ఇండియాలోనే అతిపెద్ద ఓటీటీ విలీనం ముగిసింది. జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ విలీనం పూర్తయింది. ఈ రెండు ఓటీటీల్లోని కంటెంట్ ను ఇప్పుడు “జియో హాట్ స్టార్” అనే కొత్త యాప్ లో చూడొచ్చు. ఇది ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ రెండూ పనిచేస్తాయి. ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు ఈ యాప్స్ ను వాడుకోవచ్చు. అలా వాడుకుంటూనే “జియో హాట్ స్టార్” యాప్ లోని కంటెంట్ కు రీ-డైరక్ట్ అవ్వొచ్చు.
కొత్త వినియోగదారులు మాత్రం నేరుగా “జియో హాట్ స్టార్”లోనే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అందరికీ “జియో హాట్ స్టార్” లో కంటెంట్ ను ఉచితంగా చూసే సౌకర్యం కల్పించారు. త్వరలోనే సబ్ స్క్రిప్షన్ ఆప్షన్లు వస్తాయి.
రెండు పెద్ద కంపెనీల విలీనంతో ఇప్పుడు కంటెంట్ మొత్తం ఒకే వేదికపై చూసే అవకాశం దక్కింది. ఇకపై ఐపీఎల్ మ్యాచులు ఎందులో స్ట్రీమింగ్ అవుతాయో వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మార్వెల్ సినిమాల కోసం, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కోసం వేర్వేరు సబ్-స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ప్రస్తుతానికి “జియో హాట్ స్టార్”లో 3 లక్షల గంటల ఎంటర్ టైన్ మెంట్ ఉచితంగా అందుబాటులో ఉంది. తాజా విలీనంతో ఈ యాప్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు చేరుకుంది. నకిలీ ఎకౌంట్లు తొలిగించిన తర్వాత ఎంతమంది యూజర్లు ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుంది. “జియో హాట్ స్టార్”లో కొత్త సబ్-స్క్రిప్షన్ ప్లాన్లు 149 రూపాయల (3 నెలలకు) నుంచి మొదలవుతున్నాయి.
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
Woww