cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ దారి రహదారి: అదే నిబ్బరం.. అదే నిబద్ధత

జగన్ దారి రహదారి: అదే నిబ్బరం.. అదే నిబద్ధత

రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పక్షంతో ప్రతిపక్షాలే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పోటీ పడుతోంది. అధికార పక్షాన్ని ఓడించడానికి అంతా కలసి కంకణం కట్టుకున్నారు.

మరోవైపు ఈసీ ఒంటెత్తు పోకడలను ఎండగడుతూనే, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలనుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. ఆ క్రమంలో కాస్త గట్టిగానే అందరికీ కలిపి గడ్డిపెడుతున్నారు. కుట్రలు, కుయుక్తుల్ని తిప్పికొడుతున్నారు.

ప్రతిపక్షం తరపున చంద్రబాబు సహా అందరూ మాట్లాడుతున్నారు, కానీ అధికార పక్షం తరపున సీఎం జగన్ ఇంతవరకు పల్లెత్తు మాట కూడా జారలేదు. కోర్టుల్లో "స్థానిక పంచాయితీ" నలుగుతున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కామెంట్ చేయలేదు, అసలు ఆ వ్యవహారాన్ని పట్టించుకోనట్టే ఉన్నారు. 

కరోనా సాకుతో అర్థాంతరంగా ఎన్నికలను వాయిదా వేసినప్పుడు మాత్రమే.. నిమ్మగడ్డను చంద్రబాబు ఏజెంట్ గా జగన్ అభివర్ణించారు. అది మినహా.. రెండోసారి ఎన్నికల ప్రస్తావన తేలేదు, ఎన్నికల కమిషనర్ ని ఏమీ అనలేదు.

అంత అతి చేస్తున్నా స్పందించరేం..

కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని విసిగించి, ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించి మరీ ఎన్నికలను తీసుకొచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు డైరక్షన్లోనే ఇదంతా జరుగుతోందని తెలిసినా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కావడంతో ఆయనపై చేసిన ఆరోపణలు నిలబడ్డం లేదు. 

ఇక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, అమ్మఒడి రెండో విడత పంపిణీ కాకుండా ఆపాలని చూడటం కూడా ఈ ప్లాన్ లో భాగమే. అయితే సీఎం జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. కోర్టు కేసులున్న భూముల్ని మినహాయించి పట్టాల పంపిణీ మొదలుపెట్టారు, అమ్మఒడి విషయంలో కోర్టులో కేసు ఉన్నా కూడా ప్రజల కోసం ధైర్యంగా ముందడుగేశారు. 

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఎక్కడా స్థానిక పోరుపై జగన్ బహిరంగ ప్రకటన ఇవ్వలేదు. అంతర్గతంగా పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారే కానీ, పంచాయతీ పోరుని అంత సీరియస్ గా పట్టించుకున్నట్టు బైటపడటం లేదు. 

జగన్ దారి రహదారి..

రోజువారీ సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే జగన్ దృష్టంతా ఉంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని తాజాగా జగన్ అధికారులను ఆదేశించారు. 

దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలని మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చిన జగన్, కాలనీల్లో ఇంటర్నెట్ సహా ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని, మార్చి 31నాటికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక పూర్తి చేయాలన్నారు. 

జనాభా ప్రాతిపదికగా జగనన్న కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ లు, పాఠశాలలు, బస్టాప్ లు ఏర్పాటు చేయాలన్నారు.

ఓవైపు రాష్ట్రంలో రాజకీయ రణరంగం జరుగుతుంటే.. మరోవైపు కేవలం అభివృద్ధి కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టిన జగన్, ఆరోపణల పర్వాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. వివాదాలకు దూరంగా.. తన పని తాను చేసుకుపోతున్నారు.

జ‌గ‌న్..అర్జంటుగా చుట్టూ ఉన్న బ్యాచ్ ను మార్చేయ్

థియేటర్లకు ఇంకా కష్టం

 


×