ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్‌నే న‌మ్ముకుంటున్న బాబు!

కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు దాటింది. ఇప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, కూట‌మి నాయ‌కులు మాట‌కు ముందు, త‌ర్వాత వైసీపీ స‌ర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తిదానికీ వైసీపీ…

కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు దాటింది. ఇప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, కూట‌మి నాయ‌కులు మాట‌కు ముందు, త‌ర్వాత వైసీపీ స‌ర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తిదానికీ వైసీపీ ప్ర‌భుత్వ పాపాలే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తుండ‌డం వినేవాళ్ల‌కు ఎబ్బెట్టుగా వుంటోంది.

వైసీపీ పాల‌న బాగాలేద‌నే క‌దా మీకు అధికారం క‌ట్ట‌బెట్టింది అని జ‌నం అంటున్నారు. చంద్ర‌బాబునాయుడు ఇంకా త‌న మార్క్ రాజ‌కీయాల‌తో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌వ‌య్యా సామి అంటే, సూప‌ర్ సిక్స్ హామీలు ఇచ్చామ‌ని, కానీ ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీగా వుండ‌డం చూసి భ‌య‌మేస్తోంద‌ని చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. ఇలాంటి మొస‌లి కన్నీళ్లు ఎవ‌ర్ని మ‌భ్య‌పెట్ట‌డానికి అనే ప్ర‌శ్న పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

అంత‌కు ముందు 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర బ‌డ్జెట్ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టానుసారం హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఏమైనా అడిగితే, గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల్ని నాశ‌నం చేసింద‌ని, చ‌క్క‌దిద్ద‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అలాగే సంప‌ద సృష్టించ‌డానికి కొంత టైమ్ తీసుకుంటుంద‌ని చెప్ప‌డం ద్వారా… ఇప్ప‌ట్లో సూప‌ర్ సిక్స్‌లోని ప్ర‌ధాన హామీల్ని నెర‌వేర్చ‌లేమ‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయ్యింది.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చ‌క్క‌గా మాట‌ల‌తో కాల‌యాప‌న చేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏదైనా చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం గ‌త ప్ర‌భుత్వ‌మ‌ని మాత్రం చ‌క్క‌గా చెబుతున్నారు. అప‌రిమిత‌మైన అధికారాన్ని కూట‌మికి క‌ట్ట‌బెట్టింది… మంచి చేయ‌డానికి. అంతేకానీ, దోచుకోడానికి కాద‌ని గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది.

ఉచిత ఇసుక‌, మ‌ట్టి విష‌యంలో ప్ర‌భుత్వ హామీ ఏమైందో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గుర్తు పెట్టుకుంటార‌ని చంద్ర‌బాబు తెలుసుకోవాలి. అలాగే మ‌ద్యం దుకాణాలు విచ్చ‌ల‌విడిగా ఎక్క‌డ చూసినా క‌నిపిస్తున్నాయి. తల్లికి వంద‌నం, రైతు భ‌రోసా, అలాగే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, వాలంటీర్ల‌కు చేసిన మోసం, ఏడాడికి మూడు సిలిండ‌ర్ల‌కు సంబంధించి 40 ల‌క్ష‌ల మందికి కోత‌, అంగ‌న్‌వాడీల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు…ఇలా ఒక‌టేమిటి, రానున్న రోజుల్లో అన్నీ చుట్టుముట్ట‌నున్నాయి. కావున చంద్ర‌బాబు స‌ర్కార్ గ‌తంపై నెట్టేసి, వ‌ర్త‌మానాన్ని విస్మ‌రిస్తే, ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవాల్సి వుంటుంది.

24 Replies to “ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్‌నే న‌మ్ముకుంటున్న బాబు!”

  1. అయిదు నెలల్లో .. 3 లక్షల కోట్లు పెట్టుబడులకు సంతకాలు చేసుకొన్నారు..

    సుమారు 2 లక్షల ఉద్యోగాలు .. మరో 3 లక్షల ఉద్యోగాలు / ఉపాధి ఇండైరెక్ట్ గా కలగబోతున్నాయి..

    లోకేష్ అమెరికా ట్రిప్.. తొందరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు..

    ఎంతసేపు.. సంక్షేమ పథకాలు ఇవ్వలేదనే గోల.. మాకు వినాలని లేదు..

    ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి .. అభివృద్ధి చెందాలనే తపన ఈ ప్రభుత్వానికి ఉంది..

    ..

    ముష్టి పడేస్తే.. ఓట్లు వేస్తారు అనుకొనే నాయకులకు.. 11 ముష్టి పడేసి శాశ్వతం గా బెంగుళూరు కి తరిమేశారు ప్రజలు..

    ఆ విషయమే చంద్రబాబు చెపుతుంటారు.. మనం కూడా గుర్తుంచుకోవాలి..

    జగన్ రెడ్డి లాంటి నీచుడు, రాక్షసుడిని చిత్తు చిత్తు గా ఓడించిన ఆనందం లో ప్రజలు ఉన్నారు..

    1. ప్రతిష్టాత్మక మంగళగిరి ఎయిమ్స్ కి కనీసం మంచి నీళ్ల సదుపాయం కలిగించలేకపోయాడు జగన్ రెడ్డి..

      ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే హుటాహుటిన వాటర్ ప్లాంట్ , శుద్ధి, స్టోరేజ్.. సదుపాయాలూ మొదలుపెట్టారు.. డిసెంబర్ లో అందుబాటులోకి..

      ..

      కనీసం రోడ్స్ సదుపాయం కూడా ఉండేది కాదు..

      జనవరి కల్లా రోడ్లన్నీ టెంపరరీ గా ఫిక్స్ చేసి.. మళ్ళీ శాశ్వత రోడ్లు వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు..

      ..

      గ్రామ పంచాయితీల్లో పైసా ఉండేది కాదు.. పారిశుధ్యం, స్ట్రీట్ లైట్స్, బేసిక్ నీడ్స్ కి కూడా డబ్బు లేదు..

      పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే.. గ్రామా పంచాయితీలకు ఫండ్స్ ఇచ్చి.. పనులను అన్ని ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ముందుకు వెళుతున్నారు..

      అభివృద్ధి అంటే.. ప్రజల కు స్వేచ్ఛ ని ఇవ్వడం.. వాళ్ళు వాళ్ళ అవసరాలను బాహాటం గా ప్రభుత్వానికి చెప్పుకోగలుగుతున్నారు..

      అదే ప్రజలు కోరుకున్నారు.. అందుకే కూటమిని గెలిపించారు..

      మేము గెలిచాం.. గెలుస్తూనే ఉంటాం..

      1. Already roads veyatam start ayyayi. Nenu unna placelo chusi cheptunnavi. Kanuru, tadigadapa, poranki and penamaluru roads 30% kante thakkuva paadu ayina chota repairs antha kante ekkuva paadu ayina chota kotha roads vestunnaru. Amaravathi lo aagha meghalameeda registrations jarugutunnayi sankranthi numchi works start avutundi

  2. క్రిమినల్ గాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా తయారు అవుతుందో ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలిగా, తిరిగి ఆ తప్పు చేయకుండా!!

  3. రాష్ట్రం లో ప్రతి కుటుంబానికి హైదరాబాద్ కి కనెక్షన్ వుంది.. అందరూ హైదరాబాద్ వస్తూ వుంటారు… ఈ మహానగరం చూసి.. ఇలాంటి నగరం లేదు అని అందరూ అనుకుంటారు..

    ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి పదం లోకి ప్రయాణం మొదలు పెట్టింది…

    తెలంగాణ కి హైదరాబాద్ తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు..

    కానీ ఆంధ్రా కి వైజాగ్, కాకినాడ, తిరుపతి లాంటి సిటీలు… వున్నాయి… అన్నియ 5 ఏళ్ళు పంచుకుంటూ మిగబెట్టాడు..

    పధకాలు అమలు చేయాలి అంటే అప్పులు చేయాలి… వాటికి వడ్డీలు.. ఇంక రాష్ట్రం ముందుకు వెళ్ళేది ఎప్పుడు?

    ఇంకా పథకాలు ఇసుక మందు… ఇసుక దగ్గరే ఆగిపోతే ఇంతే సంగతులు

  4. సొంతంగా ఏమీ చేసే టాలెంట్ లేనప్పుడు అవతల వాళ్ళ మీద పది ఏడవడమే కదా చెయ్య గలిగేది.. ఇంకేముంటుంది.. ?

  5. నువ్వు చెప్పినట్లు “అపరిమితమైన అధికారాన్ని కూటమికి ఇచ్చింది..మంచి చేయటానికి, దొచ్చుకోవటానికి కాదు.” ఇంకోటి మర్చిపోయినట్లునావు, “గత ప్రభుత్వం దోచుకున్నది వడ్డీతో సహా సెటిల్ చేయటానికి”.

  6. సొంతంగా ఏమీ చేసే టాలెంట్ లేనప్పుడు అవతల వాళ్ళ మీద పది ఏడవడమే కదా చెయ్య గలిగేది.. ఇంకేముంటుంది.. ?

  7. 6 నెలలు అయింది .. అధికారంలోకి వచ్చి..

    ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు…

    ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు..

    పోలవరం కోసం జగన్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇస్తే.. వాటిని ఎం చేశారో తెలీదు

    ఇసుక పేరుతో విపరీత దోపిడీ

    మందు పేరుతో ఇంకో దోపిడీ..

    dsc ఇప్పటికే ఎన్ని వాయిదాలు పడిందో వాళ్ళకే తెలీదు

    6 నెలలలలోనే 65 వేల కోట్ల అప్పు చేశారు..

    ఆ డబ్బు అంత ఏమైందో ఇంతవరకూ తెలీదు

    ఎంప్లాయిస్ కి ఇస్తామన్న ఒకటో తారీకు శాలరీ మొదటి నెలతో సరి..

    మెడికల్ కాలేజెస్ ఎత్తిపోయాయ్.

    స్కూల్స్ ఎత్తిపోయాయ్

    cbse సిలబస్ ఎత్తిపోయింది..

    ఐబీ ఎత్తిపోయింది

    కంపెనీ ల మీద దాడులు మొన్న (యూబీ మీద, నిన్న ఆదానీ మీద… ఇంకా ఎన్నో )

    ఎన్నో మంచి systems మొత్తం నాశనం …

    ఎంత కసి ఉందొ ఈ రాష్ట్రము మీద… 5 ఏళ్ళు దూరంగా ఉంచారని.. వీళ్ళ సంగతి ఎలా చూడాలో చూస్తాం అని..

    ఎందుకు ఈ పగ… ఈ కక్ష్యా. ?

    1. మీ ప్రశ్నలు సహేతుకమైతే.. జగన్ రెడ్డి లాంటి సింగల్ సింహాలు అసెంబ్లీ కి వెళ్లి .. ఈ ప్రశ్నలతో హోరెత్తించి నిలదీయొచ్చు..

      వాడికి అక్కరలేని విషయాలు.. మీకెందుకండీ..

      వాడే తడిగుడ్డ వేసుకుని హాయిగా బజ్జున్నాడు.. మీరు కూడా తొంగోండి ..

      1. మేము తొంగుంటే హాయిగా మీరు నచ్చినంత దోచుకోవచ్చనా.. ?

        జగన్ కాకపోతే ఇంకొకరు.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇంట్లో తొంగొండి అని జనాలు కాబట్టి, తొంగుంటున్నాడు.

        క్రిందిటి సారి బాబు కి ప్రతిపక్ష హోదా ఇచ్చినా 2 . 5 ఇయర్స్ ఇంట్లో తొంగోలేదా..

        కాబాట్టి.. ఊరికే మిడిసిపడకండి.

        1. అంతకు మించి మీరు పీకేది కూడా ఏదీ లేదులే..

          గత ఐదేళ్లు చంద్రబాబు తొంగుని ఉంటె.. జగన్ రెడ్డి కి 11 కి ఎలా పడగొట్టేవాడు..?

          చంద్రబాబు అసెంబ్లీ కి వెళ్లకపోయినా.. పార్టీ సభ్యులు వెళ్లారు.. ప్రశ్నించారు.. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఎదో ఒకటి రాసేయడం.. నీలాంటి జగన్ రెడ్డి వీరాభిమానులకే సాధ్యం..

          1. గుడ్డి గుర్రం పళ్ళు తెల్లార్లు తోమినట్టు బాబు భజన తప్ప ఇంకేమి తెలీనట్టు ఉంది … జగన్ వెళ్లకపోయినా మిగతా వాళ్ళు వెళ్తున్నారు , ప్రశ్నలు కూడా వేస్తున్నారు .. కాస్త కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తది

  8. 6 నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేశారు..

    .

    అర అడుగు రోడ్ వెయ్యలేదు.. ఇంతవరుకు

    .

    ఎక్కడ చూసిన రోడ్స్ అన్నీ గుంతలు ..

    .

    కనీసం వాటిని కూడా కవర్ చెయ్యడం లేదు

    .

    వేసినవి కూడా రొండో రోజే పోతున్నాయి..

    .

    అంత క్వాలిటీ తో వేస్తున్నారు మరి..

  9. 6 నెలలు అయింది .. అధికారంలోకి వచ్చి..

    ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు…

    ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు..

    పోలవరం కోసం జగన్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇస్తే.. వాటిని ఎం చేశారో తెలీదు

    ఇసుక పేరుతో విపరీత దోపిడీ

    మందు పేరుతో ఇంకో దోపిడీ..

    dsc ఇప్పటికే ఎన్ని వాయిదాలు పడిందో వాళ్ళకే తెలీదు

    6 నెలలలలోనే 65 వేల కోట్ల అప్పు చేశారు..

    ఆ డబ్బు అంత ఏమైందో ఇంతవరకూ తెలీదు

    ఎంప్లాయిస్ కి ఇస్తామన్న ఒకటో తారీకు శాలరీ మొదటి నెలతో సరి..

    మెడికల్ కాలేజెస్ ఎత్తిపోయాయ్.

    స్కూల్స్ ఎత్తిపోయాయ్

    cbse సిలబస్ ఎత్తిపోయింది..

    ఐబీ ఎత్తిపోయింది

    కంపెనీ ల మీద దాడులు మొన్న (యూబీ మీద, నిన్న ఆదానీ మీద… ఇంకా ఎన్నో )

    ఎన్నో మంచి systems మొత్తం నాశనం …

    ఎంత కసి ఉందొ ఈ రాష్ట్రము మీద… 5 ఏళ్ళు దూరంగా ఉంచారని.. వీళ్ళ సంగతి ఎలా చూడాలో చూస్తాం అని..

    ఎందుకు ఈ పగ… ఈ కక్ష్యా. ?

Comments are closed.