జున ఖరీదైన గిఫ్ట్

నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో శోభిత మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఇప్పటికే పెళ్లి తంతు మొదలైంది. మంగళ స్నానాలు పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టుడియోస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. Advertisement సెలబ్రిటీ పెళ్లిళ్లంటే…

నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో శోభిత మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఇప్పటికే పెళ్లి తంతు మొదలైంది. మంగళ స్నానాలు పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టుడియోస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

సెలబ్రిటీ పెళ్లిళ్లంటే ఖరీదైన బహుమతులు అందుకోవడం కామన్. ఇప్పుడు నాగచైతన్య కోసం కూడా అలాంటి ఓ ఖరీదైన గిఫ్ట్ రెడీ అయింది. అదే రెండున్నర కోట్ల రూపాయల కారు.

లెక్సెస్ కంపెనీకి చెందిన ఈ కారును ఇటీవలే నాగార్జున కొనుగోలు చేశారు. అదే కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి, తన పేరిట రిజిస్టర్ చేయించారు. ఓ వైపు పెళ్లి హడావుడి నడుస్తుంటే, మరోవైపు ఈ కారు పనులు ఎందుకు పెట్టుకున్నారని అంతా అనుకున్నారు. అయితే అది ఓ బహుమతి.

ఈ కారునే కొడుకు-కోడలికి బహుమతిగా అందజేయబోతున్నారట నాగార్జున. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు హై-ఎండ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర అక్షరాలా 2 కోట్ల 46 లక్షల రూపాయలు.

4వ తేదీ రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు చైతూ. దాదాపు 300 మంది అతిథులు ఈ పెళ్లికి హాజరుకాబోతున్నారు. బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో సుదీర్ఘంగా 7-8 గంటల పాటు ఈ పెళ్లి జరుగుతుందంట.

14 Replies to “కొడుక్కి నాగార్జున ఖరీదైన గిఫ్ట్”

  1. నాగ చైతన్య కి గిఫ్ట్ గా ఇస్తే.. నాగార్జున వచ్చి తన పేరు మీద రిజిస్టర్ చేయడం ఏమిటో..

    am I missing the logic here?

    అయినా నాగ చైతన్య దగ్గర ఆల్రెడీ 12 కార్లు ఉన్నట్టు సమంత ఒక టాక్ షో లో చెప్పింది .. ఇప్పుడు ఇంకో కార్ కి నాగార్జున మనీ వేస్ట్ చేసే రకం కాదు..

    ..

    ఎదో ఒక ఆర్టికల్ రాసేసి.. జనాలకు టైం పాస్..

Comments are closed.