Advertisement

Advertisement


Home > Politics - Political News

లోకేష్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిటర్న్ గిఫ్ట్

లోకేష్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిటర్న్ గిఫ్ట్

"లోకేష్.. ఇదిగో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాం తీసుకో. నీ జీవితంలో నీ ట్వీట్ కి ఎప్పుడూ లేనన్ని రీట్వీట్లు ఇస్తున్నాం. పండగ చేసుకో, పిన్ టు టాప్ చేసి పెట్టుకో". ఇవీ నిన్న ఎన్టీఆర్ బర్త్ డే రోజున లోకేష్ ఆయన్ని విష్ చేస్తూ పెట్టిన ట్వీట్ కు వచ్చిన సమాధానాలు.

జనం ముందుకు రాలేక, నేరుగా మాట్లాడలేక, ట్విట్టర్ లో బతికేయడం లోకేష్ కి అలవాటు. ట్విట్టర్ పక్షి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. ట్విట్టర్ లో ఆయన పొడిచిందేమీ లేదు. లోకేష్ ట్వీట్లకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే పెద్దగా రెస్పాన్స్ ఉండదు. కనీసం వెయ్యి రీట్వీట్లు పడిన టాపిక్ లు కూడా చాలా తక్కువ. వైసీపీని విమర్శించే విద్వేషపూరిత మెసేజ్ లు వెయ్యి రీట్వీట్లు దాటతాయి కానీ మిగతావాటికి వచ్చే స్పందన అంతంత మాత్రమే.

అలాంటి లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పడింది. ఇక చూస్కోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. మెసేజ్ లతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం అభిమానులు ఈ ట్వీట్ ని సంతోషంగా స్వీకరిస్తే.. నందమూరి వీరాభిమానులు మాత్రం లోకేష్ కి బాగా గడ్డిపెట్టారు.

గతేడాది ట్వీట్ వేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ చేదు అనుభవం గుర్తుంచుకునే ఇప్పుడు లోకేష్ జాగ్రత్తపడ్డాడని కొందరు మెసేజ్ లు పెట్టారు. "శెహభాష్ మంచి బుద్ధి వచ్చింది, రోజూ ఎన్టీఆర్ ఫొటోకి దండం పెట్టుకో"మని మరికొందరు సలహా ఇచ్చారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇలా 600 మెసేజ్ లు వచ్చాయి. 8400 రీట్వీట్స్ పడ్డాయి.

అన్నిటికంటే హైలెట్ ఏంటంటే.. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చూడని రీట్వీట్లిచ్చాం పండగ చేస్కోమని కొంతమంది వీరాభిమానులు ఫన్నీ మెసేజ్ పెట్టడం. గతేడాది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా తిట్లు తిన్న లోకేష్, ఈ ఏడాది చెప్పి మరీ అభిమానుల చేతిలో బుక్కయ్యారు.

ఇక చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ జోలికి వెళ్లలేదు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడకి బర్త్ డే విషెస్ చెప్పే తీరిక ఉన్న చంద్రబాబు, పార్టీ కోసం కష్టపడ్డ ఎన్టీఆర్ ని పక్కనపెట్టడం మాత్రం, ఆయన వెన్నుపోటు రాజకీయాలకు మరో ఉదాహరణగా చెప్పక తప్పదు.

కొడుకు మీదున్న ప్రేమతో, నందమూరి ఫ్యామిలీని దూరం పెడుతూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ అంటే భయపడుతున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో చంద్రబాబును ఖాతరు చేయలేదు. దాదాపు కీలకమైన టీడీపీ నేతలంతా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. 

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?