బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రో సీఎం అభ్య‌ర్థో కూడా ఆయ‌నే వ్యంగ్యంగా ప్ర‌క‌టించారు. అయితే కేజ్రీవాల్ ను అవినీతి ప‌రుడిగా బీజేపీ విమ‌ర్శించింది.

ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత కాగ్ రిపోర్ట్ రూపంలో మ‌రో బాంబ్ పేలింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ‌ల్ల రెండు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి న‌ష్టం వాట‌ల్లిందంటూ కాగ్ లెక్క గ‌ట్టింద‌ట‌! ఆప్ ను నిండా అవినీతి పార్టీ అంటూ బీజేపీ ఈ రిపోర్ట్ ఆధారంగా మ‌రోసారి విరుచుకుప‌డింది.

అయితే దేశంలో అనేక మంది అవినీతి ఆరోప‌ణ‌లున్న నేత‌ల‌కు బీజేపీ కండువాలు క‌ప్ప‌డం ఏమీ ఆప‌లేదు. గ‌తంలో తామే అవినీతి ప‌రులు అని ఆరోపించిన వారికి కూడా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌ను ఇచ్చింది. అజిత్ ప‌వార్ ను, ఎన్సీపీని బీజేపీ ఎంత‌గా విమ‌ర్శించిందో, ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శించిందో రాస్తే ఒక పుస్త‌క‌మే అవుతుంది. అయితే చాన్నాళ్లుగా ఎన్సీపీ బీజేపీకి దోస్తు. అజిత్ ప‌వార్ బీజేపీకి ఆత్మీయుడు! త‌మ‌తో దోస్తీ అయితే ఒక‌లా, కుస్తీ అయితే మ‌రోలా అనే థియ‌రీని బీజేపీ దేశ ప్ర‌ద‌ర్శిస్తూనే త‌న విజ‌య‌ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూ ఉంది.

మ‌రి ఇలాంట‌ప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌ను ఢిల్లీ ప్ర‌జ‌లు ఆప్ విష‌యంలో ఎంత సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇప్ప‌టికే ఢిల్లీలో ఆప్ తిష్ట వేసి ప‌దేళ్లు గ‌డిచాయి. ప‌దేళ్ల కింద‌ట తిరుగులేని విజ‌యంతో ఆప్ ఢిల్లీలో పొలిటిక‌ల్ సునామీ సృష్టించింది. ఆ త‌ర్వాత ఐదేళ్ల కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఆప్ విజ‌యాన్నే న‌మోదు చేసింది. కాంగ్రెస్, బీజేపీల‌ను చిత్తు చేస్తూ ఆప్ దేశ రాజ‌ధానిలో జెండా పాతింది. మ‌రి ఇప్పుడు వ‌ర‌స‌గా మూడోసారి కూడా ఆప్ అక్క‌డ విజ‌యాన్ని సాధిస్తే సంచ‌ల‌న‌మే అవుతుంది.

ఈ ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌ఫున త‌నే సీఎం అభ్య‌ర్థినంటూ కేజ్రీవాల్ ప్ర‌క‌టించుకున్నారు. బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రో సీఎం అభ్య‌ర్థో కూడా ఆయ‌నే వ్యంగ్యంగా ప్ర‌క‌టించారు. అయితే కేజ్రీవాల్ ను అవినీతి ప‌రుడిగా బీజేపీ విమ‌ర్శించింది. ఆప్ నుంచి నిజాయితీ ప‌రుడైన వ్య‌క్తిని సీఎం క్యాండిడేట్ గా ప్ర‌క‌టించాల్సిందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. మ‌రి మ‌హారాష్ట్ర‌లో భారీ విజ‌యాన్ని సాధించి త‌న స‌త్తా చూపించిన బీజేపీ ఢిల్లీలో ఆ హ‌వాను చాటుకుంటుందా లేదా అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా అయితే నిలుస్తోంది. బీజేపీ ఎత్తుల‌కు ఆప్ ఏ మేర‌కు నిల‌బ‌డుతుందో వేచి చూడాలి!

4 Replies to “బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?”

  1. నిజాయితీ గురించి నేటి భాజపా మాట్లాడుతుంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.