cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

'మనోహరం'గా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

'మనోహరం'గా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

అధికారికంగా అవ్వొచ్చు, అనధికారికంగా అవ్వొచ్చు.. జనసేన పార్టీలో నంబర్-2 ఎవరంటే నాదెండ్ల మనోహర్ పేరు వినిపిస్తుంది. అంతర్గతంగా ఏం జరుగుతోంది, మనోహర్ పాత్ర ఏంటనేది జనాలకు తెలియదు కానీ, బహిరంగంగా మాత్రం పవన్ తర్వాత ఆయనే కనిపిస్తారు. 

చాలా విషయాల్లో మనోహర్ కు పవన్ ఎక్కువ స్కోప్ ఇస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా ఈ అంశంపై పూర్తి క్లారిటీ వస్తుంది.

తిరుపతిలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్, రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కంటే.. పక్కనే ఉన్న మనోహర్ పై వాలడమే ఎక్కువగా కనిపించింది. జర్నలిస్ట్ ప్రశ్న అడగడమే ఆలస్యం, వెంటనే పక్కచూపు చూడడం, మనోహర్ తో గుసగుసలాడడం.. ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కనిపించింది.

మనోహర్ పై పవన్ ఎంతలా డిపెండ్ అయిపోయారో ఇవాళ్టి మీడియా సమావేశం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. చాలా విషయాలపై మనోహర్ ఏదో అందిస్తుంటే, పవన్ మాట్లాడుతున్నారు. అంతేతప్ప సూటిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. వైసీపీని విమర్శించడం, బీజేపీని పొగడ్డం మినహా.. చాలా అంశాల్లో పవన్ కు మనోహర్ ప్రామ్టింగ్ కనిపించింది.

ప్రెస్ మీట్ మొదలైన వెంటనే ముందుగా ప్రిపేర్ అయిన అంశాలన్నింటికీ చక్కగా అప్పజెప్పారు పవన్. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రిపోర్టర్ ప్రశ్న అడగడం, జనసేనాని పక్కకు వాలడం కామన్ అయిపోయింది. 

దేవాలయాలపై దాడులు, తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థి అంశం, రామతీర్థం ఘటన, వ్యవసాయ చట్టం.. ఇలా ఎన్నో అంశాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు మనోహర్ వైపు పవన్ చూడడం, ఆయన చెవిలో గుసగుసలాడడం, ఆ తర్వాత స్పందించడం కనిపించింది.

ఒక దశలో పవన్, మనోహర్ వైపు ఒరుగుతుంటే, మీడియా ప్రతినిధులు ముసిముసిగా నవ్వుకున్నారు. అయితే ఒకప్పట్లా పవన్ పారిపోలేదు. గతంలో ప్రెస్ మీట్ అయిన వెంటనే చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయేవారు. 

ఈసారి మాత్రం మనోహర్ సహకారంతో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చి వెళ్లారు. 

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

 


×