Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబుకి కరోనా అలా కలిసొచ్చింది

బాబుకి కరోనా అలా కలిసొచ్చింది

మిగతావాళ్లకి ఏమో కానీ చంద్రబాబుకి మాత్రం కరోనా బాగానే కలిసొచ్చింది. హైదరాబాద్ లో బాగా రెస్ట్ దొరికింది, ఇప్పుడు మహానాడు విషయంలో కూడా కరోనా ఆయనకి మేలు చేసింది. గతేడాది ఎన్నికల్లో పరాభవ భారాన్ని తట్టుకోలేక చంద్రబాబు మహానాడు వాయిదా వేశారు. అలా కార్యకర్తల ఆగ్రహం నుంచి పలాయనం చిత్తగించారు. ఈ ఏడాది కూడా అదే సీన్.

ఇప్పటివరకూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరించిన దాఖలాలు లేవు, మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్యకర్తలతో సహా అందరూ వైసీపీ వైపు వెళ్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు చూస్తోంది, ఏకగ్రీవాలతోనే టీడీపీ పరువు మంటగలిసింది. ఈ నేపథ్యంలో 2019 కి 2020కి పరిస్థితిలో ఏ మార్పు లేదు. మరి మహానాడు సంగతేంటి? నేరుగా ప్రజలతో సమావేశమై మహానాడు ఏర్పాటు చేస్తే జేసీ దివాకర్ రెడ్డిలాంటి వాళ్లు మైక్ పుచ్చుకొని బాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. అలాంటి వాళ్లని చూసి ఇంకొందరు రెచ్చిపోతారు. ఈ తిప్పలన్నిటినీ తప్పిస్తూ కరోనా బాబుకి హెల్ప్ చేసింది.

మరోసారి జనం మధ్యలో మహానాడు పెట్టాల్సిన అవసరం బాబుకు లేకుండా చేసింది కరోనా. డిజిటల్ మహానాడు-2020 అని గొప్పగా చెప్పుకుంటున్నా లోలోపల కరోనా మంచి పని చేసిందంటూ సంబరపడుతున్నారు చంద్రబాబు. అయితే మహానాడులో కూడా టీడీపీ నాయకులు జగన్ స్తోత్రాలే చేస్తున్నారు.

మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం. పార్టీ లోటుపాట్లు చర్చించుకోవాల్సిన ఓ పెద్ద వేదిక, అందులోనూ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి జరుగుతున్న మీటింగ్. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ప్రభుత్వాన్ని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి, లీడర్లను, కేడర్ ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలు చర్చించాలి. అయితే వాటికి భిన్నంగా తీర్మానాలున్నాయి. ఎంతసేపు జగన్ పై పడి ఏడవడం మినహా ఈ డిజిటల్ మహానాడులో టీడీపీ చేస్తున్నదేం లేదు.

మహానాడు పేరుమారినా, టీడీపీ నేతల తీరు మారలేదు. అయితే మహానాడులో ఒకే ఒక్క మార్పు. గతంలో మహానాడు పేరు చెప్పి 2 రోజుల పాటు మాంచి వెరైటీ వంటకాలను రుచి చూసే నాయకులు, ఈసారి భోజనం టైమ్ కి జూమ్ ఆపేసి, ఇంటి పట్టునే అన్నం తిని మళ్లీ కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ఈ కరోనా వల్ల చంద్రబాబుకు తిట్లతో పాటు భోజనం ఖర్చు నుంచి తప్పించుకునే వెసులుబాటు దొరికింది.

సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?