Advertisement

Advertisement


Home > Politics - Political News

ఉత్కంఠ పోరులో మ‌మ‌త అద్భుత విజ‌యం

ఉత్కంఠ పోరులో మ‌మ‌త అద్భుత విజ‌యం

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ పోరులో తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. 

చిట్ట చివ‌రి 17వ రౌండ్‌లో 1200 ఓట్ల మెజార్టీతో త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి సువేందు అధికారిపై చ‌రిత్రాత్మాక విజ‌యాన్ని మ‌మ‌త సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించారు. దేశం యావ‌త్తు మ‌మ‌త‌బెన‌ర్జీ విజ‌యం కోసం ప‌రిత‌పించింది. అంద‌రి ఆకాంక్ష‌ను నందిగ్రామ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు చిట్ట చివ‌రి రౌండ్‌లో నెర‌వేర్చారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో 292 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 209 స్థానాల్లో అధికార పార్టీ టీఎంసీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో మ‌మ‌త‌బెన‌ర్జీ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించారు. ఎలాగైనా ప‌శ్చిమ‌బెంగాల్‌లో పాగా వేయాల‌ని ఎన్నెన్నో కుట్ర‌ల‌కు తెర‌లేపిన బీజేపీ ఎత్తులను మ‌మ‌తాబెన‌ర్జీ చిత్తు చేశారు.

వ‌రుస‌గా మూడోసారి కూడా ఆప్యాయంగా దీదీగా పిలుచుకునే టీఎంసీ అధినేత్రిపై ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌జ‌లు మ‌మ‌త చూపారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో తిరుగులేని నేత‌గా మ‌మ‌త అవ‌త‌రించారు. 

అధికారానికి ద‌రిదాపుల్లో కూడా రాకుండా బీజేపీని త‌రిమికొట్టి, తానెంత శ‌క్తిమంత‌మైన నాయ‌కురాలినో దేశానికి చాటి చెప్పారు. మ‌హామ‌హుల‌కు ఎదురొడ్డి పోరాటం చేయ‌డంలో ఈ కాల‌పు ఇందిరాగాంధీగా మ‌మ‌త‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?