గుర్తు తెలియ‌ని శ‌వాల‌ను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!

తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన వారిలో కొంద‌రి శ‌వాల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ఉండ‌టానికి నీటిలో విసిరేశార‌ని, ఆ నీటిలోనే మ‌ళ్లీ భ‌క్తులు స్నానాలు చేయాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు.

మ‌హాకుంభేమేలా సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిసలాట గురించి స‌మాజ్ వాదీ పార్టీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఉంది. కుంభ‌మేలాకు ఏర్పాట్ల‌ను చేయ‌డంలో యూపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని, వీఐపీ ఘాట్ ల‌పై పెట్టిన శ్ర‌ద్ధ సామాన్యుల కోసం చేసే ఏర్పాట్ల విష‌యంలో పెట్ట‌లేద‌ని అంటోంది.

కుంభ‌మేలా సంద‌ర్భంగా న‌మోదైన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ముప్పై మంది మ‌ర‌ణించిన‌ట్టుగా ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించినా.. అయితే అది అస‌లు నంబ‌ర్ కాద‌ని ఎస్పీ అంటోంది.

దీనిపై ఎస్పీ ఎంపీ, బాలీవుడ్ న‌టి జ‌య‌బాధురీ మాట్లాడుతూ.. తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన వారిలో కొంద‌రి శ‌వాల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ఉండ‌టానికి నీటిలో విసిరేశార‌ని, ఆ నీటిలోనే మ‌ళ్లీ భ‌క్తులు స్నానాలు చేయాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు. తొక్కిసలాట‌లో ముప్పై మంది క‌న్నా ఎక్కువ మంది మ‌ర‌ణించారని, ప్ర‌త్యేకించి ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌ని వారి శ‌వాలను నీటిలోకి విసిరేయించి ప్ర‌భుత్వం చేతులు దులుపుకుంద‌ని జ‌య‌బాధురీ వ్యాక్యానించారు.

అలా చేయ‌డం వ‌ల్ల కుంభ‌మేలాలో స్నానాలు ఆచ‌రించే భ‌క్తులు క‌లుషిత నీటిలో స్నానం చేయ‌డం అవుతుంద‌ని ఆమె అన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కూడా ఇప్ప‌టికే స్పందించారు. తొక్కిసలాటకు సంబంధించి ప్ర‌భుత్వం నిజాల‌ను తొక్కి పెట్టింద‌ని, దీనిపై కోర్టు ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌నే డిమాండ్ ను ఆయ‌న చేశారు.

4 Replies to “గుర్తు తెలియ‌ని శ‌వాల‌ను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!”

  1. orori yogi ika bulldozer teeseyro. orori yogi jaya madam meedaki pampeyi ro. orori yogi building koolchey ro. orori yogi nuvve next PM ro. Mana desam lo tallest leader meeda enti ee arachaka pracharam.

  2. ఈ ముండా వెళ్లి చూసిందటన దొంగ లంజ దాని మొఖం చూడండి ముందామోపిది మొగుడు ఉండగా కూడా బొట్టు పెట్టుకోలేదు .

Comments are closed.