ధోప్.. హైప్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా?

తమన్ సంగీతంలో కొత్తదనం కనిపించలేదు. పాప్ మ్యూజిక్ నుంచి ప్రేరణ పొంది కంపోజ్ చేసినట్టుంది.

సినిమాకు హైప్ రావాలంటే, రిలీజ్ కు ముందు వైరల్ సాంగ్ పడాల్సిందే. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్టయిన ఏ సినిమాను తీసుకున్నా, ఈ అంశం కామన్ గా కనిపిస్తుంది. అలాంటి వైరల్ సాంగ్ గేమ్ ఛేంజర్ నుంచి ఇంకా రాలేదనే చెప్పాలి.

సాంగ్స్ వస్తున్నాయి, లక్షల్లో క్లిక్స్ వస్తున్నాయి కానీ వైరల్ మాత్రం ఇంకా అవ్వలేదనే చెప్పాలి. “రా మచ్చా మచ్చా” అనే పాట ఒక స్థాయి వరకు మాత్రమే వెళ్లగలిగింది. ఇలాంటి టైమ్ లో వచ్చిన ‘ధోప్ సాంగ్’ సినిమాను పైకి లేపుతుందని అంతా భావించారు. దీనిపై నడిచిన బజ్ కూడా అదే రేంజ్ లో సాగింది.

మొత్తానికి చాన్నాళ్లుగా ఊరిస్తున్న ధోప్ సాంగ్ వచ్చేసింది. కేవలం లిరికల్ వీడియోకే పరిమితం అవ్వకుండా, చరణ్ స్టెప్పులు, చరణ్-కియరా కెమిస్ట్రీని చూపించే సన్నివేశాల్ని కూడా చేర్చారు. దీంతో విజువల్ గా ఇది ఎక్కువమందిని ఆకట్టుకుంటోంది. సాంగ్ లో చరణ్ డాన్స్ బాగుంది. జానీ మాస్టర్ కొన్ని రోజులుగా చెబుతున్న సాంగ్ ఇదే.

ఇక పాట విషయానికొస్తే, తమన్ సంగీతంలో కొత్తదనం కనిపించలేదు. పాప్ మ్యూజిక్ నుంచి ప్రేరణ పొంది కంపోజ్ చేసినట్టుంది. సాహిత్యం పెద్దగా వినిపించలేదు. విన్న వెంటనే ఆకట్టుకునే సాంగ్ కాదిది, వినగా వినగా ఎక్కుతుందేమో చూడాలి.

ఆడియో పరంగా ఈ సాంగ్ క్లిక్ అవుతుందా అవ్వదా.. లేదా థియేటర్లలో కేవలం విజువల్ పరంగానే ఆకట్టుకుంటుందా అనేది మరికొన్ని రోజులాగితే తెలుస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను రోషిణి, పృధ్వి, శృతిరంజనీతో కలిసి తమన్ ఆలపించాడు.

6 Replies to “ధోప్.. హైప్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా?”

Comments are closed.