Advertisement

Advertisement


Home > Politics - Political News

పాఠ‌శాల‌ల ప్రారంభంపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

పాఠ‌శాల‌ల ప్రారంభంపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌ల ప్రారంభంపై జ‌గ‌న్ స‌ర్కార్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. న‌వంబ‌ర్ 2 నుంచి పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

ఇందులో భాగంగా 1, 3, 5, 7 త‌ర‌గ‌తులకు ఒక రోజు, ఆ మ‌రుస‌టి రోజు 2, 4, 6, 8 త‌ర‌గతులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పంద‌న కార్య‌క్ర‌మంపై స‌మీక్షించారు.

ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.  రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిం చాలని  అధికారులకు సీఎం సూచించారు.  విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడు రోజుల‌కు ఒకసారి తరగతులు నిర్వహిం చాలన్నారు.  మధ్యాహ్నం వరకు మాత్రమే స్కూళ్లు తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం చెప్పారు.

వ‌చ్చే నెల 2 నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌వుతుంద‌న్నారు. న‌వంబ‌ర్‌,  డిసెంబర్ నెలల్లో  పరిస్థితిని అంచ‌నా వేసి ఆ త‌ర్వాత ఎలా చేయాల‌నే అంశంపై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం చెప్పారు. 

ఒకవేళ తల్లిదండ్రులు క‌రోనా భ‌యంతో త‌మ‌ పిల్లలను బడికి పంప‌ని ప‌క్షంలో ప్ర‌త్యామ్యాయంగా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆయ‌న ఆదేశించారు. దీంతో పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై ఏపీలో ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టైంది. అయితే త‌ల్లిదండ్రులు ఎంత మాత్రం త‌మ పిల్ల‌ల్ని పంపుతార‌నే అంశంపై పాఠ‌శాల‌లు న‌డ‌వ‌డం ఆధార ప‌డి ఉంటుంది. 

ఈ విష‌యంలో సీజేఐ మౌనాన్ని వీడ‌టం మంచిది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?