పవన్ కల్యాణ్ కోరిక నెరవేరుతోందా?

శత్రువును బద్నాం చేయడం ముఖ్యం. ప్రత్యర్థి గనుక.. తాము చేసే విమర్శలకు ఒక స్థాయి వరకే ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అదే శత్రుకూటమి నుంచి ఒకరిని లోబరచుకుని.. అతని ద్వారా ఆ శత్రువు గురించిన…

శత్రువును బద్నాం చేయడం ముఖ్యం. ప్రత్యర్థి గనుక.. తాము చేసే విమర్శలకు ఒక స్థాయి వరకే ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అదే శత్రుకూటమి నుంచి ఒకరిని లోబరచుకుని.. అతని ద్వారా ఆ శత్రువు గురించిన రహస్యాలను, లోపలి సంగతులను అన్నింటినీ బయటపెడితే.. వాటికి ప్రజల్లో కొంచెం నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఆ శత్రుకూటమిలో కీలకంగా ఉన్నవాడిని లోబరచుకుని, తమ వైపు తిప్పుకుని.. అతని ద్వారా అబద్ధాలు చెప్పించినా కూడా ప్రజలు వాటిని నమ్మేస్తారు.

ఏవి నిజాలో ఏది అబద్ధాలో మనం ఇదమిత్థంగా తేల్చిచెప్పలేం గానీ.. ప్రస్తుతం ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడంలో పవన్ కల్యాణ్ బాగానే సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొన్నమొన్నటిదాకా కీలకంగా మెలగుతూ.. పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఫిరాయించి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ రకంగా వాడుకోవడంలో పవన్ కల్యాణ్ కృతకృత్యులు అయినట్టుగానే కనిపిస్తోంది.

బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తాను ఉండగా ఇలా జరిగింది.. అలా జరిగింది.. అంటూ అనేక సంగతులు వెల్లడిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి తనకు వరుసకు మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పట్లో నెత్తిన పెట్టుకున్నారు. పార్టీలో ఎవ్వరికీ ఇవ్వని ప్రాధాన్యం ఆయనకు దక్కిందంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అలాంటి ప్రాధాన్యాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారనే పేరుంది.

సొంత జిల్లా మీద కూడా పూర్తిస్థాయిలో పట్టులేని బాలినేని శ్రీనివాసరెడ్డిని కేవలం బంధుప్రీతితో చాన్నాళ్లపాటు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతల్లో ఉంచారు జగన్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయనను విద్యుత్తు శాఖ మంత్రిని చేశారు. అప్పట్లోనే సగం పరిపాలన కాలం గడిచిన తర్వాత.. కేబినెట్ పూర్తిగా మారుతుందని, కొత్తమంత్రులు వస్తారని జగన్ ముందే ప్రకటించారు.

సుమారు మూడేళ్ల తర్వాత.. కేబినెట్లో మార్పులు జరిగినప్పుడు బాలినేని పదవి పోయింది. తన పదవి పోయినందుకు కాదు గానీ.. పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన వంటి అనేక మందిని తిరిగి కొనసాగించినా తనకు అలాంటి అలాంటి చాన్స్ ఇవ్వనందుకు ఆయన అలిగారు. అడపాదడపా జగన్ గురించి పార్టీ గురించి చురుక్కుమనిపించే మాటలు వదులుతూనే వచ్చారు.

తీరా ఎన్నికల సమయానికి ఆయన ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కావాలని పట్టుబట్టడం, కుదరదని జగన్ చెప్పడంతో అలగడం, చివరికి రాజీపడి ఎమ్మెల్యేగా పోటీచేయడం జరిగాయి. ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేదు. పార్టీ ఓడిపోవడంతో.. ఫిరాయించి జనసేన పంచకు చేరారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ చేతి అస్త్రంగా మారారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. తాను మంత్రిగా ఉంటూ తనకు తెలియకుండానే ఒప్పందాలు జరిగాయని, తన సంతకాలే లేవని ఇప్పుడు చెబుతున్నారు. జగన్ కేబినెట్లోని మంత్రిగా ఆయన ఇప్పుడు ఏం చెబితే అదంతా నిజమేనని ప్రజలు నమ్మాలా? జగన్ మీద ఎటూ ఆయన ప్రతీకార ధోరణిలో ఉన్నారు గనుక.. ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి కూడా అవకాశం ఉన్నది కదా.. అనేది పలువురికి కలుగుతున్న సందేహం. ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా? అని కూడా అనుకుంటున్నారు.

మొత్తానికి బాలినేని ద్వారా ‘అప్పటి సంగతులు’ అంటూ చెప్పించడం ద్వారా.. పవన్ కల్యాణ్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువును బద్నాం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

17 Replies to “పవన్ కల్యాణ్ కోరిక నెరవేరుతోందా?”

  1. బాలినేని గారికి సొంత జిల్లాలో పట్టు లేదని మీరేందుకు అనుకుంటున్నారు? బాలినేని గారి లేని లోటు ఒంగోలు లో మీకు ఇంకా కనిపించకపోతే మీ ఖర్మ.

  2. Mari inni telisinappudu Mee jagan anna ki cheppalekapoyava aa time lo Bali neni gurinchi…ippudu aa party nunchi cheptunnadu ane ga ee sollu antha rastunnav😂

  3. కేసు అమెరికా నిఘా సంస్థ ల చేతిలో ఉంది. అనవసరం గా సానుభూతి చూపించి పీకల మీదకి తెచ్చుకోక. చాలా కొత్త సినిమాలు వస్తాన్నాయి రివ్యూ లు చాలు మనకి, బోలెడు వ్యూస్ ఉంటాయి. ఎందుకీ సంత చెప్పు మనకి.

  4. balineni gaaru nenu sign cheyaledhu annaaru. mari ayana sign vunna doc nuvvu chppinchara ebraasi vedhava venkat reddy. appudu balineni vedhava ani voppukuntaam. ledante nuvvu vedhavannara vedhava ani voppukuntaava GA venkat reddy?

  5. 6 నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేశారు..

    అర అడుగు రోడ్ వెయ్యలేదు.. ఇంతవరుకు

    ఎక్కడ చూసిన రోడ్స్ అన్నీ గుంతలు ..

    కనీసం వాటిని కూడా కవర్ చెయ్యడం లేదు

    వేసినవి కూడా రొండో రోజే పోతున్నాయి..

    అంత క్వాలిటీ తో వేస్తున్నారు మరి..

  6. 6 నెలలు అయింది .. అధికారంలోకి వచ్చి..

    ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు…

    ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు..

    పోలవరం కోసం జగన్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇస్తే.. వాటిని ఎం చేశారో తెలీదు

    ఇసుక పేరుతో విపరీత దోపిడీ

    మందు పేరుతో ఇంకో దోపిడీ..

    dsc ఇప్పటికే ఎన్ని వాయిదాలు పడిందో వాళ్ళకే తెలీదు

    6 నెలలలలోనే 65 వేల కోట్ల అప్పు చేశారు..

    ఆ డబ్బు అంత ఏమైందో ఇంతవరకూ తెలీదు

    ఎంప్లాయిస్ కి ఇస్తామన్న ఒకటో తారీకు శాలరీ మొదటి నెలతో సరి..

    మెడికల్ కాలేజెస్ ఎత్తిపోయాయ్.

    స్కూల్స్ ఎత్తిపోయాయ్

    cbse సిలబస్ ఎత్తిపోయింది..

    ఐబీ ఎత్తిపోయింది

    కంపెనీ ల మీద దాడులు మొన్న (యూబీ మీద, నిన్న ఆదానీ మీద… ఇంకా ఎన్నో )

    ఎన్నో మంచి systems మొత్తం నాశనం …

    ఎంత కసి ఉందొ ఈ రాష్ట్రము మీద… 5 ఏళ్ళు దూరంగా ఉంచారని.. వీళ్ళ సంగతి ఎలా చూడాలో చూస్తాం అని..

    ఎందుకు ఈ పగ… ఈ కక్ష్యా. ?

  7. There are many many disgruntled and frustrated politicians. It doesn’t mean that Pawan has to use them to tarnish somebody as he doesn’t know how to do it because he was never in power.More over, he doesnt need to do it as jagu is already at ADHAH PAATHALUM. Balineni out of the need to make his presence felt, may have probably came out like this.

  8. 24 గంటల లోపల అంత పెద్ద ఫైల్ అప్రూవ్ ఎలా చేసారు బా*నిస బుద్ధి కట్టు బాని*స గ్రేట్ ఆంద్ర?

    ఆ 1700 కోట్లు లో నీకు ఒక లక్ష బిచ్చం కింద వేసేసరికి , వంటి మీద బట్ట నిలవడం లేదు.

Comments are closed.