Advertisement

Advertisement


Home > Politics - Political News

ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారా..?

ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారా..?

మలేరియా చికిత్సలో ఉపయోగించే, కరోనా నివారణకు పనికొస్తుందని భావించే.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం ఎత్తివేత ఇప్పుడు రాజకీయ దుమారానికి వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం వల్లే భారత ప్రధాని మోదీ నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయం తీసుకున్నారని, దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

చైనాలో లాక్ డౌన్ కారణంగా ఔషధాల ముడిసరుకు రవాణా కష్టంగా మారడం, కరోనా నివారణకు పనికొచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో మార్చి 3న ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. అయితే రెండు రోజుల క్రితం ట్రంప్ ఈ ఔషధాన్ని తమకు సరఫరా చేయాలని భారత్ కు విజ్ఞప్తి చేశారు. పనిలోపనిగా తమతో పెట్టుకోవద్దన్నట్టు పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. ఆ వెంటనే మోడీ నిషేధాన్ని ఎత్తివేశారు. అమెరికా చేసిన విజ్ఞప్తి కంటే హెచ్చరికలకే మోడీ భయపడ్డారని, దేశం ప్రతిష్టను గంగలో కలిపేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రతిపక్షాల విమర్శల్ని పక్కనపెడితే.. మోడీ తీసుకున్న నిర్ణయం మన దేశీయ అవసరాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే విషయాన్ని అంతా గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా మలేరియా మాత్రలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. చైనా తర్వాత ఈ డ్రగ్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా మాత్రమే. అయితే దేశీయంగా కూడా ఈ మందుకు ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది.

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అసలే జనాభా ఎక్కువ. ఇలాంటి టైమ్ లో తగినంత నిల్వలు లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మనకు సరిపడ నిల్వలు పెట్టుకున్న తర్వాతే ఎగుమతులు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది సాధ్యం కాకపోవచ్చని నిపుణులు, ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు హైడ్రాక్లీ క్లోరోక్విన్ మందు తయారీకి అవసరమైన ముడిసరుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా నుంచి ముడుసరుకు వచ్చే పరిస్థితి లేదు.

కాబట్టి ముందు దేశీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని, తర్వాత అమెరికా లాంటి దేశాలకు ఎగుమతులు చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ, ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?