క్ష‌మాప‌ణ‌లు.. తెగేదాకా లాగ‌లేని ప‌వ‌న్?!

ప‌వ‌న్ చెప్పిన‌ట్టుగా టీటీడీ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశాడ‌ని వారు కూడా వాదిస్తే.. మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించే వాళ్ల దృష్టిలో ప‌లుచ‌న అయ్యేదెవ‌రో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

తిరుప‌తి తొక్కిసలాట విష‌యంలో క్ష‌మాప‌ణ‌ల అంశాన్ని తెర‌పైకి తెచ్చి, ఆ దుర్ఘ‌ట‌న‌కు అలాంటి ముగింపును ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా ఉన్నారు జ‌న‌సేన అధిప‌తి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ పొయెటిక్ జస్టిస్ తో ప‌వ‌న్ నాట‌కీయంగా ఈ ఉదంతాన్ని ముగించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా ఉన్నారు. ప‌రిహారం ఇచ్చేశాం, క్ష‌మాప‌ణ‌లు చెప్పేశాం.. అన్న‌ట్టుగా నాట‌కీయంగా ఈ వ్య‌వ‌హారాన్ని ప‌వ‌న్ ముగించాల‌నుకున్నారేమో!

అయితే ఈ వ్య‌వ‌హారంలో టీటీడీ చైర్మ‌న్ స్పంద‌న డిప్యూటీ సీఎం స్పంద‌న‌కు పూర్తి భిన్నంగా ఉంది. క్ష‌మాప‌ణ‌లు చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా.. అన్న‌ట్టుగా ప‌వ‌న్ స్పంద‌న‌ను ఆయ‌న పూర్తి లైట్ తీసుకున్నారు! అయితే.. అటు తెలుగుదేశం వీరాభిమానులు, టీటీడీ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడంటూ వాదిస్తూ ఉన్నారు! ఒక‌వేళ మాట మాత్రంగా ఆయ‌న క్ష‌మాప‌ణ అనే మాట‌ను వాడినా, ‘క్ష‌మాప‌ణ‌లు చెబితే పోయిన ప్రాణాలొస్తాయా.. ‘ అనే స్పంద‌నే హైలెట్ అవుతూ ఉంది. ప‌వ‌న్ చెప్పిన క్ష‌మాప‌ణ థియ‌రీ వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని స్పందించిన త‌ర్వాత క్షమాప‌ణ‌లు చెప్పినా వాటికో విలువ ఉంటుందా?

నోటితో న‌వ్వుతూ, నొస‌టితో వెక్కిరించిన‌ట్టుగా అయ్యింది వ్య‌వ‌హారం! అయితే సాక్షాత్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేసినా, క్ష‌మాప‌ణ థియ‌రీ ని టీటీడీ చైర్మ‌న్ తేలిక చేసిన‌ట్టుగా మాట్లాడ‌టంతో ప‌వ‌న్ వీరాభిమాన‌వర్గం కూడా దీనిపై స్పందించలేని ప‌రిస్థితిలో ప‌డిపోయింది. టీడీపీ వ‌ర్గాలేమో.. ప‌వ‌న్ ను మ‌రింత‌గా రెచ్చ‌గొట్ట‌కుండా, అలాగ‌ని టీటీడీ చైర్మ‌న్ ను గ‌ట్టిగా డిమాండ్ చేయ‌లేక‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పేశారు, మీకు విన‌ప‌డ‌లేదా అంటూ వాదిస్తున్నారు!

అయితే జ‌న‌సేన వ‌ర్గాలు కూడా ఇలానే మాట్లాడితే, అది వారు వారిని మోసం చేసుకోవ‌డ‌మే అవుతుంది. ప‌వ‌న్ చెప్పిన‌ట్టుగా టీటీడీ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశాడ‌ని వారు కూడా వాదిస్తే.. మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించే వాళ్ల దృష్టిలో ప‌లుచ‌న అయ్యేదెవ‌రో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఈ క్ష‌మాప‌ణ వ్య‌వ‌హారాన్ని ప‌వ‌న్ కూడా ఇక తెగేవ‌ర‌కూ లాగుతారా లేక చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేసిన‌ట్టే అని అనుకుంటారో!

8 Replies to “క్ష‌మాప‌ణ‌లు.. తెగేదాకా లాగ‌లేని ప‌వ‌న్?!”

  1. కర్మ రిటర్న్స్ అంటే ఇదే… అల్లు అర్జున్ నీ ఆదుకున్నారు … ఇప్పుడు దేవుడు అడిస్తున్నాడు

  2. క్షమాపణలు చెప్పిన video అందరూ చూసేశారులే కాని…ఇంకో కొత్త శవం వెతుక్కొని కొత్త శవ రాజకీయం start చేసుకోండి GA….

  3. అబద్ధాలు రాయవద్దు బ్రో. “తాను ఇప్పటికే క్షమాపణలు చెప్పానని, తన వ్యాఖ్యలు పవన్ ని ఉద్దేశించి అన్నవి కావని” బీఆర్ నాయుడు స్పష్టంగా చెప్పాడు. ఇది టీ కప్పులో తుఫాను. దీన్ని సాగతియ్యవద్దు. ఇంతకీ బాధితులకి జగన్అన్న ఏమైనా సహాయం చేశాడా? ఆ విషయం చెప్పు.

    1. ఆయో అలా అంటారు ఏంటి .. సేవం కనపడితే ఇంకా పండగ కదా నీలం బ్యాచ్ కి..

  4. ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు వెళ్ళాడు మన జగన్ రెడ్డన్న హాస్పిటల్ ఐసీయూ లోకి..

    జై జగన్ అనే నినాదాలు.. సీఎం సీఎం అంటూ అరుపులు..

    నిలబడడానికి కూడా స్థలం లేదు.. కిక్కిరిసి పోయారు.. తోసుకొంటున్నారు..

    సెలైన్ బాటిల్ పీకేసి పక్కన పడేసారు.. డాక్టర్ లను పంపించేశారు.. వీడియోలకు మాత్రం క్లోజ్ అప్ షాట్స్ ఇచ్చుకున్నారు..

    ఎందుకోసం ఈ బల ప్రదర్శన..?

    ..

    చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆయన పక్కన నలుగురు మాత్రమే ఉన్నారు..

    పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వీడియో కవరేజ్ కూడా లేదు..

    జగన్ రెడ్డి కి మాత్రం .. ఎందుకోసం ఈ హడావుడి..?

  5. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.