Advertisement

Advertisement


Home > Politics - Political News

అభిమానిపై చేయి చేసుకున్న బాల‌య్య‌

అభిమానిపై చేయి చేసుకున్న బాల‌య్య‌

హిందూపురం ఎమ్మెల్యే, అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అభిమానుల‌పై చేయి చేసుకోవ‌డం అల‌వాటుగా మారింది. మ‌రోవైపు బాల‌య్య దురుసుత‌నం టీడీపీకి త‌ల‌నొప్పిగా మారింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా హిందూపురం మున్సిపాలిటీలో ఆయ‌న గ‌త మూడు రోజులుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

మూడో రోజు ప్ర‌చారంలో భాగంగా హిందూపురంలోని 9వ వార్డులో ఓ ఇంట్లోకి బాల‌య్య వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న టీడీపీ కార్య‌క‌ర్త‌, అభిమాని అయిన యువ‌కుడు బాల‌య్య‌ను వీడియో తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. అది గ‌మ‌నించిన బాల‌య్య తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. 

ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఒక్క‌సారిగా అత‌ని మీద‌కి దూసుకెళ్లి చెంప ఛెళ్లుమ‌నిపించాడు.  త‌న అనుమ‌తి లేకుండా వీడియో ఎలా తీస్తావ‌ని గ‌ద్దిస్తూ ప్ర‌శ్నించాడు. వెంట‌నే వీడియో తొల‌గించాల‌ని ఆదేశించాడు. మ‌ళ్లీ కొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ల‌గ‌జేసుకుని ఆ అభిమానిని అక్క‌డి నుంచి బ‌య‌టికి పంపించారు. 

బాల‌య్య దుష్ప్ర‌వ‌ర్త‌న‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు షాక్‌కు గుర‌య్యారు. అభిమానించే వాళ్ల‌పై చేయి చేసుకోవ‌డం ఏంట‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా హిందూపురంలో బాల‌య్య ప్ర‌చారం మొద‌లు పెట్టిన రోజు నుంచే అస‌హ‌నంగా క‌నిపిస్తున్నారు.

గత మూడు రోజులుగా హిందూపురంలో బాలకృష్ణ రోడ్ షోలకు జ‌నం లేక వెల‌వెల‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

కేవ‌లం ఒక ఎమ్మెల్యేగా మాత్ర‌మే కాకుండా టాలీవుడ్ అగ్ర‌హీరోగా, ఎన్టీఆర్ త‌న‌యుడిగా విప‌రీత‌మైన క్రేజ్ ఉంద‌ని త‌న‌కు తాను ఊహిస్తూ వ‌చ్చిన బాల‌య్య‌కు జ‌నం నుంచి రెస్పాన్స్ లేక‌పోవ‌డం తీవ్ర నిరుత్సాహం క‌లిగించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న అస‌హ‌నాన్ని అభిమానిపై ప్ర‌ద‌ర్శించార‌ని టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. 

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?