లక్ష్యం లేని యుద్ధం

అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా?

రాజకీయం అంటే యుద్ధమే. పాత రోజులతో పోలిస్తే రాజకీయం ద్వారా ఆశించే ప్రయోజనాలు పెరిగి.. వైషమ్యాలు ముదిరి.. వైరం కూడా విరాట్రూపం దాల్చిన ఈ రోజుల్లో రాజకీయం కురుక్షేత్రమే! యుద్ధంలోకి దిగిన దళపతి ఎలా ఉండాలి? వేసే ప్రతి ఎత్తుగడ, కదిపే ప్రతి అడుగు, సంధించే ప్రతి అస్త్రం.. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించేందుకే ఉండాలి. ఖడ్గ ప్రహారాలు అయినా, తూణీరాలను సంధించినా.. ప్రతిదానికీ నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. అది ఖండఖండాలు చేయాలి లేదా నిహతులను చేసేలా నాటుకోవాలి. కానీ లక్ష్యం అనేదే లేకుండా గాలిలో కత్తి తిప్పితే ఏమవుతుంది. బాణాలను గాలివాటుగా పంపితే ఎవరిని ఛేదిస్తాయి? అలాంటి యుద్ధంలో ఎలాంటి ఫలితం దక్కుతుంది?

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విపక్ష నాయకుడిగా సాగిస్తున్న యుద్ధం ఇలాగే కనిపిస్తోంది. కత్తి తిప్పుతున్నారు, బాణాలు సంధిస్తున్నారు, బల్లేలు విసురుతున్నారు, గదా ప్రహారాలు కూడా కొడుతున్నారు. అన్నీ గాల్లోకే! నిర్దిష్ట లక్ష్యం లేకుండా సాగించే రణం- ఆయనను ఉన్న చోటునే ఉంచేస్తుంది తప్ప.. ఎక్కడకూ తీసుకువెళ్లదు! జగన్ అనుసరిస్తున్న అర్థంలేని వ్యూహాలు, అనుచితమైన చేతల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘లక్ష్యం లేని యుద్ధం’!

ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఆర్యోక్తి. ప్రయోజనం ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు.. అని దాని అర్థం. వేసే ప్రతి అడుగుకీ ఒక లక్ష్యం ఉంటుంది. ఉండాలి. వ్యక్తిత్వ వికాసం గురించి బోధించే నిపుణులు ‘గోల్ సెట్టింగ్’ అని ఒక ప్రక్రియను మనతో సాధన చేయిస్తారు. కొన్ని తేడాలతో ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది.. మనకు ఉండే లక్ష్యాలు, ఇష్టాలు అన్నీ ఒక కాగితం మీద రాయమంటారు. ఎంత పెద్ద జాబితా అయినా రాయొచ్చు. ఆ జాబితాలోంచి లక్ష్యాలను- ఇష్టాలను విడివిడిగా రెండు నిలువు వరుసలుగా రాయమంటారు. అప్పుడు లక్ష్యాలేమిటో లెక్కతేలుతాయి. మరో వరుసలో ఇష్టాలు, ఆసక్తులు, హాబీలు ఉంటాయి.

ఇప్పుడు ఆ లక్ష్యాలలో మరీ ఎక్కువ ఆసక్తి లేని వాటిని కొట్టివేయాలి, స్ట్రైక్ ఆఫ్ చేయాలి. మిగిలిన లక్ష్యాలలో అన్నిటికి మించిన పరమలక్ష్యం ఏదో ఒక్కటి సెలక్ట్ చేసి దానిని పైన రాసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ దశ ఉంటుంది. ఆ ‘పరమలక్ష్యం’ చేరుకోవడానికి ఉపయోగపడే, సహకరించే చిన్న లక్ష్యాలు మాత్రం ఉంచుకోవాలి. మిగిలినవిన కొట్టేయాలి. అలాగే హాబీలు, ఆసక్తుల్లో కూడా చేయాలి. చివరగా ఒక పరమలక్ష్యం, దానికి ఉపయోగపడగల ఇతర లక్ష్యాలు, దానికి ఉపయోగపడగల హాబీలు, ఆసక్తులు మాత్రం మిగులుతాయి. అవి మాత్రమే సాధన చేయాలి.

గోల్ సెట్టింగ్- చేసుకుని లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ ఇది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు మాత్రమే కాదు. ఏ రంగానికైనా ఖచ్చితంగా వర్తిస్తుంది. విజయం సాధించడం అంటే ఒక నిర్దిష్ట లక్ష్యంవైపు గా అడుగులు వేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అలాకాకుండా చీటికిమాటికి లక్ష్యాలను మార్చుకుంటూ ముందుకు సాగినా ఫలితం ఉండదు. అసలు లక్ష్యం ఏమిటో తెలియకుండా ఆ ప్రస్థానం సాగిస్తే ఇంకేమవుతుంది? విజయం అనేది ఊహకు కూడా అందదు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చా రు. 40 శాతం ఓట్లు తమకు దక్కాయని ఆయన సంతోషించవచ్చు గాక! కానీ 60 శాతం మంది ఆయన పాలన నచ్చలేదని తీర్పు చెప్పారని అనుకోవాలి! అవ్వతాతల ప్రేమ ఏమైంది? అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైంది? ఇలాంటి రంధ్రాన్వేషణలు మానేసి ప్రజలలో తన పాలన నచ్చని అంశాలు ఏవో ఉన్నాయని, అవి తన బుద్ధికి అందడం లేదని ఆయన తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలకు నచ్చని తన లోపాలు ఏమిటో గుర్తించాలి.

జగన్మోహన్ రెడ్డి పరాజయం మూటగట్టుకుని ఇప్పటికి రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనను నిందించడాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన లోపాలను తాను తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా అంటే మనకు సమాధానం దొరకదు! తెలుసుకోవడమే జరగనప్పుడు దిద్దుకోవడం గురించి ఎలా ఆశించగలం! అలాంటి అయోమయ స్థితిలోకి పార్టీని నెట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి వర్తమాన రాజకీయ ప్రస్థానం సాగుతోంది!!

ఏ పార్టీ లేదా ఏ నాయకుడు అయినప్పటికీ ఒకసారి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న ఐదేళ్లపాటు వారికి ఉండవలసిన పరమ లక్ష్యం ఏమిటి? కాస్త రాజకీయ ఆసక్తి ఉండే పసివాడిని అడిగినా సూటిగా ఒకే ముక్క చెబుతారు. ‘ప్రజలలో ఆదరణను తిరిగి నిర్మించుకోవడం’ మాత్రమే లక్ష్యం కావాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయకుండా వేరే ఏ పని చేసినా సరే.. దాని వలన ఉపయోగం ఉండదు! ఇదివరకు గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టుగా- పరమ లక్ష్యం అనేది ‘ప్రజాదరణ పునర్నిర్మాణం’ అని అనుకుంటే ఎంచుకునే ఇతర లక్ష్యాలు, చూపే ఆసక్తులు చేసే ప్రతి పని కూడా ఆ లక్ష్యం వైపు నడిపించేదిగా మాత్రమే ఉండాలి.

జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండి తీరవలసిన ‘పరమ లక్ష్యం’ ప్రజాదరణను తిరిగి నిర్మించుకోవడం! 40 శాతం ఓట్లు వచ్చాయని ఆనందించడం కాదు. ఆ శాతాన్ని 70కి 80 కి పెంచుకోవడానికి ఆయన కష్టపడాలి. ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా అందుకు రకరకాల సాకులు చెబుతుంది. గెలిచినవారు అక్రమాలకు పాల్పడ్డారని నిందలు వేస్తుంటుంది. కొన్ని సందర్భాలలో అవి నిజమై ఉంటాయి కూడా! కానీ అంతిమంగా మళ్ళీ నెగ్గాలంటే తప్పనిసరిగా దక్కవలసినది మాత్రం ప్రజాదరణే.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సిద్ధాంతానికి తిరుగులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన వేస్తున్న ఒకటి రెండు అడుగులు ఈ పరమ లక్ష్యం వైపు నడిపించేవేనా? అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా? అనే రకరకాల సందేహాలు గాని మనకు మిగిలిపోతాయి.

ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్న యుద్ధాలు.. లక్ష్యరహితంగా సాగుతున్నాయి. ప్రతి పనికీ ఏదో ఒక ఫలితం ఉండడం మాత్రం గ్యారంటీ. ఆయన ప్రస్తుతం చేస్తున్న యుద్ధాలకు ఫలితం ఆయన కోరుకున్నట్టుగా దక్కడమే కష్టం. ఒకవేళ దక్కినా కూడా.. ఆ విజయం ఆయనను ప్రజాదరణను తిరిగి నిర్మించుకోవడం అనే పరమలక్ష్యం వైపు ఒక్క అంగుళం కూడా ముందుకు నడిపించదు. ఎలాగో చూద్దాం..

తొలియుద్ధం పసలేనిది..

ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తొలి యుద్ధం ఏమిటి? ఆయన ముందుకు తీసుకువచ్చిన తొలి డిమాండ్ ఏమిటి? ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీ స్పీకరుకు లేఖ రాశారు. రాష్ట్రానికి అధినేతగా పనిచేసిన, సుస్థిరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా కొన్ని దశాబ్దాలు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని కోరుకున్న ఒక నాయకుడు వినిపించిన మొదటి డిమాండ్ అది. ఈ పోకడను జీర్ణం చేసుకోవడం కష్టం.

అయిదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండగా పేదల సంక్షేమం కోసం అంతగా పరితపించిన నాయకుడు.. అధికారం ఉన్నది కనుక మాత్రమే వారిని ప్రేమించారా? అన్యధా పేదల వికాసం పట్ల ఆయనకు శ్రద్ధ లేదా? అనేది పలువురికి కలుగుతున్న సందేహం. కొత్త సర్కారు కొలువుతీరిన తర్వాత ఆయన సాగించిన తొలిపోరు తనకు ప్రతిపక్ష హోదా కావాలని! ఆ హోదా ఇవ్వడానికి 10 శాతం ఎమ్మెల్యేల బలం అవసరం లేదని ఆయన ఇప్పుడు చెబుతున్నారు.

తాను సీఎంగా ఉండగా.. ‘మరో ముగ్గురిని లాగేసుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుందని’ అన్నది కూడా ఆయనే! ఓటమి తర్వాత ఆయనకు రాజ్యాంగంలో కొత్త నిబంధనలు లేదా వెసులుబాట్లు కనిపించాయా? పోనీ ఈ యుద్ధం ద్వారా ఖచ్చితంగా తనకు ఆ హోదా దక్కుతుందనే నమ్మకం ఆయనకు ఉందా? కనీసం ఆ యుద్ధంలో ఓడిపోతే.. ప్రజలకు తనమీద సానుభూతి ఏర్పడుతుందనే నమ్మకమైునా ఆయనకు ఉన్నదా? ప్రజలు తన పోరాటాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ఆలోచన జగన్ కు రాలేదా? ఇవి అందరికీ కలుగుతున్న సందేహాలు. ఒక పసలేని డిమాండ్ తో ఆయన ప్రభుత్వం మీద పోరాడుతున్నారు.

మలి యుద్ధం హాస్యాస్పదం!

ప్రభుత్వం మీద ఆయన ప్రకటించిన రెండో యుద్ధం హాస్యాస్పదంగా మారిపోయింది. తన భద్రత గురించిన భయంతో రెండో యుద్ధాన్ని ప్రారంభించారు. ఇందులో కూడా ప్రజల కోణం లేకపోవడం శోచనీయం! నాయకుడనేవాడు ప్రజల కోసం చేసే పోరాటాల ద్వారా మాత్రమే.. ప్రజల ఆదరణను పొందగలుగుతాడు ఆ పోరాటాలలో భాగంగా తనకు భద్రత గురించిన ప్రస్తావన తేగలడు తప్ప తనకు భద్రత కావాలన్నదే పోరాటం యొక్క ప్రధాన ఎజెండా అయితే ప్రజలు హర్షించరు. పైగా ఇది హాస్యాస్పదంగా మారడానికి ఆయన డిమాండ్ చేసిన తీరు కూడా ఒక కారణం.

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒకరోజు ముందు- అంటే జూన్ 3వ తేదీ నాటికి తను ఎలాంటి భద్రత ఉన్నదో అదే భద్రతను పునరుద్ధరించాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఇది అతిశయం కాక మరేమిటి? జగన్ ప్రాణానికి హాని ఉండవచ్చు గాక! కానీ ముఖ్యమంత్రితో సమానమైన భద్రతను ఆయనకు ఎందుకు కల్పిస్తారు? ఏ రకంగా ప్రోటోకాల్ అందుకు అంగీకరిస్తుంది?

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ మాత్రం అవగాహన లేకుండా పిటిషన్ వేస్తే ఎలాగ? పైగా జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సీఎం భద్రత కోసం, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం ద్వారా 2019 కి పూర్వం చంద్రబాబు నాయుడుకు సీఎం గా ఉన్న భద్రతకు- ఆ చట్టం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిన భద్రతకు మధ్య పోలికే లేకుండా పోయింది!

అంటే తనకోసం తాను తయారు చేసుకున్న కొత్త చట్టం ప్రకారం- తన భద్రతను తాను ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి కోరడం చిత్రం! తనకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కారు గురించి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి ఆయన చేసిన చూపిన కారణాలు కూడా అలాగే ఉన్నాయి. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులో ఏసీ పని చేయడం లేదనేది ఒక కంప్లైంట్!

‘ఏసీ బాగు చేయించి ఇస్తాం’ అనే సమాధానం ప్రభుత్వం వైపు నుంచి వస్తే మళ్లీ జగన్ ఏం సమాధానం చెబుతారు? దానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన వాహనం బాగాలేదు అని దానిని తిరస్కరించి. ప్రభుత్వానికి అప్పజెప్పేసి తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరిగితే ఆయనకి ఇంకా గౌరవంగా ఉండేది! అప్పుడు ప్రజలు కూడా పునరాలోచన చేసేవారు. జగన్ కు పనికిమాలిన వాహనం ఇచ్చారు.. ఆయన వద్దని వెనక్కి ఇస్తే ప్రత్యామ్నాయ వాహనాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.. ఈ సర్కారు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది అని ప్రజలు తమంత తామ అనుకునేవాళ్ళు!

జగన్ పట్ల కాస్త సానుభూతి ఏర్పడేది. నెమ్మదిగా అది ఆదరణగా మారినా మారవచ్చు! కానీ జగన్ అలాంటి అవకాశం ప్రజలకు ఇవ్వకుండా, ‘కారులో ఏసీ పని చేయడం లేదు’ అని కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జగన్ కు మంచి కారు ఇవ్వచ్చు కదా అని వ్యాఖ్యానించడాన్ని కూడా మనం గమనించాలి!

ఈ రెండు యుద్ధాలలో కూడా ప్రజా ప్రయోజనం అనేది లేశమాత్రం కూడా లేదు. కేవలం తన సొంత బాధ కోసం ఆయన రెండు యుద్ధాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ప్రజల యాంగిల్ ఆయన కార్యచరణలోకరి ఇంకా రానేలేదు. ఒక నాయకుడు ఇలా వ్యవహరిస్తే ఎలా?

కార్యకర్తలతో భేటీ ఇలాగేనా?

ఓటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను పిలిపించి ప్రత్యేకంగా వారితో భేటీ కాబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు.. పార్టీ శ్రేణులు అందరూ సంతోషించారు. కార్యకర్తల కోణంలో, సరైన రీతిలో ఆత్మశోధన చేస్తున్నారని అనుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి అక్కడ జండా మోసిన, దెబ్బలు తిన్న, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పిలిపించి వారి ద్వారా ఓటమి కారణాలను తెలుసుకుంటే పార్టీ భవిష్యత్తు కోసం చక్కటి దిశానిర్దేశం అవుతుందని వారు ఊహించారు.

కానీ జరిగింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డితో వారు భేటీ అయ్యారు. వారికి జగన్ తనకు అలవాటైపోయిన ఉపన్యాసాన్ని మాత్రమే మళ్ళీ వినిపించారు. తను చెప్పదలుచుకున్నది చెప్పేశారు. పార్టీకి భవిష్యత్తు ఉంది, మళ్లీ మనం అధికారంలోకి వస్తాం.. అనే డైలాగులు వల్లించేశారు. అక్కడితో ఆ భేటీ ముగించేశారు. కార్యకర్తలను మాట్లాడించి- వారు మొహమాటానికి పోతే నిజాయితీగా చెప్పేలాగా ప్రేరేపించి, వారి ద్వారా ఓటమికి గల అసలు కారణాలను అన్వేషించడానికి జగన్ కించిత్తు ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి పనులు చేయకుండా ప్రభుత్వం మీద ఆయన సాగిస్తున్న యుద్ధంలో పరిపక్వత ఎలా వస్తుంది? ఆయనే ఆలోచించుకోవాలి!!

మూడో యుద్ధం చేజారిన సువర్ణావకాశం

ఈ రెండు నెలల వ్యవధిలో జగన్ మూడో యుద్ధాన్ని కూడా సాగించారు. అయితే, పొరబాటు వ్యూహాలతో ఒక సువర్ణ అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారు. ప్రజలలో తన పట్ల ఆదరణ, ప్రభుత్వం పట్ల ఏహ్యభావం ఏకకాలంలో ఏర్పడడానికి వచ్చిన ఒక అవకాశం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మీద దాడులు జరిగాయి. విధ్వంసాలు జరిగాయి. హత్యలు జరిగాయి. వీటిని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా నిరసించారు.

చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తిచూపారు. రాష్ట్రపతి పాలనను కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా తెలియజేసే నిరసన ఎలా జరిగి ఉండాల్సింది? రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కలెక్టరేట్ ఎదుట ఉప్పెనలాంటి జన ప్రవాహంతో ఒక ఉద్యమాన్ని నిర్వహించి ఉంటే ప్రజల్లో సీరియస్ గా దాని గురించి చర్చ నడిచేది.

ఎందుకంటే, దాదాపుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో కూడా మీడియాలో వార్తల రూపంలో వచ్చినవో రానివో చిన్నవో పెద్దవో ఏదో ఒక రకంగా అధికార పార్టీ వారి వేధింపులకు దాడులకు నిదర్శనమైన చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నిచోట్ల కార్యకర్తలు కసితో అలాంటి ఉద్యమాలలో పాల్గొని ఉండేవారు. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఆ దాడులను స్వయంగా చూసిన వారే గనుక ఆ ఉద్యమాల పట్ల సానుభూతిని చూపించగలరు. కానీ జగన్ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు.

ఢిల్లీకి వెళ్లి నిరసన దీక్ష చేయడం ద్వారా జగన్ ఏం సాధించినట్లు? అఖిలేష్ వచ్చి పరామర్శించినంత మాత్రాన ఏం ప్రయోజనం దక్కినట్టు? ఆయన ఢిల్లీ ప్రజల ఓట్లను కోరుకుంటున్నారా? లేదా ఉత్తర ప్రదేశ్ ప్రజల ఆదరణను ఆశిస్తున్నారా? రాష్ట్రమంతా తెలుగుదేశం ప్రభుత్వం దాడులకు దిగుతుంటే- దానికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయడం అనేది జగన్ వ్యూహంలోని లోపం. లక్ష్యం ఏమిటో తెలియకుండా యుద్ధం సాగిస్తే ఇలాగే ఉంటుంది.

జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా చేస్తున్న మూడు యుద్ధాలలో- రెండు ఆయన స్వప్రయోజనాలకు సంబంధించినవి. ప్రజలు వాటిని పట్టించుకోరు. మూడవది ప్రజలకు సంబంధించినదే. కానీ చేయవలసిన విధంగా ఆయన చేయలేదు. ఇలాంటి చారిత్రక తప్పిదాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఐదేళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ఎలా బలోపేతం చేయగలరు? తనకు తప్పుడు, పుచ్చు సలహాలు ఇచ్చే వందిమాగధులతో కూర్చోకుండా ఆయన తనకు తానుగా ఆత్మ సమీక్ష జరుపుకోవాలి. లేకపోతే వైసిపి చరిత్రలో చారిత్రిక తప్పిదాల అధ్యాయమే అతి పెద్దదిగా మిగిలిపోతుంది!

.. ఎల్. విజయలక్ష్మి

69 Replies to “లక్ష్యం లేని యుద్ధం”

  1. కత్తి తిప్పడం రాని వారి ఖడ్గ ప్రహారాల గురించి ఇన్ని వరహాల అక్షరాలు అవసరమా ?

  2. ఒరేయ్ వెనకట రెడ్డి… జగ్గమ్మ కి అంత తెలివే ఉంటే ఈ పరిస్తితి ఎందుకొస్తుంది అంటావ్

    లక్ష్యాలు ఉద్దేశ్యాలు లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వాడతావ్

    అడ్డ గాడిద

    1. అడ్డ గాడిద‌.. అన్నావ్‌.. మ‌రి … నువ్వు … ఏ గాడిద‌వి… నీకు ఆ ప‌దాల‌కు అర్ధం తెలుసా సుంఠ‌

  3. అప్పుడు పిత్తిన పొగిడెదానివి power లేకపోయేసరికి చాలా చెబుతునవు ఎవడు చేస్తాడు next day cm అయ్యె ఉపాయము ఉంటె చెప్పు

  4. గాలిలోకూడా అసలైన ఆయుధాలు తిప్పట్లేదు…….. తన చుట్టూ ఆయుధ అట బొమ్మలుసుకొని ఊపుతున్నాడు చిన్నపిల్లాడిలా…… ఎదుటివారిని భయపడమంటున్నాడు….

    నిజంగా అతనికి ప్రజలకి మేలు జరిగేలా చెయ్యాలినుకొంటే గొప్ప అవకాశం 11 మందితో అయినా పోరాడాడు జనాలకోసం అనిపించుకోవచ్చు……. ఆలా జరుగుతుందంటావా…….?

  5. ‘తిక్కలోడి పాపాల పాలన లో విరక్తి చెందిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికిరాని సన్నాసి, అంటూ Fan రెక్కలు మడత పెట్టి వీడి గుడ్డలోకి 11 ఇంచులు ది0పారు..

  6. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. ఫర్నీచర్ దొ0గ

  7. నేను అప్పుడే చెప్ప మనకి ఇంకా రాజకీయ బవిష్యత్ లేదని… Vijalakshmi Garu Below message for M B S Prasad gari ki…please note

    నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  8. గోల్, లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలెందుకే లచ్చి??

    చంద్రబాబు EV’M లు ఓటు వేస్తే గెలిచాడు..

    నా voter’s వేరే..

    చంద్రబాబు పాపాలు చేస్తాడు

    కళ్లు మూసుకు0టే 5 యేళ్ళు కరిగిపోయి.. 2029 లో అధికారం లో కూర్చుంటా0.

    సింపుల్.. ఇంతోటి దానికి నేనెందుకు అసలు కారణాలు తెలుసుకుని కష్టపడాల చెప్పు vizzi??

  9. సోద‌రి ఎల్ విజ‌య ల‌క్ష్మి గారికి న‌మస్సుమాంజ‌లి.

    గ్రేట్ ఆంధ్ర‌లో మీ కాల‌మ్ చ‌దివాను. చాలా బాగా విశ్లేషించారు. అయితే, కోర్టును ఆశ్ర‌యించింది రాజ‌కీయ పోరాటంగానే ప్ర‌జ‌లు, విశ్లేష‌కులు, రాజ‌కీయ నాయ‌కులు చూస్తారు. ఢిల్లీ వేదిక‌గా చేసిన పోరాటం ప్ర‌జా పోరాటం అనేది నా వ్య‌క్తిగ‌త భావ‌న‌. ఇక ఆయ‌న తీరు మార‌లేదు అన్న‌ది వాస్త‌వ‌మా .. కాదా .. అన్న‌ది కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. ఎన్నిక‌ల వేళ ఒక పార్టీ అధినేత‌గా వారిని అభిప్రాయాలు చెప్పండి అంటే అక్క‌డ వారిలో వారు అభిప్రాయ బేధాలు ఉండి గొడ‌వ ప‌డితే మీడియా దానిని ఫోక‌స్‌చేస్తే పార్టీకి మ‌రింత చెరుపు. మీర‌న్న‌ట్లు సాధార‌ణ రోజుల్లో ఈ త‌ర‌హా స‌మావేశాలు మంచివే. పార్టీకి ఎంత‌గానో ఉప‌క‌రిస్తాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేసిన ప‌నులు, వ‌చ్చిన ఓట్ల గురించే కాకుండా మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఎక్క‌డ త‌ప్పిదం జ‌రిగింద‌నే దానిపై కూడా లోతైన విశ్లేష‌ణ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విశ్లేష‌ణ‌లో గ‌తంలో త‌న చుట్టూ ఉన్న వంది మాగ‌ధుల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్లే స‌మాచారం. ఒక ర‌కంగా ఇది మార్పే. మీర‌న్న‌ట్లు మంచి మార్పు వ‌స్తే మంచి ఫ‌లితాల ఉండే అవ‌క‌శాలున్నాయి. ఏదైనా మీ విశ్లేష‌ణ చ‌క్క‌గా ఉంది. ధ‌న్య‌వాదాల‌.

    ర‌మ‌ణ

    సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

    1. రమణా రెడ్డి గారు, కూటమి లో కూడా మంచి రెడ్డి వర్గ నాయకులు వున్నారు.

      కేవలం జగన్ రెడ్డి మాత్రమే రెడ్డి కుల నాయకుడు అనుకుంటే కుదరదు కదా.

      1. నేను అలా అన‌లేదు… అండీ…. ఆ కాల‌మ్ సారాంశం మొత్తాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీస‌కుని మాత్ర‌మే నా అభిప్రాయాన్ని చెప్పాను. మంచి వారు ఇత‌ర పార్టీల్లోనూ ఉన్నారు. వారు ఎప్పుడూ గోల్డ్ కాయిన్స్ లానే ఉంటారండీ. అందులో డౌట్ ఏమీ లేదు.

      1. చ‌దివి అర్ధం చేసుకోలేని మూర్ఖులు కూడా ఉంటారు. ఏరా… ఓరే…అంటే అది నీకు కూడా వ‌ర్తిస్తుంది. జ‌గ‌న్ ఎప్పుడూ సిద్ధ‌మే. గుర్తుంచుకో. అలా అని ఇత పార్టీల్లో ఉన్న రెడ్లు కూడా సిద్ధ‌మే. అందులో ఎటువంటి డౌటూ లేదు. ఎవ‌రి వ‌ల‌న ఎవ‌రికి ఉప‌యోగం ఉంటుంది… నీ వ‌ల్ల ఒక పైసా ఉప‌యోగ‌మ‌ని నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు…చూద్దాం. నీకు ఆ ఖ‌లేజా ఉందా…?

        1. ఎరా రమణగా … బాబాయ్ ని నరికి చంపిన దుర్మార్గుడు గొడ్డలితో రంకెలేస్తూ సిద్ధం అంటే ఎదుర్గు ఉన్న పార్టీ చూస్తూ ఊరుకోదుగా మట్టి కరిపించి మోకాళ్ళ మీదకి తెచ్చి ప్రతిపక్ష హోదా కావాలి , భద్రత కావాలి అని అడుక్కునే లాగ చేసింది

          నీ వల్ల , నీ చెత్త పన్నుల పార్టీ వలన దమ్మిడీ ఉపయోగం లేదు అని నువ్వే చెప్పేట్టు చేసింది

          నీ ఖలేజా , సిద్ధం , వై నాట్ 175 అని మొగతనం లేని , చేవ లేని అలాగే వారసుడు లేని అవినీతి చెంచాల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        2. ఎరా రమణగా … బాబాయ్ ని నరికి చంపిన దుర్మార్గుడు గొ!డ్డ!లి!తో రంకెలేస్తూ సిద్ధం అంటే ఎదుర్గు ఉన్న పార్టీ చూస్తూ ఊరుకోదుగా మట్టి క!రి!పిం!చి మోకాళ్ళ మీదకి తెచ్చి ప్రతిపక్ష హోదా కావాలి , భద్రత కావాలి అని అ!డు!క్కు!నే లాగ చేసింది

          నీ వల్ల , నీ చెత్త పన్నుల పార్టీ వలన దమ్మిడీ ఉపయోగం లేదు అని నువ్వే చెప్పేట్టు చేసింది

          నీ ఖలేజా , సిద్ధం , వై నాట్ 175 అని మొ!గ!త!నం లేని , చేవ లేని అలాగే వారసుడు లేని అవినీతి చెంచాల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        3. ఎరా రమణగా … బాబాయ్ ని నరికి చంపిన దుర్మార్గుడు గొ!డ్డ!లి!తో రం!కె!లే!స్తూ సిద్ధం అంటే ఎదుర్గు ఉన్న పార్టీ చూస్తూ ఊరుకోదుగా మట్టి క!రి!పిం!చి మోకాళ్ళ మీదకి తెచ్చి ప్రతిపక్ష హోదా కావాలి , భద్రత కావాలి అని అ!డు!క్కు!నే లాగ చేసింది

          నీ వల్ల , నీ చెత్త పన్నుల పా!ర్టీ వలన దమ్మిడీ ఉపయోగం లేదు అని నువ్వే చెప్పేట్టు చేసింది

          నీ ఖలేజా , సిద్ధం , వై నాట్ 175 అని మొ!గ!త!నం లేని , చే!వ లేని అలాగే వా!ర!సు!డు లేని అవినీతి చెం!చా!ల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        4. ఎరా రమణగా … బాబాయ్ ని నరికి చంపిన దుర్మార్గుడు గొ!డ్డ!లి!తో రం!కె!లే!స్తూ సిద్ధం అంటే ఎదుర్గు ఉన్న పార్టీ చూస్తూ ఊరుకోదుగా మట్టి క!రి!పిం!చి మో!కా!ళ్ళ మీదకి తెచ్చి ప్రతిపక్ష హోదా కావాలి , భద్రత కావాలి అని అ!డు!క్కు!నే లాగ చేసింది

        5. నీ ఖలేజా , సిద్ధం , వై నా!ట్ 175 అని మొ!గ!త!నం లే!ని , చే!వ లే!ని అలాగే వా!ర!సు!డు లే!ని అవినీతి చెం!చా!ల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        6. నీ ఖలేజా , సిద్ధం , వై నాట్ 175 అని మొ!గ!త!నం లేని , చే!వ లేని అలాగే వా!ర!సు!డు లేని అవినీతి చెం!చా!ల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        7. నీ ఖలేజా , సిద్ధం , వై నా!ట్ 175 అని మొ!గ!త!నం లే!ని , చే!వ లే!ని అలాగే వా!ర!సు!డు లే!ని అవినీతి చెం!చా!ల పార్టీ నీదని నువ్వే నిరూపించావు ఇంక ఉత్తరకుమార ప్రగల్బాలు మాని ఇంట్లో కూర్చు లేకుంటే ప్రజలు బుద్ది చెప్తారు

        8. సిద్దమా?? దేనికి?? ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అయ్యన్న m gud vataanikaa?? లేక మాట తప్పకుండా మోడీ మెడలు వంచి రాష్ట్రానికి హోదా తేవడానికా??

  10. గ్రేట్ ఆంద్ర వెనుకటి రెడ్డి గారికి,

    గజ్జల నీ తీసేసి ఆ ఫ్యాన్ పార్టీ మీడియా కాంట్రాక్టు ఇచ్చే దాక , రోజు ఈ చాకి రేవు తప్పదు.

    అంతే కదా విజ్జి అక్కయ్య.

  11. అధికారం ఇస్తే లక్ష్యం లేని పాలన .. ప్రతిపక్షంలో ఉంటే లక్ష్యం లేని యుద్ధం .. రచయిత మాత్రం ఆయన్ని ఉద్దరించ సిద్దం..

  12. “గాల్లో” కత్తి తిప్పుతున్నారు అంటారు.

    అప్పట్లో చాలా గొప్పగా చెప్పేవాళ్ళు, జగన్ కి దేముడు రాత్రి పూట వచ్చి నేరుగా మాట్లాడతాడు అని. అందుకే గాల్లో కి చుస్తు మాట్లాడతాడు అని.

    ఏమిటి ఇది నిజమా అని డాక్టర్ నీ అడిగితే చెప్పాడు, దాన్నే పిచ్చి పీక్స్ లో వింది అంటారు అని.

  13. నిజము చెప్పు అక్కయ్య,

    గ్రేట్ ఆంద్ర వెనుకటి రెడ్డి గారికి ఎన్ని సార్లు అడిగినా కూడా ప్యాలస్ లో అపాయింట్మెంట్ దొరకలేదు కదా.

    అందుకే కదా, రోజు బండ కేసి బడుతూ ఈ చాకీ రేవు.

    పైగా వదినమ్మ స్త్రిక్ట్ ఆర్డర్ పాస్ చేసింది అంట కదా, వెనకటి రెడ్డి గారు ముఖము ఎప్పటికీ ప్యాలస్ లో కనిపించకూడదు అని. నిజమేనా..

  14. ఫాఫామ్. నీ బాధ చూస్తూ ఉంటే… ఆగిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలు వాయిస్తున్నట్టు వుంది.

    ఇంత కష్టపడి ఆర్టికల్స్ వదులుతున్నావు. కనీసం వాడు ఒక్క ఆర్టికల్ అయినా చదివాడా?

    అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నావో నాకు అర్ధం కావటం లేదు. హాసం పత్రిక మల్లి ఓపెన్ చేసుకుంటే… నీకు మల్లి బోలెడు డబ్బులు వస్తాయి.

  15. ఒరేయ్ విజయ లక్ష్మి గా, చూసావా చివరాఖరికి నీకు కూడా లోకువ అయిపోయాడు జగన్ రెడ్డి !!

  16. సాక్షి రమనా, Vizzi రాసింది Kandisthunnavaa?? Correction చేస్తున్నావా లేక కవరింగ్ చేస్తున్నావా??

    ఏదైనా ఇద్దరు జర్నలిస్ట్ల మధ్య ఇంత అభిప్రాయ భేదాలా?? రీడర్స్ ని ఎ’ర్రి edavalani చేస్తూ ఇదేధో మ్యాచ్ FIXING ఆట మాదిరిగా భలే కామిడీ గా ఉంది. ఈ కామిడీ కంటిన్యూ చేయండి

    1. నీ మైండ్ సెట్ అది… దానికి ఎవ‌రేం చేస్తారు. ప్ర‌తి దానిని వ‌క్ర కోణంలో చూస్తే అలానే ఉంటుంది. నీ మైండ్ సెట్ అంత‌క‌న్నా పెరుగుతుంద‌ని అనుకోవ‌డం ఓ భ్ర‌మ‌.

    2. నీకు అస‌లు జ‌ర్న‌లిజం మీద అవ‌గాహ‌న ఉందా…. ఒక కాల‌మ్ ఎవ‌రైనా రాస్తే దానిమీద విశ్లేష‌ణ జ‌రిగితే .. వాస్త‌వాలు తెలుస్తాయి. ఇది నా అభిప్రాయం. నీ అభిప్రాయం కూడా చెప్పు. అంతేగానీ ఎర్రిప‌ప్ప‌లు అంటూ నీ అమాయ‌క‌త్వ‌పు మాట‌లు ఎందుకు మిత్ర‌మా…

  17. వాడొక మానసిక రోగి…మూర్కుడు.. బద్ధ కస్తుడు.. వాడికి అసలు రాజకీయాలు తెలుసా?సమాజం పట్ల వాడికి బాధ్యత అంటే ఏంటో తెలుసా.గాలోడు..అసలు వాడికి ముఖ్యమంత్రి పదవి అనేది అనూహ్యం…అదృష్టం..రాష్ట్ర ప్రజల దురదృష్టం.. వాడి గురుంచి ఆర్టికల్స్… తూ..

  18. ఉచ్ ఆగట్లేదు ఆ మెంటలోడికి. ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొమ్మన్నాడు కదా.

    ప్రతిపక్షంలో టీడీపీ చాలా సహనంతో వెయిట్ చేసి, చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఎత్తిచూపి నమ్మకం పెంచుకుంది. రోడ్ల గుంతల నుంచి రాజధాని వరకు ప్రజల నిక్కచైన అవసరాల కోసం పోరాడి విజయంలో యాభై శాతం కష్టాన్ని పెట్టింది, మిగతా విజయం జగన్ స్వయంకృపరాదంతో అప్పనంగా ఇచ్చిందే.

    Evm విజయం అంటూ కేడర్ కి తప్పుడు అభిప్రాయం క్రియేట్ చేసి వచ్చిన 39శాతం ఓటు కూడా పోగొట్టుకొనేలా ఉన్నడం ఒక వీధి కొట్లాట గురించి ఢిల్లీలో అల్లరి చేసిన మేధావి 2019లో నెగ్గడం ఎలా జరిగిందో. హల్లెలూయ, అల్లావో, రెడ్ బ్యాచ్ కి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కలసి వచ్చి ఉండచ్చు. ఈసారి రెడ్ బ్యాచ్ కూడా చేయిచ్చింది.

    జగన్ మారటమే కాదు, విధానాలు మార్చుకోవాలి. పాత నిర్ణయాలు వదులుకోవాలి లేదా మార్చుకోవాలి. రాజధాని అమరావతి అని ఒప్పుకోవాలి, నమ్మించాలి. పారిశ్రామిక ప్రగతి ఉద్యోగాల కల్పన కోసం పాటుపడాలి. MIM వాళ్ళు ప్రభుత్వ సహకారం లేకుండానే సొంతంగానే యూత్ employemnt కోసం పాటు పడతారు, చిరు వ్యాపారులకు పెద్ద సంస్థల వరకు వాళ్ళ సపోర్ట్ ఇస్తారు. కానీ జగ్గదు తన ఫ్రెండ్ ఓవైసి నుండి కూడా ఏమి నేర్చుకోలేదు

    జగన్అదృష్టం అందలం ఎక్కించింది, బుద్ధి సంకనాకించింది

    1. అమరావతి రాజధాని ఒప్పుకోలేడు సర్ ..డ్రగ్స్ మత్తు ఎక్కినించినట్టు క్యాడర్ కి బ్రెయిన్ వాష్ చేసేసారు .. వాళ్ళు మారారు ఈయన స్టాండ్ మార్చుకున్న ..

  19. ఛాలా చక్కగా 11mla బలంతో అసెంబ్లీ లో వచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లేదు. 4+11 ఎంపీలు బలం కూడా చిన్నదేమి కాదు. మొదట పార్టీని సంస్కరించుకోకుండ పిచ్చుకుక్కల్లా వాళ్ళని వదిలేస్తే ఇప్పుడున్న 11నుంచి ఒక్క ఇంచు కూడా పైకి వెళ్ళనీయరు.

    కూటమి తప్పులు చేస్తుంది, సమయం వచ్చినపుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటం కేటీఆర్ నుంచి అయినా ఈ మెంటలయ్యా నేర్చుకోవాలి.

    ఇప్పటికీ ఆ ka paul video Leda, మల్లన్న వీడియో పట్టుకొని అదిగో evm manage చేసారు అని మోసం చేసుకోవటం ఆపాలి. ఒక ఇంట్లోనే భార్య భర్తలు ఒకే పార్టీకి ఓటు వేయలేదు, అలాంటిది ఒక గ్రామంలో వైసిపి వల్ల ఓట్లు పడలేదు అంటూ అదే evm mosam ani ఎర్రి బులుగుల్ని మోసం చేయటం వలన ఉపయోగం లేదు. విజయానికి కావలసింది 39శాతం ఓట్లు కాదు 50 శాతం సీట్లు. ఉన్న ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంటూ వ్యతిరేకతతో పోయిన ఓట్లను సాడిచుకొంటే y not 175 కాదు కానీ మళ్ళీ 151 రావచ్చు

  20. One chance experiment is proved to be a BIG Failure

    చంద్రబాబు monatany పాలన కి బోర్ కొట్టి Jeggulu ఊరూరు తిరిగి ఇచ్చిన హామీలు మీద నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేశారు.. కానీ ఆ ఒక్క ఛాన్స్ ని mis use చేసి పగ, ప్రతీకారం తో ప్రజల వాయిస్ఐన ప్రతిపక్షం లేకుండా చేసి, అప్పులు తెచ్చి పప్పులు పెంచితే, భూములు,సహజ వనరులు లూటీ చేసి, ఇసుక మధ్యం లో వేల కోట్లు కొట్టేసినా ప్రజలు చచ్చినట్టు తనకే ఓటుస్థారు ఆనుకున్నాడు yeర్రి యదవ ..

    అందుకే ఈడు కనీసం ప్రతిపక్ష నాయకుడు గా కూడా పనికిరాని సన్నాసి అని Fan రెక్కలు మడిచి గుడ్డ లో 11 ఇంచులు లోతుగా dengaaru ఐనా ఈడి కి బుద్ధి రావడం లేదు.. No body can help

  21. ఎందమ్మ ?కత్తి గాల్లో తిప్పుతున్నాడా?? వాడి..గు..డ్డ లో పెట్టుకొని తిప్పుకోమను.

  22. యేదో వైఎస్ఆర్ ముఖం చూసి జనాలు పొరబాటున వాడికి ఒక సారి అవకాశం ఇచ్చారు.

    వాడు, అది తన గొప్పతనం అనుకుని విర్ర వీగాడు.

    అభివృద్ధి చేయక పొగ, సమాజం లో తిరిగి పూడ్చలేని వైషమ్యం తయారు చేసి వెళ్ళాడు.

    స్కూ*ల్ పిల్లల కి గం*జాయి అలవాటు చేశారు. వాడికి దొరికితే , తల్లి తండ్రులు ముఖం మీద కాంద్రించి వుమ్మి వేయడానికి సిద్దగా వున్నారు

  23. అన్నియ్య గాలి లో కత్తి తిప్పుతున్నాడు.. అవి బావ ప్యాలెస్ లో ఇంకేదో తిప్పుతున్నాడు..

  24. అయన పాలనే లక్ష్యము లేకుండ చేస్తే .. ఇప్పుడు యుద్ధం అంటారు ఏమిటి .. మూడు రాజధానులు అని ఒకటి కూడా పూర్తి చేయలేదు .. మద్యపాన నిషేదం అని ..ఒక షాప్ ముయ్యలేదు .. అసలు వైసీపీ పాలనా లో పలానాది మొదలు పెట్టి పూర్తి చేసింది ఏమైనా ఉందా ? నూడిల్ పాయింట్లు చికెన్ మార్ట్లు తప్పించి ..

    1. neeku burra ledu antanu ysrcp lo uddan project avvaledaa medical colleges,ports konni poorthi avvaledaa vandaladi sachivalayalu ward karyalayalu kattaleda visakhapatnam roads anni upgrade cheyyaledaa nuvvu GUDDIVADIVAA.. MARI CHANDRABABU 2014 -2019 AND IPPUDU EMI PEEKUTHUNNADO CHEPPU

  25. మాంచి పోటుగాళ్ళనే పట్టావ్ రా జగన్

    ఒకడు గంట ఊపుతాడు ,

    ఒకడు మైనర్ బాలికని రేప్ చేస్తాడు ,

    ఇంకోడు అరగంట చాలంటాడు ,

    మరొకడు గంట చాలంటాడు ,

    ఒకడు ఏకంగా కొడుకు కనివ్వమంటాడు ,

    ఒకడు అక్రమసంబంధం పెట్టుకుంటాడు..

    నీ పార్టి మొత్తం..

    అవినితి , అక్రమసంబంధాలేనా

    చెత్త మొత్తం ఒక చోట

    తండ్రి చా వు తో సానుభూతి

    బాబాయ్ చా వు తో సీఎం కుర్చీ

    సొంత చె ల్లి / త ల్లి దె బ్బకి బెంగూళూర్ పరారి

    హ త్య జరిగితే ఏమైనా అక్కడ ఛాన్స్ ఉంటుందేమో అని రావడం

    ఇకపోతే మనోడి నిజాయతి కి సాక్ష్యం గా cid /ed హైకోర్టు లు

  26. పదవి 30 సంవత్సరాలు వుంటుంది అని కలలు కని అది 5 సంవత్సరాలకే ఊడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే పి చ్చి పట్టడం సహజం . కానీ ఇంత తొందరగా పి చ్చో డి లా మారడం మాత్రం విడ్డూరం

  27. ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకొని, అమరావతి కి పోలవరం కి మిగతా అభివృద్ధి కార్యక్రమాలికి మద్దతు పలికి, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి, ప్రజల దగ్గరకు వెళ్ళితే ఏమయినా ప్రయోజనం ఉండవచ్చు.

    ముఖ్యంగా భజన గోష్ఠిని, కుల గజ్జి నాయకులను, బూతు మాజీ మంత్రులను దూరం పెడితే ప్రజలు నమ్మినా నమ్మవచ్చు.

    ఇక మీదట బటన్ నొక్కుడులకే పరిమితి కాకుండా అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేస్తానని చెప్పాలి.

    ఇవన్నీ అయ్యే పని కాదు.

    ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

    నన్ను అడిగితే, పార్టీ మూసు కొని పోవడమే మేలు అంటాను.

  28. జగన్మోహన్ రెడ్డి పాలన, అయన చుట్టూ వున్న కోటరీ, మంత్రులు & ఎమ్మెల్యేల పని తీరు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు! 2009 నుండి జగన్మోహన్ రెడ్డి వెన్నంటివున్న కార్యకర్తలు, నాయకులు సైతం దోపిడీకి గురయ్యారు! మొత్తంగా చూస్తే వైసీపీ పాలనను దోపిడీ పాలనగా భావించిన ప్రజలు 2024 ఎన్నికల్లో ఘోరంగా తిరస్కరించారు!

  29. టీడీపీ క్యాడర్ బాబు మీద పీకల దాక కోపం తో వుంది. ఇంత మెజారిటీ తో గెలిపించాక కూడా వైసీపీ గూండాల పని పట్టలేదు, వాళ్ళ చేతులు కట్టేశారని. జగన్ బ్యాచ్ చేసిన అకృత్యాలు మాములుగా ఉన్నాయా వాళ్ళను వదిలెయ్యటానికి. అటువంటిది మీరు సిద్ధం, మూడో యుద్ధం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు మధు పగులుద్ది ఒక్కొక్కరికి అందుకే తలో దిక్కుకి పారిపోయారు.

Comments are closed.