జగన్ అసెంబ్లీకి వస్తేనే మరి!

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది. లేకపోతే ఒంటి చేత్తో చప్పట్లు అన్నట్లుగా సభ ఏకపక్షంగానే సాగుతుంది. చర్చల మధ్యన మజా అయితే ఉండదు. అధికార కూటమిలో మూడు పార్టీలూ జగన్ అసెంబ్లీకి…

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది. లేకపోతే ఒంటి చేత్తో చప్పట్లు అన్నట్లుగా సభ ఏకపక్షంగానే సాగుతుంది. చర్చల మధ్యన మజా అయితే ఉండదు. అధికార కూటమిలో మూడు పార్టీలూ జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాయి.

అసెంబ్లీలో జగన్ ఉంటే ఆయన తప్పులను ఎత్తి చూపుతూ ఘాటైన విమర్శలు చేయాలని కూటమి పక్షాల ఆశ ఆరాటం. అయితే జగన్ మాత్రం ఆ చాన్స్ వారికి ఇవ్వడం లేదు. వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉన్నపుడు 23 సీట్లతో చంద్రబాబు అపోజిషన్ లో ఉన్నారు. ఆయన తొలి మూడేళ్ళు సభకు హాజరయ్యారు.

అపుడు వైసీపీ అధికార పక్షంగా ప్రతీ అంశం మీద చర్చను పెట్టి అంతా మీ నిర్వాకమే అని ప్రతిపక్షంతో చెడుగుడు ఆడింది. ఇపుడు 164 మందితో అధికార పక్షం ఉంది. మూడు పార్టీలు ఉన్నాయి. 11 సీట్లతో విపక్షం ఉంది. దాంతో ప్రతీ అంశానికి ప్రతిపక్షం వైపు చూపిస్తూ సభలో వైసీపీని టార్గెట్ చేయవచ్చు.

ఇవన్నీ ఊహించేనేమో జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఆయన కొత్త శాసనసభలో కేవలం రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. ఒకటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినపుడు, రెండవది గవర్నర్ స్పీచ్ కి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్న ఉత్కంఠ సాగుతోంది.

ఇంతలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఆయన వస్తే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని అన్నారు. అయితే జగన్ ఎమ్మెల్యే సుమా అని ఆయన గుర్తు చేశారు. అంటే జగన్ కోరినట్లుగా ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వడం లేదని అర్ధం అవుతోంది.

జగన్ ఇదే విషయం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద తీర్పు ఎలా వస్తుందో చూడాలి. ఈసారి జరిగేవి శీతాకాలం సమావేశాలే. అప్పటికి తీర్పు అనుకూలంగా వస్తే జగన్ రావచ్చు. లేకపోతే ఆయన వ్యూహం ఏమిటి అన్నది చూడాలి. అయితే స్పీకర్ మాత్రం ఎమ్మెల్యేగానే జగన్ ఈసారి అసెంబ్లీలో ఉంటారు అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు అవకాశాలు ఇస్తామని అంటున్నారు.

అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రివిలేజెస్ వేరు. ఆయన ప్రతీ అంశం మీద మాట్లాడాలనుకుంటే చాన్స్ తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యేగా అయితే మాత్రం స్పీకర్ ఎపుడిస్తే అపుడే. ఇవన్నీ చూస్తూంటే జగన్ అసెంబ్లీకి రావాలని అధికారం పక్షం కోరడంలో వ్యూహం ఉంది. జగన్ రాకుండా ఉండడం లో వ్యూహం ఉంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఎక్కువ వ్యూయర్ షిప్ లభించింది అంటున్నారు. అక్కడ అధికార విపక్షాల మధ్య సభలో చర్చలు సాగుతున్నాయి. ఏపీలో అధికార పక్షమే ఉంది. ప్రతిపక్షం వస్తేనే మజా అన్నట్లుగా ఉంది.

25 Replies to “జగన్ అసెంబ్లీకి వస్తేనే మరి!”

    1. అసలు వాడు భూమ్మీద ఉండటమే దండగ, నువ్వేంటి రా ఇంకా వైజాగ్ తిరుపతి అంటావ్.

  1. Emi icchina Jagan assembly radu enduku ante thanaki dynamic ga answer chayytam teliyadu. CM ga vunnapudu ainakoda thanu emi dayanamic answer chesina okka session choopinchandi

    1. ఒంటరిగా పోటీ చేయలేని నీ కూటమి పార్టీ లు దమ్మూ, ధైర్యం గురించి మాట్లాడటం కామెడీ గా వుంది….😂😂😂

      1. Ycp kukkalaki potthu ante abhyardhulu leka ane ardham anukuntaa

        Potthu pettukundi anti govt votes cheelakoodadani . Jalaga vedhava aa alliance ni aapalekapoyaadu

        Jalaga vedhava adukkunnaa vaaditho evaroo potthu pettukoru

        Bangalore paaripoyina pilli Vaadu

        Assembly back side nunchi paaripoyina jalaga vedhava

        Alliance annadi fiuture avasaraalaa kosam

      2. Ycp kukkalaki potthu ante abhyardhulu leka ane ardham anukuntaa

        Potthu pettukundi anti govt votes cheelakoodadani . Jalaga vedhava aa alliance ni aapalekapoyaadu

        Jalaga vedhava adukkunnaa vaaditho evaroo potthu pettukoru

        Bangalore paaripoyina pilli Vaadu

        Assembly back side nunchi paaripoyina jalaga vedhava

        Alliance annadi fiuture avasaraalaa kosam

  2. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. దీ ఫర్నీచర్ దొ0గ

  3. ‘తిక్కలోడి పాపాల పాలన లో విరక్తి చెందిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికిరాని సన్నాసి, అంటూ Fan రెక్కలు మడత పెట్టి వీడి గుడ్డలోకి 11 ఇంచులు ది0పారు

  4. అసెంబ్లీకి వస్తే మొగుడు పవన్కళ్యాణ్

    ముందు కూర్చుని మాట్లాడాలాంటే భయం తో కూడిన సిగ్గు బాబోయ్.. అందుకే నేను రాను.. అర్థమైనదా??

  5. చిన్నప్పుడు స్కూలు కి వెళ్ళలేదు.

    సిఎం గా వున్నప్పుడు కాంప్ ఆఫీసు కి వెళ్ళలేదు.

    కోర్టు లో విచారణా లకి వెళ్ళలేదు.

    ఇప్పడు ఎలా వెళతాడు.

    అన్న ఎప్పుడు కూడా ఆబ్సెంట్ కాండిడేట్ నే.

Comments are closed.