పబ్ జీ ప్రేమాయణం.. మరో కొత్త ట్విస్ట్

పబ్ జీ ద్వారా ఓ భారతీయుడితో ప్రేమలో పడి, ప్రియుడ్ని కలిసేందుకు, తన భర్తను విడిచి, నలుగురు పిల్లలతో కలిసి ఇండియా చేరుకున్న ఓ పాకిస్థానీ మహిళ గురించి కొన్ని రోజుల కిందట గ్రేట్…

పబ్ జీ ద్వారా ఓ భారతీయుడితో ప్రేమలో పడి, ప్రియుడ్ని కలిసేందుకు, తన భర్తను విడిచి, నలుగురు పిల్లలతో కలిసి ఇండియా చేరుకున్న ఓ పాకిస్థానీ మహిళ గురించి కొన్ని రోజుల కిందట గ్రేట్ ఆంధ్ర కథనం ఇచ్చింది. వాళ్లను పోలీసులులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై వాళ్లు రిలీజ్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఇప్పుడీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ బయటపడింది.

ఆల్రెడీ పెళ్లి చేసుకున్న తర్వాతే అక్రమంగా భారత్ లోకి.
.
కరోనా టైమ్ లో ఢిల్లీకి చెందిన సచిన్, పాక్ కు చెందిన సీమా హైదర్.. పబ్ జీ ద్వారా పరిచయమయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడ్డానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు. కరోనా టైమ్ లో ఆన్ లైన్లో ప్రేమించుకున్న ఈ జంట.. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి చేసుకున్నారనేది ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ట్విస్ట్. అదెలా జరిగిందో చూద్దాం..

మార్చిలో పాకిస్థాన్ నుంచి నేపాల్ వచ్చింది సీమా. అదే టైమ్ లో ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లాడు సచిన్. ఇద్దరూ నేపాల్ లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు.

పాక్ చేరుకున్న తర్వాత సీమ్, తన భర్తతో తెగతెంపులు చేసుకుంది. తన వాటాగా వచ్చిన ఓ  ఇంటిని అమ్మేసి డబ్బు సమకూర్చుకుంది. తన నలుగురు పిల్లలతో కలిసి కరాచీ నుంచి దుబాయ్, అట్నుంచి నేపాల్ వెళ్లింది. నేపాల్ లో కొన్నాళ్లు గడిపిన తర్వాత బస్సులో ఢిల్లీకి చేరుకుంది.

అప్పటికే సీమా కోసం అన్నీ సెట్ చేసి పెట్టాడు సచిన్. ఆమె కోసం ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులోనే ఇద్దరూ కాపురం కూడా పెట్టారు. ఇంతలో ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. వాళ్లిద్దర్నీ అరెస్ట్ చేసి, కోర్టు ముందుంచారు.

ఈ ప్రేమ ఏ తీరానికి చేరుతుందో..

ప్రస్తుతానికైతే అక్రమంగా ప్రవేశించినందుకు సీమాపై, పాక్ దేశీయురాలికి ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ పై పోలీసులు కేసులు పెట్టారు. సీమపై గట్టి నిఘా ఉంచారు. అయితే సీమా మాత్రం తను తిరిగి పాకిస్థాన్ వెళ్లేది లేదని చెబుతోంది. సచిన్ తో తనకు పెళ్లయిందని, ప్రస్తుతం తను భారతీయురాలినేనని వాదిస్తోంది. పాకిస్థాన్ వెళ్తే అక్కడ తనను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తోంది సీమ. తన భార్యను వెనక్కు పంపాలంటూ సీమ హైదర్ భర్త ఇప్పటికే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.