బాలీవుడ్ నటుడికి బుల్లెట్ గాయం

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. వెంటనే అతడ్ని ముంబయిలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసరంగా గోవిందాకు సర్జరీ చేసిన వైద్యులు, అతడి శరీరం నుంచి బుల్లెట్…

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. వెంటనే అతడ్ని ముంబయిలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసరంగా గోవిందాకు సర్జరీ చేసిన వైద్యులు, అతడి శరీరం నుంచి బుల్లెట్ ను బయటకు తీశారు.

ముంబయి లోని జుహూలో గోవిందా నివాసంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈరోజు పొద్దున్నే కోల్ కతా విమానం అందుకునే హడావుడిలో ఉన్నారు గోవిందా. తన వద్ద ఉన్న లైసెన్సెడ్ రివాల్వర్ ను బీరువాలో పెట్టబోయారు.

కానీ అది కాస్తా చేయి జారింది. నేలపై పడిన రివాల్వర్ హఠాత్తుగా పేలడంతో గోవిందా కాలిలోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం గోవిందా పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

1980-90ల్లో గోవిందా పాపులర్ నటుడు. 90ల్లో ఆయన కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. తన కామెడీతో పాటు, డాన్స్ తో చాలా పాపులర్ అయ్యారు గోవిందా.

సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాలవైపు మొగ్గుచూపారు. 20 ఏళ్ల కిందట ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓసారి ఎంపీగా కూడా పనిచేశారు. ఈ ఏడాది ఆయన కాంగ్రెస్ ను వీడి శివసేనలో చేరారు.

2 Replies to “బాలీవుడ్ నటుడికి బుల్లెట్ గాయం”

Comments are closed.