తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ తీవ్ర వివాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పోస్టు ఏంటో చూద్దాం.
“రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది
అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి
పిల్ల చేష్టలు, గారడీ మాటలు,లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్
నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది
ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి
తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి
మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా?
ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా?
ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్?
చెప్పేటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు” అని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కూడా స్థానిక ఆదివాసీలు దాడికి దిగారు. దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర వుందని అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. కేసుల భయంతో చాలా మంది వూళ్లు వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరికొందరు అరెస్టయి జైల్లో వుంటున్నారు. ఇటీవల వారిని కేటీఆర్ పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌పై విరుచుకుపడడాన్ని చూడొచ్చు.
vc estanu 9380537747
Call boy jobs available 7997531004