క్షమాపణలు చెప్పిన దిల్ రాజు

దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు దిల్ రాజు.

“ఆంధ్రాలో సినిమా ఫంక్షన్ చేస్తే, అక్కడ ప్రజలు ఓ వైబ్ ఇస్తారు. అదే తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఇస్తారు.” తన సినిమా ఫంక్షన్ లో నిండు సభలో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ సంస్కృతిని అవహేహన చేశాడంటూ దిల్ రాజుపై కొందరు విరుచుకుపడుతున్నారు. దీంతో దిల్ రాజు దిగొచ్చారు. ఫంక్షన్ జరిగిన ఇన్ని రోజులకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు.

“ఆ ఈవెంట్ లో నేను మన దావత్ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్ గురించి చెప్పాను. నా మాటలతో తెలంగాణ కల్చర్ ను, ప్రజల్ని అవమానించానని కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అదే స్పీచ్ చివర్లో నేను క్లారిటీ ఇచ్చాను. ఓ నిజామాబాద్ వాసిగా తెలంగాణ కల్చర్ ను అభిమానిస్తానని చెప్పాను. అది అర్థం చేసుకోకుండా కొందరు రాద్దాంతం చేస్తున్నారు. నిజంగా నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి.”

తెలంగాణ సంస్కృతి-సంప్రదాయలకు తను ఎంతో విలువనిస్తానని.. వాటి నేపథ్యంలో వచ్చిన ఫిదా, బలగం సినిమాల్ని తనే నిర్మించిన విషయాన్ని అంతా గుర్తించాలని కోరుతున్నాడు దిల్ రాజు. తెలంగాణ వాసిగా కల్చర్ ను అభిమానించే తను, ఎందుకు హేళన చేస్తానని ప్రశ్నించాడు.

దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు దిల్ రాజు. ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తానని, రాజకీయాలు చేయనని అన్నాడు. ఇకపై అనవసరమైన ఇష్యూల్లోకి తనను లాగొద్దని రాజకీయ పార్టీలందరికీ విజ్ఞప్తి చేశాడు.

3 Replies to “క్షమాపణలు చెప్పిన దిల్ రాజు”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.