ఫ‌లించిన తిరుప‌తి ఎంపీ కృషి… జ‌న‌ర‌ల్ కోచ్‌ల పెంపు!

సామాన్య ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌ను పెంచాల‌నే తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి పోరాటం ఎట్ట‌కేల‌కు సత్ఫ‌లితాల్ని ఇచ్చింది. ఈ నెలాఖ‌రు నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో మ‌రో…

సామాన్య ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌ను పెంచాల‌నే తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి పోరాటం ఎట్ట‌కేల‌కు సత్ఫ‌లితాల్ని ఇచ్చింది. ఈ నెలాఖ‌రు నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో మ‌రో రెండు జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌ను పెంచాల‌ని రైల్వేబ‌డ్జెట్ చ‌ర్చ‌లో భాగంగా పార్ల‌మెంట్‌లో గురుమూర్తి డిమాండ్ చేశారు.

అలాగే రైల్వేశాఖ‌కు గురుమూర్తి విన‌తిప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఈ నేప‌థ్యంలో గురుమూర్తి కృషి, అలాగే కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా ఆలోచించింది. ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టికే ఉన్న రెండు జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌కు మ‌రో రెండు కోచ్‌ల‌ను జ‌త చేయ‌డానికి రైల్వేశాఖ ముందుకు రావ‌డం విశేషం.

రైల్వే బ‌డ్జెట్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో జ‌ర్న‌లిస్టుల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కోవిడ్ స‌మ‌యంలో ఎత్తేసిన రాయితీని పున‌రుద్ధ‌రించాల‌ని కూడా ఎంపీ నాడు కోరారు. ఇదే సంద‌ర్భంలో కోవిడ్ స‌మ‌యంలో కొన్ని స్టేష‌న్ల‌లో నిలిపివేసిన రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఎంపీ కోరారు. వీటిపై ఇప్ప‌టికే రైల్వేశాఖ సానుకూల నిర్ణ‌యం తీసుకుంది. రైల్వేశాఖ‌కు గురుమూర్తి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

14 Replies to “ఫ‌లించిన తిరుప‌తి ఎంపీ కృషి… జ‌న‌ర‌ల్ కోచ్‌ల పెంపు!”

  1. జనరల్ బోగీలను తగ్గించడంతో చాలామంది సామాన్యులు రిజర్వేషన్ లేకున్నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లలో, 3 ఏసీ బోగీల్లో దౌర్జన్యంగా ఎక్కి చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం జనరల్ బోగీలు పెంచడమే

  2. ఎక్కడ డిమాండ్ , రాబడి ఉంటే అక్కడ పెంచుకోవడానికి రైల్వే అధికారులకు అవకాశం ఉండాలి ప్రతిదానికి మంత్రి , ఎంపీ అంటే ఎప్పటికీ బాగుపడేను

  3. మిడిల్ క్లాస్ ఎక్కవ ట్రావెల్ చేసే రూట్ లలో ఒక పది జనరల్ బోగీ లు పెట్టడానికి నొప్పి ఏంది ?

    అందులో టిక్కెట్ తీసు కో నీ వాళ్ళని రైలు స్టేషన్ లో ప్లాట్ఫారం మీదనే అందరికీ కనిపించే తట్లు ఓపెన్ జైలు లాగ పెట్టీ వాటిలో నిలబెడితే సరి, మిగతా వాళ్ళు కూడా సిగ్గు తో టిక్కెట్ యెగ్గొట్టరు.

Comments are closed.