Advertisement

Advertisement


Home > Politics - Political News

'ప్రజా వేదిక'ను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం!

'ప్రజా వేదిక'ను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం!

'' 'ప్రజా వేదిక' పక్కా అక్రమ కట్టడం. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన అక్రమం. అలాంటి అక్రమ  కట్టడం ద్వారా నాటి ముఖ్యమంత్రి కింది స్థాయి వారికి ఏం సందేశం ఇచ్చినట్టు? నాటి అక్రమాలను గుర్తు చేయడానికే కలెక్టర్ల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ఇదే ఆఖరి  సమావేశం. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చి వేయండి..''  అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఒకవైపు 'ప్రజావేదిక'ను తమకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విషయంలో జగన్ కు చంద్రబాబు నుంచి విన్నపం కూడా వెళ్లింది. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ విషయంలో కఠినంగానే ఉన్నారు.  ప్రజా వేదికతో పాటు ఆ కరకట్టలో చేపట్టిన నిర్మాణం అంతా అక్రమమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. 

ఈ నేపథ్యంలో అక్కడి అక్రమ  కట్టడాలను కూల్చివేయాలనే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కట్టడం ఏదైనా కూల్చివేతే అనే నిర్ణయంతో చంద్రబాబు నాయుడు ఎంతో ముచ్చటపడి కట్టించిన ఈ నిర్మాణాన్ని కూల్చి వేయాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్మాణానికి వినియోగించింది ప్రజాధనమే.

అయితే నిర్మాణ అనుమతులు  లేని చోట ప్రజాధానంతో గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని తమకు కేటాయించాలని  తెలుగుదేశం పార్టీ కోరింది. అయితే అదేమీ చంద్రబాబు సొంత డబ్బుతో కట్టిన భవనం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?