థ్రిల్లర్ సినిమాలను తీయడంలో తమకు తిరుగులేదని మరోసారి మలయాళీలు చాటుకున్నారు. డిటెక్టివ్ తరహా సినిమాలకు, సొసైటీలో జరిగే క్రైమ్ ను, సంఘటనలను ముడిపెట్టి వరస పెట్టి సినిమాలను తీస్తూ మలయాళీలు దూసుకుపోతున్నారు. ఓటీటీలో వాటి హవా కొనసాగుతూ ఉంది. ఈ మధ్యనే “కిష్కిందకాండం” అనే థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చి వీక్షకాదరణ పొందింది. ఇక ఎప్పుడా అని ఎదురుచూసిన “సూక్ష్మదర్శిని” కూడా జనవరి 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యింది.
తెలుగువాళ్లకు బాగా తెలిసిన నజ్రియా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఓటీటీ హిట్స్ తో బాగా పాపులర్ అయిన దర్శకుడు, నటుడు బాసిల్ మరో కీలక పాత్రను పోషించాడు. బ్రిలియంట్ స్క్రిప్ట్ తో, ఊహించని మలుపులతో ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ కథాంశం ఆపకుండా చూసేలా చేస్తుంది.
తమ పాతింటిలోకి తిరిగి వెళ్తుంది ఒక కుటుంబం. స్థానికంగా సక్సెస్ ఫుల్ బేకరినీ నడుపుకునే ఒక తల్లి, ఆమె కొడుకు తాము గతంలో బస చేసిన ఆ ఇంటికి వెళ్తుంది. స్థానికంగా కొందరు తెలిసిన వాళ్లు, మరి కొందరు వీరు ఆ చోటును ఖాళీ చేసి వెళ్లిన తర్వాత అద్దెలకు వచ్చిన వారు. ఆ కుటుంబ పెద్ద అయిన ఆ వృద్ధురాలికి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె న్యూజిలాండ్ లో ఒక స్టార్టప్ మొదలుపెట్టి ఉంటుంది. ఈ కుటుంబం అక్కడకు వచ్చాకా.. ఇరుగూపొరుగు వీరికి దగ్గరవుతారు.
అయితే ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ కొడుకు చుట్టుపక్కల వాళ్లతో చాలా స్ట్రాటజిక్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం మొదలు పెడతాడు. ప్రతి ఒక్కరితోనూ అతడి రిలేషన్ చాలా లెక్కల మేరకు ఉంటుంది. ఇంతలో వారి పక్కింట్లో బస చేసే నజ్రియా చూపు అతడిపై పడుతుంది. అతడి వ్యవహారాలు ఆమె చిత్రంగా కనిపిస్తాయి. జాబ్ లేక ఇంట్లో ఉన్న ఆమె అతడేం చేస్తుంటాడనే దాని మీద కన్నేస్తుంది.
మొదట్లో సరదాగా అనిపించే వ్యవహారాలు క్రమేపీ వేడెక్కుతాయి. ఆమె తనను గమనిస్తోందని గమనించిన అతడు ఆమెను హద్దుల్లో ఉండమంటాడు. అయితే అతడేదో చేస్తున్నాడనే ఆమె క్యూరియాసిటీ మరింత పెరిగి.. తన శోధనను కొనసాగిస్తుంది. ఆద్యంతం ఆసక్తిదాయంగా సాగే సినిమాగా సూక్ష్మదర్శిని సొసైటీలో జరిగే కొన్ని క్రైమ్ వార్తలను గుర్తు చేస్తుంది. సింపుల్ కథలనే ఆసక్తిదాయకంగా మలిచే మలయాళీ దర్శకుల, రచయితల సమర్థతను కూడా ఈ సినిమా చాటుతూ ఉంది.
సొసైటీలో నిత్యం జరిగే వివిధ రకాల నేరాలను కప్పిపుచ్చడం లేదా, వెలుగు తీయడం అనే కాన్సెప్ట్ లతో వారు థ్రిల్లింగ్ సినిమాలను అందిస్తూ ఉన్నారు. ఓటీటీల పుణ్యాన వాటికి రీచ్ బాగా పెరిగింది. ఇది వారికి మరింత ప్రోత్సాహకరంగా మారింది. దీంతో మరిన్ని నాణ్యమైన సినిమాలు వస్తున్నాయి.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
అసలు సిసలైన “అన్ ప్రెడిక్టబుల్”..
Excellent movie
Nice Movie.. Must watch..