Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ వర్గంలోనూ జగన్‌కు నీరాజనాలే!

ఆ వర్గంలోనూ జగన్‌కు నీరాజనాలే!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డిమాండు. అందరూ అసాధ్యం అనుకుంటున్న సంగతి. ఆర్టీసీ కార్మికులు తమ పట్ల వివక్ష వద్దంటూ.. ఎంతో కాలంగి ప్రభుత్వాలకు విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా.. అంత పెద్ద సంస్థను ప్రభుత్వంలో కలిపేయడం వలన పడగల ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క పాలకులు కూడా దానికి అనుగుణమైన నిర్ణయం తీసుకోనేలేదు.

అయితే వైఎస్ జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తానని.. వారికి హామీ ఇచ్చారు. ఆ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా నియమించారు. ఇన్నాళ్లకు ఆ కమిటీ తన నివేదికను జగన్‌కు అందజేసింది. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో దీనికి సర్కారు ఆమోదం తెలిపే తీర్మానం చేయవచ్చునని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉండే వేలాది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జగన్మోహన రెడ్డికి నీరాజనాలు పడతాయనడంలో సందేహం లేదు.

సాధారణంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆలోచనలను ప్రతి ప్రభుత్వమూ కాస్త కాస్త తేడాలతో అమలు చేస్తూనే ఉంటాయి. అలాంటి ఆలోచనలకు త్వరగా మొగ్గు చూపుతుంటాయి కూడా. కానీ.. తెలిసితెలిసీ.. ఆర్టీసీ వంటి అతిపెద్ద సంస్థను ప్రభుత్వంలో కలిపేసుకుని, ఆ భారాన్ని మోయడానికి మాత్రం ఎవ్వరూ సిద్ధపడరు. అందుకే కొన్ని దశాబ్దాలుగా ఆర్టీసీ వారి కోరిక తీరకుండానే ఉండిపోయింది. అక్కడే జగన్.. ప్రజారంజకమైన పాలకుడిగా తన విలక్షణతను చాటుకున్నారు. ఆర్టీసి విలీన నిర్ణయానికి ఒక కమిటీ వేశారు.

నిజానికి ఈ కమిటీ ఏర్పాటైనప్పుడు.. ఆర్టీసీలోనే తెదేపా అనుకూల వర్గాలు కొందరు దుష్ప్రచారం సాగించారు. కమిటీ కంటితుడుపు చర్య మాత్రమేనని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే.. అది చాలా పెద్ద ప్రాసెస్ అనీ.. సాధ్యమయ్యేది కాదని పెదవి విరిచారు. మంగళవారం జగన్‌కు నివేదిక సమర్పించిన తర్వాత.. ఆ శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్పారు. ఆర్టీసీ ఇక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌గా మారుతుంది. దీనిద్వారా 3500 కోట్ల అదనపు భారానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?