ప్రధాని మోదీకి భయపడుతున్న జగన్?

ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అయినట్లు, జగన్ లో ఉన్న మునుపటి ఫైర్ మొత్తం బెలూన్ లో గాలి పోయినట్లు తుస్సుమని మాయమయిపోవడంతో పాటు..

వైయస్ జగన్ 36 ఏళ్ళ వయస్సులోనే సోనియాగాంధీని ఎదిరించి మొక్కవోని దీక్షతో ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం కోపానికి బలై 16 నెలలు జైలు జీవితం గడిపి తన రాజకీయ జీవితంతో పాటు, తండ్రిని కోల్పోయి పెద్ద దిక్కుగా ఉండవలసిన తన సొంత కుటుంబాన్ని కూడా క్రాస్ రోడ్ లో నిలబెట్టి ఎటు పోతున్నాడో.. ఎలా పోతున్నాడో.. తన అడుగులు ఎలా వేయాలనుకుంటున్నాడో ఎవ్వరికి అంతుబట్టని విషయంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు.

జైలు నుంచి బయటకు వచ్చి ఎన్నికలలో అన్ని పార్టీలు ఏకమై వచ్చినా కలబడి, తలబడి ఒక్కడిగా పోరాటం చేసి 67 సీట్లతో ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఒక్కడిగా నిలబడి అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. జగన్ ను ఎన్ని రకాలుగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసినా వెనక్కు తగ్గకుండా మీడియా ముందు అతడు అనర్గళంగా మాట్లాడుతూ ఎవరినైనా తాను ఎదిరించగలనని, సోనియానే ఎదిరించిన నాకు చంద్రబాబు ఒక లెక్కా అన్న రీతిలో అతడి రాజకీయ ప్రయాణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేదీప్యమానంగా ముందుకు సాగింది.

ఎప్పుడైతే 2019 లో జగన్ సీఎంగా అధికారాన్ని చేపట్టాడో అతడిలో ఫైర్, పవర్, ఖలేజా అన్ని గాలిలో కలిసిపోయినట్లు అతడు వ్యవహరించిన తీరు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. మీడియా ముందుకు రావడానికి, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి జంకుతూ చేతులు నలుపుకుంటూ, అలా అలా పక్కకు ఊపుకుంటూ సైలెంట్ గా తప్పించుకోవడంతో పాటు యెల్లో మీడియా జర్నలిస్టులు ప్రశ్నలు అడగకుండా అడ్డగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.

తాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా, అక్కడ నుంచే ముఖ్యమంత్రిగా వ్యవహారాలు చక్కబెడుతు తానొక రాజులుగా ఊహించుకుంటూ ఊహాలోకంలో మునిగిపోయాడు. ఎప్పుడైతే 2024 ఎన్నికలలో ప్రతిపక్ష హోదాతో పాటు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులందరినీ కూటమి ప్రభుత్వం చాప చుట్టేసి మూలాన కుర్చోపెట్టడంతో తాను తప్ప ప్రజలకు ఇంకొక నాయకుడు రాబోయే ముప్పయేళ్లలో లేడని భావించిన జగన్ నిజంగా కంగుతిన్నాడని చెప్పుకోవచ్చు.

మొదటిసారి 2024 ఎన్నికలలో ఓటమి తరువాత ప్రెస్ ముందుకు వచ్చి ఎన్నికలలో ఏదో జరిగిపోయిందని, దానికి ఆధారాలు లేవని ఇప్పుడు ఏమి చేయలేమని నిస్తేజంతో జగన్ చెప్పిన మాటలు వింటే చంద్రబాబు అండ్ కో సెంట్రల్ లో ఉన్న మోదీతో కలసి ఏదో చేసారని అందుకే జగన్ ప్రభుత్వం ఇంత చిత్తు చిత్తుగా ఓడిపోయిందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత వైయస్ జగన్ ప్రజలు 11 సీట్లకు ఎందకు పరిమితం చేశారని, నిజంగా ఈవియంల లోపం ఉందా లేక తన ప్రభుత్వ పనితీరు అంత అధ్వానంగా ఉందా అని వచ్చిన ఫలితాల మీద విశ్లేషించడం పక్కన పెట్టి, తాను తిరిగి వచ్చే ఎన్నికలలో గెలుస్తానని కొత్త పాట పడుతున్నాడే తప్ప నిజంగా ఎన్నికలలో మ్యానిపులేషన్ జరిగి ఈవియమ్ ట్యాపరింగ్ జరిగి ఉందని భావిస్తే ఎందుకు పోరాటం చేయడం లేదని పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది.

మూడు రోజుల క్రితం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ తనకు మొదటి రౌండ్ లోనే అర్థమైందని, ఈ ఎన్నికలలో ఏదో చేసారని అందుకే తమకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. మరొక వైపున అసెంబ్లీ ఫలితాలు పార్లమెంట్ ఫలితాల తీవ్ర వ్యత్యాసం ఉండటంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలు కొన్ని వార్డులలో కనపడుతున్నా, జగన్ ఇప్పటి వరకు తిరిగి నోరు మెదకపోవడం చూస్తుంటే అతడు తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాడే తప్ప తనను నమ్ముకున్న వారికోసం బలంగా నిలబడాలని ఆలోచించడం లేదని అనిపించడంతో ఎలాంటి సందేహం లేదు.

సోనియా గాంధీనే ఎదిరించిన జగన్ కు ఈవియంల మీద పోరాటం చేయడం ఒక లెక్కా అని వైసీపీ కార్యకర్తలు ఓటమి చెందిన కొత్తలో ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అయినట్లు, జగన్ లో ఉన్న మునుపటి ఫైర్ మొత్తం బెలూన్ లో గాలి పోయినట్లు తుస్సుమని మాయమయిపోవడంతో పాటు, తాను కనుక ఈవియంల విషయంపై నోరు మెదిపితే ఎక్కడ తన పాత కేసులు బయటకు తీసి ముప్పుతిప్పలు పెడతారేమోననే భయం అతడిని తీవ్రంగా వెంటాడుతోందని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది.

అందుకే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి వచ్చే ఎన్నికలలో నేనే గెలుస్తానని, చంద్రబాబు ఏమి చేయలేడని తానే రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడగలనని చెట్టు కింద ప్లీడర్ లెక్క తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సొరకాయ కోతలు కోస్తూ చొక్కా నలగకుండా ఇంట్లో కూర్చుని ఎంచక్కా లెక్కలు, ఎక్కాలు అన్ని చెబుతూ వారానికి ఒకరోజు టీవీల ముందు తనకు రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతూ కాలం వెల్లదీస్తున్నాడు.

శ్రీకాంత్ రెడ్డి గుదిబండి

38 Replies to “ప్రధాని మోదీకి భయపడుతున్న జగన్?”

  1. 2019 వరకు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు కి 2019 లో 23 సీట్లు ఇచ్చారు. జగన్ చంద్రబాబు కంటే తీసికట్టు గా పాలించాడు, అందుకే కేవలం 11 ఇచ్చారు.

    1. Kani ఇక్కడ చిన్న తేడా ఉంది జగన్ కు ఎక్కువ మంది ఇచ్ఛ8ంది బాబు సర్8గా చెయ్యక కాదు .ఇంతకన్నా.కుర్రాడు వస్తే ఎలాగో చూద్దాం అని కానీ.అన్యాయంగా పాలించాడు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేశాడు దాంతో ఇక చేసేది లేక మల్ల టీడీపీ కి ఇచ్చారు జగన్ ను.మరి నమంక పోవచ్చు అనేది నా.ఊహ

  2. ఇంకా evm la. మీద.నమ్ముకుంటున్నారు . కుక్క తోక వంకర .ఎన్నికల్లో ప్రజలు ఊహలు ఆలోచనలు వేరు .6 నెలపల్ కృతం వద్దనుకున్న బీజేపీ మీ మహరాష్ట్ర లో గెలిపించారు అవినీతి చేసారు అని.చెప్పిన శిబూ సోరేన్ ను నెత్తిన పెట్టుకున్నారు . ప్రజల ఊహలు అర్థం.కావు అది వదిలేసి evm.laa మీద ఏడుపు ఇంటి . అలా అయితే 2014 19 లో మీకు అవే evm. లతో మంచి సీట్లు వచ్చాయి గదా రా నాయనా

  3. 2014. లోను .2019 లోనూ మీకు అదే e v m లతోనే కదరా మంచి సీట్లు వచ్చాయి .మర్చిపోయావా రా అయ్యా

  4. అదేంటి? మోదీ గారికి అత్యంత ఇస్టుడైన మన మాజీ సిఎం గారు… మోదీ గారికే భయపడడమా?ఎన్నికల ప్రచారం లో జగన్ గారినీ విమర్శించలేదు అన్నారు. పవన్ గారికి రోజుల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళూ వాళ్ళూ ఒకటి అయ్యారు. మనమే ఎటూ కాకుండా పోయాం

  5. ఇప్పుడు ఈవీఎం ల మీద ఎవడు మాట్లాడిన నవ్వుతారు వాడికి తెలిసింది నీకు తెలియట్లేదు

  6. ఈ నాయకుల అభిమానులు ఏమిటో మా బాబు బంగారం అనుకుంటూ ఉంటారు.

    జగనన్న నా*య*న ఎవరితో మితి మీరి శత్రుత్వం తెచ్చుకోలేదు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, సరిగా ఎన్నికల అప్పుడు కేంద్రం రుణ మాఫీ ప్రకటించింది. ప్రతిపక్షం ఓట్లు చీల్చుకోవడానికి రెండు కొత్త పార్టీ లు. అయినా మెజారిటీ కి ఎనిమిది సీట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుని బయట పడ్డాడు.

    పై గుణాలు ఏమీ లేకపోయినా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా ఓడిపోయాం అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు.

  7. 2024 గెలుపు, మందు ధరలు బాగా తగ్గిస్తారని భావించి తాగుబోతులు ఏకపక్షంగా & కసిగా వేసిన ఓట్లతో వచ్చింది మాత్రమే… అతిగా ఊహించుకుంటే రాతలు మరల మారడం ఖాయం… 23 కాస్త 164 అయినట్ట్లే 11 కూడా 88+ అవడం impossible ఏమీ కాదు

  8. అన్నకి తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాడే తప్ప తనను నమ్ముకున్న వారి కోసం నిలబడాలి అనే ఆలోచనే లేదు. –

    -ఇది ఎంత త్వరగా తెలుసు కుంటే కార్యకర్తలకి అంత మంచిది 

  9. నీ సైట్ వ్యూస్ పెంచుకోవటం కోసం ఏవో ఆర్టికల్స్ వదులుతున్నావు గ. నీ కష్టం పగవానికి కూడా రావద్దు.

  10. సందింటి..అంటే సందులో వుండే ఇంట్లో.. అన్నకి ప్రపంచ దేశాల్లో మన్ననలు పొందుతున్న మోదీ అంటే భయమా.…

    .

    వాట్ ఆర్ యు టాకింగ్ బుల్రెడ్డి..

  11. వైఎస్ఆర్ నిజమైన ఫ్యాన్స్ మీసాలు గొరిగించుకుని అందరూ గా*జులు తొడుక్కుని వున్నారు లాగ వుంది.

    వైఎస్ఆర్ సొంత భార్య పైన ఆస్తుల కోసం కే*సు పెట్టిన వాడి మ*దం అ*ణచకుండ వాడి కాళ్ళు నాకుతున్నారు.

  12. మనోడి పెతాపం అంతా కూడా విధ*వ లైన ఆడోల్ల మీదనే ఆన్న మాట ( సోని*యా, విజయ*మ్మ).

    మగాళ్ళ ముందు పిల్లి లాగ ఉ*చ్చ పోసుకుంటాడు.

    వాడికి గ్రేట్ ఆంద్ర వత్తా*సు..

  13. అయ్యా శ్రీకాంత్ రెడ్డి మీలాంటి వాళ్లే గుడి బండ లు గా తయ్యారయ్యారు..
    నువ్వు నీ కథనం ఆదివారం మిగిలినా పులిసిపోయిన పులుసు తిని వచ్చి ఇలాంటి ఆర్టికల్స్ రాసి ఎవ్వరని రెచ్చగొడదాం అనుకుంటున్నావ్..
    100 కి 100 తప్పులు చేసి కులాల పేరుతో సమాజాన్ని వీడ గొట్టి లబ్ది పొందడం అని చూసినప్పుడే పార్టీ దిగజారి బంగాళాఖాతంలో కలిసిపోయింది...
    నువ్వు నీ EVM వచ్చే ఎన్నికలలో కూడా మనకి 30 ధాతవ్

Comments are closed.