సిట్ ద‌ర్యాప్తు నిలిపివేత‌!

తిరుమ‌ల‌లో సిట్ ద‌ర్యాప్తు నిలిచిపోయిన‌ట్టు స‌మాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచార‌ణ‌ను స‌వాల్ చేస్తూ వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ లేదా సుప్రీంకోర్టు…

తిరుమ‌ల‌లో సిట్ ద‌ర్యాప్తు నిలిచిపోయిన‌ట్టు స‌మాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచార‌ణ‌ను స‌వాల్ చేస్తూ వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచారించాల‌నే డిమాండ్స్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడిగింది.

దీంతో సిట్ ద‌ర్యాప్తును చంద్ర‌బాబు స‌ర్కార్ నిలిపివేసిన‌ట్టు తెలుస్తోంది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ, అలాగే టీటీడీలో అధికార దుర్వినియోగం, ఇత‌ర‌త్రా అవ‌క‌త‌వ‌క‌ల‌పై నిజాలు నిగ్గు తేలుస్తామంటూ చంద్ర‌బాబు స‌ర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ఇటీవ‌ల సిట్ మూడు బృందాలుగా ఏర్ప‌డి వేగం పెంచింది.

ఇదే సంద‌ర్భంలో సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది. క‌ల్తీ జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబునాయుడే ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత‌, ఆయ‌నే ద‌ర్యాప్తు సంస్థ‌ను నియ‌మించ‌డం ఏంట‌ని సుప్రీంకోర్టు నిల‌దీసింది. సిట్‌తో ఒరిగేదేమీ వుండ‌ద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే ఆరోప‌ణ‌లు చేసిన ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన సిట్‌, అధికార పార్టీ నేత‌లు చెప్పిన‌ట్టు కాకుండా, నిష్పాక్షికంగా విచార‌ణ జ‌రిపే అవ‌కాశం వుండ‌ద‌నే మాట వినిపిస్తోంది.

సిట్ నిష్పాక్షిక‌త‌పై విమ‌ర్శ‌లు రావ‌డం, సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు చేతిలో సిట్ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డింది. సిట్ వ‌ద్దని, మ‌రో స్వ‌తంత్ర సంస్థ చేతికి విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, చంద్ర‌బాబు స‌ర్కార్‌కు భారీ దెబ్బే.

14 Replies to “సిట్ ద‌ర్యాప్తు నిలిపివేత‌!”

  1. వివేకా హత్య అప్పుడు కూడా సిబిఐ కి ఇస్తే బాబు కి దెబ్బె అని , అసలు దాని గురుంచి మాట్లాడకుండా గాగ్ ఆర్డర్ తెచుకున్నావ్ ఆఖరికి ఏమైంది ?

  2. వాడకం జరిగి పోయినదానికి రుజువులు ఎలాగా వస్తాయి అక్కడ వంటవాళ్లు చెప్పాలి అప్పటి నెయ్య విషయం తర్వాత గతం లో దర్శించుకున్న భక్తులు అప్పటి లడ్డు నాణ్యత ఇప్పటి లడ్డు నాణ్యత చెప్పమని రిజిస్టర్ పెట్టాలి వాళ్ళు దర్శనం చేసుకొన్నా ప్రూఫ్ లు చూసేక వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి అప్పుడు విషయం తేలుతుంది

  3. It is heard in media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    It is in the media that whole CBN’s political career happening with publicity stunt at state and national levels. With his sound media support he can manage any system which even cannot be managed by national level top political person

  4. గాలి మ?రు: గు దొ:డ్లు శుభ్రం , చందు నాలిక మీద ఇనుప క::డ్డీ కా::ల్చి ప్రక్షాళన చెయ్యాలి!

  5. ఇంకా నిలిపి వేయకుండా కొనసాగిస్తే మరీ ముఖ్యంగా సుప్రీమ్ వ్యాఖ్యల తర్వాత ఎవరూ సిట్ సభ్యులకు సమాధానాలివ్వడం కాదు కదా కనీసం ముఖం కూడా చూపించరు.

  6. ఇదేమి దేశం .. ఇదేమి హిందుత్వం ఇది ఎటువంటి వాదం లౌకిక వాదం అని వ్యాఖ్యలు చెయ్యవచు కింద స్థాయి నుంచి అత్యున్నత న్యాయస్థానాలకు అసత్య ప్రమాణాలు సమ్పరించవచ్చు ,న్యాయమూర్తులను దుర్భాషలాడవచు కానీ అపచారని బహిర్గతపరచుకుడదు .

  7. బా బా యి హ త్య కే సు లో నిందితుల మాటలు విని, కనీస విచారణ చేయకుండా రామ్ సింగ్ ని విచారణ నుండి తొలగించిన సుప్రీంకోర్టు ఇవాళ సిబిఐ విచారణ(డైరెక్ట్ గా అనకపోయినా) చేయించాలా అని అడగడం చాలా హాశ్చర్యం గా ఉంది. రాంసింగ్ ని తొలగించిన తర్వాత కే సు విచారం ఏమయిందో ఇదే కో ర్టు పట్టించుకోలేదు ఇప్పటి వరకు . సుప్రీం కోర్ట్ కి తాను చేస్తున్న తప్పులు ఎప్పుడు కనిపించదు .

Comments are closed.