Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో చంద్రన్నను అడ్డుకుంటారా.. ఈనాడు ఏడుపు

అయ్యో చంద్రన్నను అడ్డుకుంటారా.. ఈనాడు ఏడుపు

ప్రజా చైతన్య యాత్రల పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతా వీధి నాటకాలు వేస్తూ కాలంగడిపేస్తున్నారు. అయితే వీటికి సరైన ప్రజాదరణ లభించక పోవడంతో.. మధ్యమధ్యలో మరిన్ని రసవత్తరమైన డ్రామాలకు తెరతీశారు. అలాంటిదే విశాఖ జిల్లా పెందుర్తి పర్యటన. పెందుర్తిలో భూ సమీకరణపై రాద్ధాంతం చేసేందుకు హడావిడిగా అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు బాబు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విజయనగరం వెళ్లే సమయంలో మార్గం మధ్యలో పెందుర్తిలో గొడవ చేసి వెళ్లాలనేది బాబు ఆలోచన.

కానీ ఆ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే అసలు అనుమతే రద్దు చేసినట్టు, చంద్రబాబుని విశాఖ రాకుండా అడ్డుకున్నట్టు అనుకూల మీడియా హడావిడి మొదలు పెట్టింది. బుధవారం రాత్రి పోలీసులు క్లియర్ కట్ గా చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసుకోవద్దని, ఎక్కువ వాహనాలు పెట్టొద్దని, ఎక్కువమంది కార్యకర్తల్ని కూడా పర్యటనకు తీసుకొచ్చి అనవసరంగా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించొద్దని స్పష్టం చేశారు.

అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం అట్టుడికిపోతున్నట్టు వ్యవహరిస్తోంది. విశాఖలో బాబు అడుగుపెడితే వైసీపీలో వణుకు పుడుతుందని, అందుకే ఆయనని విశాఖ రాకుండా అడ్డుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టింది. పోలీసులు కూడా అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారంటూ మరో బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది.

ఇదే మీడియా గతంలో జగన్ ను కనీసం ఎయిర్ పోర్ట్ నుంచి బైటకు రానీయకుండా అడ్డుపడినప్పుడు ఎక్కడికిపోయింది. అప్పుడు పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారని, రాయలసీమ ఫ్యాక్షనిజం చూపించారంటూ వ్యతిరేక కథనాలిచ్చిన ఈనాడు, ఏబీఎన్ ఇప్పుడెందుకు పోలీసుల్ని తప్పుపడుతున్నాయి. అప్పుడు పోలీసులపై సానుభూతి చూపించిన పచ్చ మీడియా, ఇప్పుడు వారి పనితీరుని శంకిస్తోంది.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?