బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంద‌ని వాళ్లంతా చెబుతున్న మాట‌.

జ‌మిలి ఎన్నిక‌లపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. బిల్లును కూడా లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ బిల్లుపై అధ్య‌య‌నం కోసం జేపీసీకి సిఫార్సు చేశారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంట్ స‌భ్యులు ఆస‌క్తిక‌క‌రంగా మాట్లాడుకుంటున్న‌ట్టు తెలిసింది.

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే ఆర్థిక బ‌డ్జెట్‌లో జ‌నాభా లెక్కింపున‌కు ప్ర‌త్యేక కేటాయింపులు చేస్తే, ఇక ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంద‌ని పార్ల‌మెంట్ స‌భ్యులు మాట్లాడుకుంటున్న‌ట్టుగా స‌మాచారం. జ‌నాభాకు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గాల్ని కూడా పెంచి, అనంత‌రం ఎన్నిక‌ల‌కు బీజేపీ వెళ్తుంద‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంద‌ని అంద‌రి అభిప్రాయంగా చెబుతున్నారు.

బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జ‌మిలి ఎన్నిక‌ల‌పై మిగిలిన రాజ‌కీయ పార్టీల్ని మ‌భ్య‌పెట్టి, అక‌స్మాత్తుగా బీజేపీ ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహం ఏంటో ప్ర‌ధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు మాత్ర‌మే తెలుస‌ని బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు కూడా అంటున్నార‌ని తెలిసింది.

అయితే త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంద‌ని వాళ్లంతా చెబుతున్న మాట‌. బీజేపీ మిగిలిన పార్టీల్ని దొంగ దెబ్బ తీయ‌డానికే వ్యూహం ర‌చిస్తుంద‌నే భ‌యం మాత్రం అంద‌రిలోనూ వుంద‌ని స‌మాచారం.

3 Replies to “బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!”

Comments are closed.