ఈ టీమ్‌తో జ‌గ‌న్ ఎన్నిక‌లు ఎదుర్కోగ‌ల‌రా?

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపాలైంది. కూట‌మి స‌ర్కార్ పాల‌న పుణ్య‌మా అని వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. ఎన్నిక‌లు…

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపాలైంది. కూట‌మి స‌ర్కార్ పాల‌న పుణ్య‌మా అని వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. ఎన్నిక‌లు వ‌స్తే చాలు… మ‌ళ్లీ మ‌న‌దే అధికారం అనే ధీమా జ‌గ‌న్‌లో క‌నిపిస్తోంది. ఒక పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నాయ‌కుడికి భ‌విష్య‌త్‌పై భ‌రోసా వుండ‌డం మంచిదే.

అయితే ప్ర‌స్తుతం త‌న‌తో ఉన్న టీమ్‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌గ‌ల‌న‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్నారా? అనేదే ప్ర‌శ్న‌. మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ కూట‌మి ఘ‌న విజ‌యంతో బీజేపీ నాయ‌క‌త్వం జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లొచ్చ‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ప్ర‌స్తుతం విజ‌యం ఊపులో ఉన్న బీజేపీ జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ద‌నే గ్యారెంటీ లేదు. సాధ్య‌మైనంత 2027లోపు జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఒక‌వేళ జ‌మిలి ఎన్నిక‌లే వ‌స్తే, కూట‌మిని ఎదుర్కొనే సామ‌ర్థ్యం వైసీపీకి వుందా? ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్‌లోనూ, అలాగే పార్టీలో తీసుకొచ్చిన‌, తీసుకొస్తున్న మార్పులు ఏవైనా క‌నిపిస్తున్నాయా? అంటే… లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎంత‌సేపూ జ‌గ‌న్ త‌న‌కు తెలిసిన వాళ్ల‌ను క‌ల‌వ‌డం త‌ప్పితే, త‌న పార్టీకి సంబంధించిన కొత్త నాయ‌కుల‌ను ఆయ‌న క‌లుస్తున్న దాఖ‌లాలు లేవు. ఇలాగైతే ఆయ‌న ఎన్నిక‌ల యుద్ధానికి పార్టీ శ్రేణుల్ని స‌న్న‌ద్ధం చేసేదెన్న‌డు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

జ‌గ‌న్ చుట్టూ ఇంకా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ఒక‌వేళ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే, మ‌ళ్లీ వీళ్లే క‌దా అధికారం చెలాయించేద‌నే అభిప్రాయం సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా కోఆర్డినేట‌ర్ల నియామ‌కంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

ఉత్త‌రాంధ్ర‌లో బీసీలు ఎక్కువ. అలాంటి ప్రాంతానికి బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని కోఆర్డినేట‌ర్‌గా నియ‌మించి వుంటే బాగుండేది. అందుకు విరుద్ధంగా గ‌తంలో కోఆర్డినేట‌ర్‌గా ఉత్త‌రాంధ్ర‌ను రాజ‌కీయంగా నాశ‌నం చేసిన విజ‌య‌సాయిరెడ్డికి మ‌ళ్లీ అవే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం అంటే, బాగుప‌డేందుకేనా? అనే ప్ర‌శ్న ఆ ప్రాంత వైసీపీ నాయ‌కుల నుంచి ఎదుర‌వుతోంది. జ‌గ‌న్‌లో ప్ర‌ధానంగా ఒక మార్పు రావాల్సి వుంది. తాను ఏది అనుకుంటే అది క‌ళ్లు మూసుకుని చేయ‌డం మానేయాలి. ప్ర‌జాభిప్రాయానికి త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు, రాజ‌కీయ అడుగులు వుండాలి. అప్పుడే రాజ‌కీయాల్లో నెట్టుకురాగ‌ల‌రు.

మ‌ళ్లీ ఇప్పుడు ఐ ప్యాక్ టీమ్ వైసీపీకి ప‌ని చేయ‌డానికి సిద్ధ‌మైంది. తాడేప‌ల్లిలో జ‌గ‌న్ వుండేది మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే. మిగిలిన రోజులు బెంగ‌ళూరులో వుంటున్నారు. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇప్ప‌టికీ గ‌గ‌న‌మే అని వైసీపీ నాయ‌కులు వాపోతున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఇంత వ‌ర‌కూ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ది మంది ముఖ్య‌మైన నాయ‌కుల్ని పిలిపించుకుని స‌మీక్షించ‌లేదు. ఈవీఎంల‌లో గోల్‌మాల్ చేయ‌డం వ‌ల్లే ఓడిపోయామ‌నే భ్ర‌మ‌లో జ‌గ‌న్‌ను చుట్టూ ఉన్న కోట‌రీ నాయ‌కులు పెట్టారు.

జ‌గ‌న్ తీరులో మార్పు రాక‌పోతే మ‌ళ్లీ క‌థ మొద‌టికొస్తుంది. కొత్త‌గా మ‌రింత మందిని పార్టీ కోసం ప‌ని చేయ‌డానికి ద‌గ్గ‌రికి తీసుకోవాలి. ఎవ‌రో ఏదో చెబితే విని నిర్ణ‌యాలు తీసుకునే తత్వాన్ని జ‌గ‌న్ మార్చుకోవాలి. త‌నకంటూ సొంత ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాలు వుండాలి. చెప్పుడు మాట‌లు వింటే, బాగుప‌డ‌న‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. మంచీచెడుల‌పై త‌న‌కు స్ప‌ష్ట‌త వుండాలి. అప్పుడే కూట‌మిపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే అవ‌కాశం వుంటుంది. లేదంటే ఎప్ప‌టికీ జ‌గ‌న్ రాజ‌కీయంగా ఎద‌గ‌లేరు. ప్ర‌స్తుతం ఉన్న బ‌ల‌హీనంగా ఉన్న టీమ్‌తో కూట‌మిని ఎదుర్కోవ‌డం అసాధ్యం.

16 Replies to “ఈ టీమ్‌తో జ‌గ‌న్ ఎన్నిక‌లు ఎదుర్కోగ‌ల‌రా?”

  1. ఇన్సైడ్ న్యూస్.. (కంఫర్మ్డ్ కాదు ఇంకా..)

    జగన్ రెడ్డి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సహాయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది..

    అందుకు ప్రశాంత్ కిషోర్ ..

    ప్లాన్ 1… ఫస్ట్ షర్మిల తో కంప్రమైస్ అవమని సలహా ఇచ్చినట్టు నెటిజనుల గుస గుస.. అందుకే ఎప్పుడూ లేనిది షర్మిల / ప్రభాస్ వ్యవహారాన్ని తీసుకొచ్చి మొసలి కన్నీళ్లు గుప్పించాడు..

    ప్లాన్ 2.. రేవంత్ రెడ్డి తో / లేదా కాంగ్రెస్ తో కలవమని సలహా.. ఎదో ఒక కూటమికి కమిట్ అయి ఉండాలని సలహా.. (గోడ మీద పిల్లులు.. సింగల్ సింహాలు.. వద్దని వార్ణింగ్ )

    ..

    ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయ భవితవ్యం షర్మిల చేతుల్లో ఉంది..

    మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణలు చెప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది.. తగ్గితే నెగ్గుతాడు.. కనీసం మనిషిగా నిలుస్తాడు..

    1. జగన్ గెలుపు కోసం ఎందుకు గోల .మల్ల మరోసారి రాష్ట్రాన్ని నాశనం కోసమా అతనికి నష్టం లేదు .తరాలకి సరిపడా సంపాదన ఉంది

  2. ఏ టీంతో అయినా కష్టమే, వీడిని పక్కన పెట్టి మిల్లెట్స్ కానీ అవినాష్ ని కానీ పెడితే కనీసం 11 seats అన్నా కాపాడుకోగలరు !!

  3. మా అన్నయ్య ఎవరి మాట వినడు తను చెప్పింది చెప్పినట్లు చేస్తే నే తన దగ్గర కి రాగలగుతారు.. ఎవరైనా సలహాలు ఇస్తే మా అన్నయ్య కి నచ్చదు తరువాత వారిని దూరం పెడతాడు అందుకే ఎవరు సలహాలు ఇవ్వడానికి ధైర్యం చేయరు..

  4. ఓరి నాయనో! ఈ సూక్తిముక్తావళి చదివి చదివి మాకే విసుగొస్తోంది. రాసే నీకు ఎలా విసుగు రావట్లేదు సామీ?

  5. Assalu 2027 lo enduku vasthay ra munda..ee govt tenure elago 2029 varaku vundi..vasthe appudu vasthay kani 2027 lo Jamili enduku pettukuntadi BJP matra. Meeru ilanti munda analysis chesi vaadini(jagan) ni inka vedhavani cheyyakandi

Comments are closed.