Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్.. లోకేష్ కు బర్త్ డే గిఫ్ట్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్.. లోకేష్ కు బర్త్ డే గిఫ్ట్

శాసన మండలిని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సోమవారం దీనికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరగనుంది. మండలి రద్దుపై తీర్మానం చేస్తారా చేయరా అనే అంశాన్ని పక్కనపెడితే...  ఈ అంశంపై చర్చలో భాగంగా చంద్రబాబుకు మాత్రం మరోసారి బ్యాండ్ తప్పదు. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ అంతా పూర్తిచేశారు సీఎం.

యూటర్న్ అంకుల్ అనే పేరు ఊరికే రాలేదు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే బాబు, తన కెరీర్ లో ఎక్కువ భాగాన్ని ఈ యూటర్న్ లకే కేటాయించారు. గతంలో మండలిపై కూడా అలాంటి యూటర్న్ లే తీసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో మండలికి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పటి సమాచారంతో పాటు వీడియో క్లిప్పుల్ని వైసీపీ సిద్ధం చేసింది. సోమవారం సభలో కొన్ని క్లిప్పింగ్ లు చూపించడం తో పాటు.. అప్పటి అసెంబ్లీలో మండలికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటల్ని స్వయంగా జగన్ చదివి వినిపించబోతున్నారు.

వైఎస్ఆర్ తన వర్గీయులకు సీట్లు, పదవులు ఇచ్చుకునేందుకు మండలిని తిరిగి ప్రారంభిస్తున్నారని, మండలి ఏర్పాటును అడ్డుకోవాలని అప్పట్లో బాబు ఆరోపించారు. ఇప్పుడు అదే మండలిని జగన్ రద్దు చేస్తామంటున్నారు. కాబట్టి సహజంగానే బాబు రద్దు చేయొద్దని డిమాండే చేస్తారు. అంటే మండలిపై అప్పుడొక మాట, ఇప్పుడొక మాట అన్నమాట. ఇలా బాబును ఇరికించేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది వైసీపీ.

ఇప్పటికే అసెంబ్లీ వేదికగా చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు సీఎం జగన్. అంతెందుకు మొన్నటికి మొన్న అమరావతి విషయంలో నిండు సభలో స్లైడ్ షో చూపెట్టి మరీ బాబు కుటిలనీతిని, పాడు రాజకీయాన్ని కళ్లకుకట్టారు. ఈసారి మండలి విషయంలో మరోసారి బాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేయబోతున్నారు జగన్. ఈ మేరకు 58 పేజీల డేటాను బయటకు తీసినట్టు తెలుస్తోంది.

నిజానికి మండలిని రద్దు చేయడం వైసీపీ సర్కార్ కు కూడా ఇష్టంలేదు. ఎందుకంటే స్వయంగా జగన్ మంత్రివర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. మండలి రద్దు చేస్తే వాళ్లు తమ మంత్రి పదవులు వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచించే ధోరణిలోనే ఉన్నారు. అయితే సభలో టీడీపీ సభ్యులు రెచ్చగొడితే మాత్రం మండలి రద్దు దిశగా జగన్ తీర్మానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ప్రస్తుతం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థంకాక టీడీపీ ఎమ్మెల్సీలు బిక్కుబిక్కుమంటున్నారు. నిజంగా మండలిని రద్దుచేస్తే.. లోకేష్ ఇన్నాళ్లు చెప్పుకొని తిరుగుతున్న ఆ పదవి కూడా ఉండదు. యనమలకైతే ఇక ఇంటి నుంచి బయటకు రావాల్సిన అవసరమే ఉండదు. గత ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి కేసీఆర్ అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే, ఈసారి లోకేష్ బర్త్ డేకు జగన్ ఇలా మండలిని రద్దు చేసి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట.

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?