తిరుప‌తిలో లేడీ లీడ‌ర్ తిష్ట‌.. ద‌ర్శ‌న టికెట్ల అమ్మ‌కం!

తెలంగాణ‌కు చెందిన టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు తిరుప‌తిలో తిష్ట‌వేసి తిరుమల ద‌ర్శ‌న టికెట్ల వ్యాపారం య‌థేచ్ఛ‌గా సాగిస్తున్న‌ట్టు …కూట‌మి నేత‌లే చెప్తున్నారు.

తెలంగాణ‌కు చెందిన టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు తిరుప‌తిలో తిష్ట‌వేసి తిరుమల ద‌ర్శ‌న టికెట్ల వ్యాపారం య‌థేచ్ఛ‌గా సాగిస్తున్న‌ట్టు …కూట‌మి నేత‌లే చెప్తున్నారు. స్థానికంగా త‌మ‌కు దిక్కేలేద‌ని, కానీ తెలంగాణ టీడీపీ నాయ‌కురాలికి మాత్రం రోజుకో సిఫార్సు లేఖ ఎలా ఇస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని ఆ పార్టీకి చెందిన తిరుప‌తి నాయ‌కులు వాపోతున్నారు. స‌ద‌రు మ‌హిళా నాయ‌కురాలు నిత్యం టీవీ డిబేట్ల‌లో క‌నిపిస్తుంటారు.

మ‌రీ ముఖ్యంగా టీటీడీలో కీల‌క ప‌ద‌విలో ఉన్న ఓ వ్య‌క్తికి సంబంధించిన టీవీ చానెల్‌లో కూచుని, ఆంధ్ర రాజ‌కీయాల‌పై ఉప‌న్యాసాలు ఇస్తుంటారామె. తెలంగాణ‌లో టీడీపీకి అంత సీన్ లేక‌పోయినా, రాజ‌కీయ హోదా కోసం త‌ప‌న ప‌డేవాళ్ల‌కు ఆ పార్టీ అవ‌స‌రం వుంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌ను పొగిడిన తెలంగాణ నాయ‌కురాలు, ఆ త‌ర్వాత కాలంలో టీడీపీలో చేరి … ఆ పార్టీ అనుకూల చానెల్స్‌కు ఆస్థాన విశ్లేష‌కుల‌రాల‌య్యారు.

స‌ద‌రు మ‌హిళా నాయ‌కురాలికి రోజుకో సిఫార్సు లేఖ‌.. అంటే ఆరుగురికి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించే అవ‌కాశం క‌ల్పించార‌ని సొంత పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. దీంతో ఆ నాయకురాలు తిరుప‌తిలోనే తిష్ట‌వేసి, చ‌క్క‌గా సొమ్ము చేసుకుంటున్న‌ట్టు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే తిరుప‌తి టీడీపీ నాయ‌కుల్లో కొంద‌రికి మాత్ర‌మే … అది కూడా వారంలో ఒక‌ట్రెండు రోజులు సిఫార్సు లేఖ‌ల్ని అనుమతిస్తారు.

తెలంగాణ మ‌హిళా నాయ‌కురాలికి ప్ర‌త్యేక గౌర‌వం ఇవ్వ‌డంపై స్థానిక టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని నిల‌దీస్తున్నారు. అయితే స‌ద‌రు టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు …త‌న‌కు క‌ల్పించిన ప్ర‌త్యేక అవ‌కాశాన్ని సొమ్ము చేసుకోవ‌డంపై టీటీడీ అధికారులకు తెలియ‌ద‌ని అంటున్నారు. హేమిటో, తిరుమ‌ల‌లో సంస్క‌ర‌ణ అంటే ఏదో అనుకున్నామ‌ని, ఇలా జ‌రిగిపోతోందే అని కూట‌మి నేత‌లు నిట్టూర్చుతున్నారు.

12 Replies to “తిరుప‌తిలో లేడీ లీడ‌ర్ తిష్ట‌.. ద‌ర్శ‌న టికెట్ల అమ్మ‌కం!”

  1. ఈది మా రోజా అక్క మాత్రమే చేయ గలదు. రోజా పేరు మార్చి రాసి నట్టున్నారు.

  2. Ttd ni brasthu chesinde babu…devudu ane bayam poyettu chesi , bussiness pettadu akada…itbhappened from 1997 aa time nundi..jeedipappu lo kumbakinam, mangali jobs lo kumbakonam…okati kadu scam lu…antha babu mahima…kaki la 100 years brathakali

    1. avunu akka correst ga chebavu. mana maha metha 2004-09 daka tarvata mana l 1 1 19-24 daka emi chesaru antavu . gu volu , ju ko neel emi cheyaledu emiti .

Comments are closed.