పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బ తీయాల‌ని వ్యూహం

పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బకొట్టి ప్ర‌తీకారం తీర్చుకోడానికి టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపులోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కుప్పంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీనీ చావుదెబ్బ తీశారు. కుప్పం…

పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బకొట్టి ప్ర‌తీకారం తీర్చుకోడానికి టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపులోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కుప్పంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీనీ చావుదెబ్బ తీశారు. కుప్పం మున్సిపాల్టీతో స‌హా మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. అలాగే వైసీపీ మ‌ద్ద‌తుదారులైన స‌ర్పంచులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు.

దీంతో కుప్పంలో ఏదో జ‌రిగిపోతోంద‌న్న భయాన్ని వైసీపీ సృష్టించ‌గ‌లిగింది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కుప్పంలో త‌న వైపు నుంచి లోపాల్ని గుర్తించారు. త‌న ప్ర‌తినిధిగా ఎమ్మెల్సీ శ్రీ‌కాంత్‌ను అక్క‌డ నియ‌మించారు. అలాగే నెల‌కో, రెండు నెల‌లకోసారి త‌ప్ప‌కుండా కుప్పానికి వెళ్లాల‌ని నియ‌మంగా పెట్టుకున్నారు. దాన్ని ఆచ‌రించారు కూడా. దీంతో అసంతృప్తుల‌ను చ‌ల్ల‌బ‌రిచి పార్టీకి ప‌ని చేసేలా బాబు చేయగ‌లిగారు.

కానీ కుప్పంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మితో చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం చేయ‌డంలో వైసీపీ స‌క్సెస్ అయ్యింది. భ‌య‌ప‌డ్డ చంద్ర‌బాబు అన్నీ చ‌క్క‌దిద్దుకున్నారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పులివెందుల టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా స్కూల్ క‌మిటీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే పులివెందుల నియోజ‌క వ‌ర్గంలో చాలా చోట్ల వైసీపీ మ‌ద్ద‌తుదారాలు చేతులేత్తేశార‌ని స‌మాచారం. కొత్త‌గా ప్ర‌భుత్వం వ‌చ్చింద‌ని, అన‌వ‌స‌రంగా కేసుల్లో ఇరికిస్తార‌నే భ‌యంతో అస‌లు పోటీకే ఆస‌క్తి చూప‌లేద‌ని తెలిసింది. చివ‌రికి వైఎస్ జ‌గ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌, వైసీపీకి కంచుకోట అయిన పులివెందుల‌లో కూడా ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుదారాలు స్కూల్ క‌మిటీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి జంకారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదే రీతిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఏక‌ప‌క్షంగా చేసుకుంటామ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. పులివెందుల మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా తూగొట్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి పేరు ప్ర‌చారంలో వుంది. అలాగే వేంప‌ల్లెను న‌గ‌ర పంచాయ‌తీగా మార్చి, అక్క‌డి నుంచి చైర్మ‌న్‌గా మునిరెడ్డిని చేస్తామ‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు వైసీపీ నాయ‌కుల‌తో నామినేష‌న్లు వేయించే ప్ర‌శ్నే లేద‌ని తెగేసి చెబుతున్నారు.

పులివెందుల మున్సిపాల్టీలో టీడీపీ జెండా ఎగుర‌వేసి చంద్ర‌బాబుకు గిఫ్ట్ ఇస్తామ‌ని టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. పులివెందులపై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారిస్తే త‌ప్ప‌, అక్క‌డ త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది.

10 Replies to “పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బ తీయాల‌ని వ్యూహం”

Comments are closed.