మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిలోని మూడు ప్రముఖ పార్టీలు తలా 85 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాయంటూ ప్రకటించారు కాంగ్రెస్ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు పటోలే. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ఒక్కోటి 85 సీట్లలో పోటీ చేస్తాయని, ఇంకో 15 సీట్ల విషయంలో మూడు పార్టీలు ఇచ్చిపుచ్చుకుంటాయని, మిగిలిన 18 సీట్లలో ఎస్పీతో సహా తమతో కలిసి వచ్చే చిన్నాచితక పార్టీలకు ఇవ్వబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. మహా ఘట్ బంధన్ లో సీట్ల లెక్క ఏ రకంగా తేలుతుందనే ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలూ సమాన స్థాయిలో సీట్లను పంచుకోవడం గమనార్హం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు దాదాపుగా సమాన స్థాయిలో సీట్లను నెగ్గాయి. చెరో నలభై స్థానాల్లో ఆ పార్టీలు గెలిచాయి. శివసేన వీటి కన్నా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను నెగ్గింది బీజేపీతో కలిసి పొత్తుతో. అయితే ఇప్పుడు మూడు పార్టీలూ సమాన స్థాయిలో సీట్లను పంచుకున్నాయి. సీట్ల లెక్కలు తేలిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే తన శివసేన తరఫున 65 సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.
మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది. బీజేపీ తరఫున తొలి జాబితా విడుదల అయ్యింది. ఆ పార్టీ ముఖ్యులు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. నవంబర్ 20 వతేదీన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున ఆ పార్టీ ప్రధానమైన షేర్ తీసుకుంది.
బీజేపీ ఏకంగా 150కి పైగా సీట్లలో పోటీ చేయనుంది. శివసేన షిండే పక్షం 80 సీట్ల వరకూ పొందగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 50 సీట్ల వరకూ పోటీ చేస్తూ ఉంది. రెండు కూటములు, రెండు పార్టీల చీలిక పక్షాలు చెరో రెండుగా రెండు వైపులా నిలుస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల హోరు ఆసక్తిదాయకంగా సాగుతూ ఉంది.
Call boy works 9989793850