Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స‌ర్కార్ క‌క్క‌లేక‌...మింగ‌లేక‌

జ‌గ‌న్ స‌ర్కార్ క‌క్క‌లేక‌...మింగ‌లేక‌

ప్ర‌తి ఒక్క‌రికీ ఓ రోజు వ‌స్తుందంటారు. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మాత్రం ఒక్క‌రోజు కాదు ... చాలా రోజులే వ‌చ్చాయి. అధికారం చివ‌రి రోజుల‌న్నీ ఆయ‌న‌వే అని చెప్ప‌క త‌ప్ప‌దు. 

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వ‌ర‌కూ పంచాయ‌తీ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత వాయిదా ప‌డిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిమ్మ‌గ‌డ్డ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. 

ఇంత‌కాలం నిమ్మ‌గ‌డ్డ‌తో జ‌గ‌న్ స‌ర్కార్ ఓ ఆట ఆడుకుంటే, ఇప్పుడు పూర్తిగా ఒన్ సైడ్ గేమ్ ఆడేందుకు నిమ్మ‌గ‌డ్డ యాక్ష‌న్ మొద‌లు పెట్టారు. నిమ్మ‌గ‌డ్డ గేమ్ ఆడుతుంటే జ‌గ‌న్ స‌ర్కార్ చేష్ట‌లుడిగి ప్రేక్ష‌కుల్లా నిస్స‌హాయంగా చూడాల్సి వ‌చ్చింది.

సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు పెట్టిన రెండురోజుల్లోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి నిమ్మ‌గ‌డ్డ గ‌ట్టి షాక్ ఇచ్చారు. దీంతో ప్ర‌భుత్వం క‌క్క‌లేక‌, మింగ‌లేక అన్న రీతిలో లోలోప‌లే ర‌గిలిపోతోంది.

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ స్వీయ త‌ప్పిదాలు చాలానే ఉన్నాయి. దీంతో చేసుకున్న వారికి చేసుకున్నంత మ‌హ‌దేవ అన్న‌ట్టు, ఆ త‌ప్పుల ఫ‌లితాల‌ను ఇప్పుడు అనుభ‌వించాల్సి వ‌చ్చింది.

పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిర‌స్క‌రించి మొద‌టి షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్‌’ పేరిట క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బ‌దిలీ చేయ‌డంతో పాటు అభిశంసిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.   

గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలని ఆదేశించారు  సెన్సూర్‌ కింద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదు.

ఇంత‌టితో నిమ్మ‌గ‌డ్డ ఆట ఆగ‌లేదు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురు చొప్పున అధికారులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ను కూడా నిమ్మగడ్డ తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన తెలిపారు. 

విజిలెన్స్‌ కేసుల్లేని వారి పేర్లనే సూచించాలన్నారు. అప్పటి వరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌–1కు అప్పగించాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు.

మ‌రోవైపు  ఎస్ఈసీ ఆదేశాల మేర‌కు గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్, చిత్తూరు  కలెక్ట‌ర్‌ నారాయణ్‌ భరత్‌గుప్తాలతో పాటు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డిలను జీఏడీకి సరెండర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్  ఉత్తర్వులు జారీ చేశారు. 

మ‌రోవైపు ఇంటింటికి రేష‌న్ పంపిణీ ప‌థ‌కం కొత్త‌దా లేక పాత‌దా? అనే విష‌య‌మై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సీఎస్‌కు నిమ్మ‌గ‌డ్డ లేఖ రాశారు. ఎన్నిక‌ల నెపంతో రానున్న రోజుల్లో జ‌గ‌న్ స‌ర్కార్‌కు అనూహ్య‌మైన షాక్‌లు ఇచ్చేందుకు నిమ్మ‌గ‌డ్డ ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దులుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

ప్ర‌తి అంశంపై నిమ్మ‌గ‌డ్డ  దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న ప‌వ‌ర్ ఏంటో చూపుతూ ...జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు చూపేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని, ఇందుకు ఆయ‌న వ్య‌వ‌హార‌మే నిద‌ర్శ‌న‌మనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?