Laila Review: మూవీ రివ్యూ: లైలా

యూత్ ని ఆకట్టుకోవాలంటే బూతు ఉండాలి అనే బలమైన నిశ్చయంతో తీసిన సినిమాలా ఉంది.

చిత్రం: లైలా
రేటింగ్: 1/5
తారాగణం: విశ్వక్ సేన్, ఆకాంక్ష, బబ్లూ పృథ్విరాజ్, అభిమన్యు సింగ్, తదితరులు
కెమెరా: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: సాగర్
సంగీతం: లియో జేంస్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
విడుదల తేదీ: 14 ఫిబ్రవరి 2025

నేటి యంగ్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విశ్వక్ సేన్. అతని సినిమాల్లో యూత్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు వెరైటీ కూడా ఉంటుందని ఒక అభిప్రాయం. “లైలా”లో ఉన్న వెరైటీ విశ్వక్ లేడీ గెటప్. ఇక యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయా? వాటి స్థాయి ఎలా ఉంది? విషయంలోకి వెళ్లి చూద్దాం.

సోను (విశ్వక్ సేన్) లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. ఆ ఏరియాలోని ఆడవాళ్లంతా “తమ మీద చేయిపడితే సోనూదే పడాలి” అని ఉవ్విళ్లూరితుంటారు. తమ భర్తల్ని కూడా “సోను లాగ సున్నితంగా పట్టుకో” అంటూ అతని టచ్ గురించి చెప్తుంటారు. సోను మాత్రం తన కష్టమర్స్ ని “అక్కా” అని సంబోధిస్తూ వాళ్లకి సాయపడుతూ ఉంటాడు. ఒక రోజు ఒక నల్లటి అమ్మాయిని మేకప్ వేసి తెల్లగా మారుస్తాడు సోను. ఆ ఏరియాలో రౌడీ అయిన రుస్తుం (అభిమన్యు సింగ్) ఆమెని చూసి మనసు పారేసుకుని పెళ్లి చేసుకుంటాడు. తీరా శోభనం అయ్యి, ఆమె స్నానం ఆయ్యాక మేకప్ అంతా పోవడం వల్ల ఆమె అసలు రంగు బయట పడుతుంది. తాను మోసపోవడానికి కారణం సోనూ చేసిన మేకప్పే అని ఆ పార్లర్ పై దాడి చేయిస్తాడు రుస్తుం. దానికి తోడు లోకల్ ఎస్సై (బబ్లూ పృథ్విరాజ్) తో అతనికి గొడవ ఉంటుంది.

మొత్తానికి రుస్తుం నుంచి, ఎస్సై నుంచి తనను తాను కాపాడుకోవడానికి లైలా పేరుతో ఆడవేషం వేసుకుని తిరుగుతుంటాడు సోను. లైలాని చూసి ఎస్సై, రుస్తుం ఇద్దరూ మోజుపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

హీరోలు ఆడవేషాలేసిన సినిమాలు అనగానే నరేష్ “చిత్రం భళారే విచిత్రం”, రాజేంద్ర ప్రసాద్ “మేడం” టక్కున గుర్తుకొస్తాయి. చిత్రం భళారే విచిత్రంలో కూడా అప్పటి లెక్కల్లో అశ్లీలం అనిపించే సన్నివేశాలు లేకపోలేదు. కానీ బలమైన కామెడీ ట్రాక్, సాఫ్ట్ లవ్ స్టోరీ ఉండడం వల్ల అది అప్పట్లో హిట్టయింది. కానీ ఈ “లైలా” అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్.

ఇక్కడ విపులంగా రాయడం కష్టం కానీ..”నాలుగైదు రోజులుగా ఈ ఆకులే పెడుతున్నారు.. వేరే ఆకులేవీ లేవా..” అనడిగితే.. ఒకడు, “ఆకులు లేవు కానీ, మూడు రోజుల క్రితమే మొలిచిన నా ………” అంటూ సైగ చేసి తన నిక్కర్ వైపు చూపిస్తూ ఏదో చెప్పబోతాడు. డైలాగ్ పూర్తవ్వక్కర్లేదు. అది ఎంత అసహ్యంగా ఉంటుందో ఊహించండి.

అలాగే శోభనం అయిన పెళ్లికూతురు గట్టిగా అరవగానే మేకలగుంపు మధ్యలో ఉన్న 30 ఇయర్స్ పృథ్వి నోట్లోంచి పాలు కారుస్తాడు. అది సింబాలిక్ షాట్ అన్నమాట. ఇదెంత జుగుప్సగా అనిపిస్తుందో చెప్పక్కర్లేదు.

ష‌గ.. లు పగిలిపోతాయ్” అనే డైలాగ్ కి సెన్సార్ కత్తెరే పడలేదు.

“పిచ్చి పువ్వు లాగ….” అనే వినసొంపైన డైలాగ్ కూడా ఉంది. ఇది వినగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిధి చిరంజీవి వాడిన ఒకానొక పదం గుర్తొస్తుంది.

అన్నట్టు చిరంజీవంటే గుర్తొచ్చింది. ఇందులో చిరంజీవికి ఇన్-ఫిలిం బ్రాండింగ్ విపరీతంగా జరిగింది. విలన్ అభిమన్యు సింగ్ పేరు రుస్తుం, అతని తండ్రి చిరంజీవి అభిమాని, తన భార్య పేరు శుభలేఖ. అలాగే ఖైదీ, పున్నమినాగు, జగదేకవీరుడు అతిలోక సుందరి… ఇలా సినిమా టైటిల్స్ ప్రస్తావన.. మధ్యమధ్యలో చిరంజీవి పాటలు వినిపించడాలు జరిగాయి. బహుశా చిరంజీవి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.

ప్రధమార్ధం, ద్వితీయార్ధం అని కాదు. సినిమా మొత్తం చీప్ బుర్రలతో తీసిన కాస్ట్లీ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ రొట్టకొట్టుడు పాటల కోసం ఖర్చు బాగానే పెట్టించారు నిర్మాత చేత. నేపథ్య సంగీతం బాగానే ఉన్నా, పాటలు మాత్రం గోల గోలగా ఉన్నాయి.

కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా పనిచేసి 2 గంటల 16 నిమిషాల్లో ఎండ్ కార్డ్ పడేలా చేసింది. అయినప్పటికీ లెంగ్దీగా అనిపించిందంటే ఎంత అనాసక్తంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

యూత్ ని ఆకట్టుకోవాలంటే బూతు ఉండాలి అనే బలమైన నిశ్చయంతో తీసిన సినిమాలా ఉంది.

నటీనటుల విషయానికొస్తే విశ్వక్ సేన్‌ సోనుగా ఆకట్టుకున్నాడు కానీ లైలాగా “అతిగా” ఉన్నాడు. అతను పడ్డ కష్టం ఏమో కానీ, “అటు ఇటు కాని” విధంగా ఉన్నాడే తప్ప ఆకర్షణీయమైన యువతిలా మాత్రం లేడు. ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి, ఆడ వేషంలో ఉన్న విశ్వక్ సేన్‌ని చూస్తే “బుగ్గ కొరికేయాలనిపించింది..” అని ఏదో అన్నారు. ఆయన టేస్ట్ ఎంత గొప్పగా ఉందో ఇందులో విశ్వక్ సేన్‌ని చూస్తే తెలుస్తుంది.

హీరోయిన్ ఆకాంక్ష తన జీమ్‌ బాడీని చూపించడానికి, శృంగారంగా హొయలు ఒలికించడానికి తప్ప కథకి ఏమీ ఉపయోగపడలేదు.

అభిమన్యు సింగ్ కామెడీ విలన్‌గా న్యాయం చేసాడు. 30 ఇయర్స్ పృథ్వి ఎందుకున్నాడో కూడా తెలీదు. ఆ పాత్ర లేకపోయినా నష్టం లేదు.

బబ్లూ పృథ్విరాజ్ మాత్రం పూర్తి నిడివి గల పాత్రలో నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ గా తన పని తాను చేసుకుపోయాడు.

యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సునిసిత్ కి ఇందులో ఒక స్పెషల్ రోల్ ఇచ్చారు. అతను వచ్చినప్పుడల్లా హాల్లో విజిల్స్ మోగాయి.

ఎలా చూసుకున్నా ఇది ఒక జుగుప్సాకరమైన సినిమా. జుగుప్సారసాన్ని ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చవచ్చు. బూతుని కామెడీగా అస్వాదిస్తూ, విషయం లేని కథనాన్ని అగరుబత్తిలా పీలుస్తూ కూర్చునేవాళ్లకి ఏమో కానీ, తక్కిన ఆడియన్స్ కి మాత్రం మింగుడు పడని చిత్రమిది. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.

సినిమాల్లో ఎన్ని అవకతవకలున్నా ఎంతో కొంత ఫిల్టర్ పెట్టి సున్నితంగా సద్విమర్శ చేయడం సమీక్షకుల పని. కానీ సున్నితత్వం లేని ఇలాంటి సినిమాలు చూస్తే విమర్శ ఘాటుగానే చేయాలనిపిస్తుంది. “అల్లుడా మజాకా” లాంటి అసభ్యకరమైన సన్నివేశాలున్న సినిమాలో నటించినందుకు అప్పట్లో చిరంజీవిని సమీక్షకులు, అభిమానులు తిట్టిపోసారు. ఇప్పుడు “లైలా”ని ప్రొమోట్ చేసినందుకు ఆయన మరోసారి మందలింపులకి గురైతే ఆశ్చర్యమేమీ లేదు.

బాటం లైన్: జుగుప్సాకరం

32 Replies to “Laila Review: మూవీ రివ్యూ: లైలా”

  1. //మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.// ఈ లైన్ బావుంది

  2. //మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

    1. ఎందుకో. ఈ సినిమా కి అందరూ టిడిపి media సహ అందరూ పాయింట్ five యే అంటున్నారు

  3. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

  4. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

  5. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

  6. Chiru movie vallu pilisthe pre release event ki velladu. Velladu kabatti movie cast and crew ni praise chesadu. neeku chiru taste ela bindi. Ani rayadam avasarama? Malli alluda mazaka topic. Adi aa year top2 hit after pedarayudu. So nuvvu rasinattu titti poyaledu. Intha grudge enduku aayana paina. Oho namaskaram gurtochhinda

  7. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

  8. మంచి అనుభూతినిచ్చే చిత్రమవుతుందని “లైలా” మీద ఆశలుపెట్టుకున్న ఆడియన్స్ మజ్నూల్లా బాధపడడం తప్ప చేసేదేం లేదు.,// ఈ లైన్ బావుంది

  9. దరిద్రం వదిలింది.. అడ్డమయినా చెత్త తీయడం… మళ్ళీ పనికిమాలిన కాంట్రోవర్సీ… అవసరమా

  10. పేటీఎం బ్యాచ్ చేతిలో పడి సమూలంగా కు త్త చెక్కించేసుకున్నాడు భూమి కి బెత్తెడు విశ్వక్సేన్ ఇప్పుడప్పుడే కోలుకోలేడు వీడు

  11. అదేంటి, ఇలాంటి వల్గ*ర్ పచ్చి బూ*తులు అంటే మన ప్యాలస్ పులకేశి కి చాలా ఇష్టం కదా. అప్పట్లో తన మంత్రులూ ఎవరు బూ*తులు బాగా మాట్లాడితే వాళ్ళకి మెచ్చుకునేవాడు. ఆ లెక్కన మన ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఈ సినిమా నీ ప్యాలస్ లో లైవ్ స్క్రీన్ లో ప్రసారం చెయ్యాలి కదా. ఒక్కో ఫ్యాన్ పార్టీ అతను కనీసం పది సార్లు చూసి సినిమాని హిట్ చేసి ప్యాలస్ పులకేశి కి ఆనందం కలిగించాలి. ఉ స్కో..

  12. జగన్ అప్పట్లో నా ఆ*కులు పీక*లేరు అనేవాడు, పదవిలో వుండి పబ్లిక్ గా. అప్పట్లో వెంకట రెడ్డి గారికి ఆ ఆకులు ప*విత్రం గా కనిపించాయి., క్రిస్మస్ చెట్టు లాగ..

  13. ఇప్పుడు ఏదో హటాత్తుగా బూ*తులు అంటే ఇష్టం లేనట్లు అంటే, జనాలు నమ్మరు కదా.

    బూతు*లు అనేవి డొ*క్కు పం*ఖా పా*ర్టీ అధికార భా*షా కదా.

  14. రహస్యంగా ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని మరీ బంగళూర్ట్ వెళ్లే టైమ్ లో ఈ సినిమా చూసి ఆ బూ*తులు ఎంజాయ్ చేస్తు్న్నారు అని ప్యాలెస్ పులకిసి విమానం డ్రైవర్ ఉవాచ.

Comments are closed.