టాలీవుడ్ హీరోలు అంతా ఒకటే ఆలోచన దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాము చేస్తున్న సినిమాలు అద్భుతంగా వుంటున్నాయి. సోషల్ మీడియా లో నెగిటివిటీ వల్ల ఫ్లాప్ అయిపోతున్నాయి అనే ఆలోచన బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న హీరోల్లో ఈ తరహా ఆలోచన బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఏదో సమయంలో ఏదో రూపంలో వీరి మనసులోని మాటలు బయటపడుతున్నాయి. విమర్శ అనేది ఎప్పుడూ వుంటూనే వుంటుంది. దాన్ని తట్టుకుని నిలబడేదే సినిమా అయినా మరే వర్క్ అయినా. శంకరాభరణం లాంటి సినిమాలకు కూడా విమర్శ తప్పలేదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే మెజారిటీ జనాలకు నచ్చే కంటెంట్ ఎలా ఇవ్వాలా అని.
సోషల్ మీడియా కావచ్చు.. మీడియా కావచ్చు.. మెజారిటీ కాదు,. మెజారిటీ జనాల్ని ప్రభావితం చేసేది కాదు. మౌత్ టాక్ అన్నదే ఏ సినిమాకు అయినా కీలకం. సినిమాలో కంటెంట్ గొప్పది కాకపోయినా, ఙనాలకు నచ్చి హిట్ అయిన సినిమాలు చాలా అంటే చాలా వున్నాయి. హీరోయిన్ లేదా పాటలు లేదా డ్యాన్స్ లు నచ్చి హిట్ అయిన సినిమాలు వున్నాయి. అవి క్రిటిక్స్ నచ్చకపోయినా జనం హిట్ చేసారు అని మరిచిపోకూడదు.
తిన్న బిరియానీ మనకు నచ్చితే చాలు… జనాల ఒపీనియన్ అవసరం లేదు అన్నది హీరో రామ్ మాట. ఎవరికి వారు నచ్చింది అనుకుంటే, అదో పెద్ద సమూహం అవుతుంది. ఇద్దరిలో ఒకరికి నచ్చి, మరొకరికి నచ్చకపోతే అది డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఈ నచ్చడం, నచ్చకపోవడం అన్నది పెద్ద సంఖ్యలో సమానంగా వుంటే సినిమా యావరేజ అవుతుంది. నచ్చకపోవడం పెరిగితే ఫ్లాప్ అవుతుంది. నచ్చడం ఎక్కువ వుంటే హిట్ అవుతుంది. అది బిరియానీ అయినా, సినిమా అయినా. ఈ చిన్న లాజిక్ రామ్ మిస్ అవుతున్నారు.
రామ్ చెబుతున్నది ఏమిటంటే, పక్క వాడిని అడగకండి, వాడి అభిప్రాయం పట్టించుకోకండి. మీరు వెళ్లి టేస్ట్ చేయండి అని. కానీ ఇప్పుడు జనాలు ఇలా లేరు. తాము టేస్ట్ చేసి, డబ్బులు ఖర్చు చేసి, అప్పుడు తెలుసుకునే ఆలోచనలో లేరు. డబ్బులు సేవ్ చేసుకునే మూడ్ లో వున్నారు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు అంత ఎక్కువైపోలేదు. పైగా వేరే విధమైన అవకాశాలు అనేకం వచ్చాయి.
పనిలేని వాళ్లు, పకోడీగాళ్లు అని రామ్ ఫ్రస్టేషన్ తో అని వుండొచ్చు. ఎందుకంటే వరుస డిజాస్టర్లే కదా అన్నీ. ముందు రామ్ తెలుసుకోవాల్సింది ఫ్లాప్ అయిన తన సినిమాలు అన్నీ కళాఖండాలేనా? కాదా? అన్నది. రామ్ ఇంతకు ముందు చేసిన ఫ్లాప్ సినిమాలు కూడా అంతో ఇంతో కలెక్షన్లు కళ్ల చూసాయి.
అంటే ఎంతో కొంత మంది పక్కవాడి మాటలు వినకుండా, సోషల్ మీడియా చూడకుండా వెళ్లి చూసారు. కానీ వెళ్లి చూసిన తరువాత బాగుంది అని వారు చెప్పి వుంటే మరి కొంత మంది చూసి వుండే వారు. సినిమా హిట్ అయ్యేది. అలా జరగలేదు అంటే వారికి కూడా నచ్చలేదు. సైలంట్ గా వుండిపోయారు అనుకోవాలి.
రవితేజ కూడా ఓ ఇంటర్వూలో రివ్యూ చెప్పేవాళ్లు ఎక్కువైపోయారు అంటున్నారు. కాలం మారుతోంది. టెక్నాలజీ మారుతోంది. ఆల్టర్ నేటివ్ మీడియా అనేది ఒకటి వచ్చింది. కాలంతో వచ్చిన అన్న మార్పులను అంగీకరించినపుడు, దీన్నీ అంగీకరించాల్సిందే. దాన్ని మించే లెెవల్ కంటెంట్ ఇవ్వాల్సిందే. అంతే తప్ప ఇవన్నీ లేకపోతే మన సినిమా హిట్ అయిపోతుంది అని అనుకొకూడదు.
రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ థమాకా కేవలం మౌత్ టాక్ వల్లనే హిట్ అయింది. గొప్ప సమీక్షలు ఏమీ రాలేదు. అంటే సమీక్షలు ఎలా వున్నా, రివ్యూ లు ఎలా వచ్చినా, మౌత్ టాక్ ను మించింది లేదు అని ప్రూవ్ చేసింది. మరి అలాంటి మౌత్ టాక్ మిగిలిన సినిమాలకు ఎందుకు రాలేదు అన్న దిశగా ఆలోచనలు సాగాలి తప్ప, తమ సినిమా ను కిల్ చేసేసారు, లేదా కిల్ అయిపోయింది అనే దిశగా అయితే కాదు.
ఓటమికి కారణాలు వెదుక్కోవడం సులువు. కానీ గెలుపు సాధించడం కష్టం. కానీ కష్టం అయినా గెలుపు ఇచ్చే కిక్ వేరు. ఆ కిక్ కోసం ప్రయత్నిస్తే ఫలితం వుంటుంది. కేవలం ఓటమి సాకులు వెదుక్కోవడం కన్నా.
Pani paata Leni pakodi gadivi ante nuvve
Call boy jobs available 8341510897
Vc estanu 9380537747
pakodi herola pakodi cinemalu
మార్ ముంత చోడ్ చింతా
జనం పట్టించుకోరు
నచ్చితేనే మేం చూస్తాం
సినిమా నచ్చినా థియేటర్లో మాత్రం చూడం
Content baagopote, nepo ranjas like ram would be boycotted