Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్ బూతు పురాణం

పవన్ కల్యాణ్ బూతు పురాణం

పవన్ కల్యాణ్ నోటి వెంట బూతులు కూడా వస్తాయా ? అది కూడా అలాంటిలాంటి బూతులు కావు. ఇక్కడ ప్రింట్ చేయలేని బూతులు. కానీ ఇది నిజం. పవన్ నోట బూతులు దొర్లాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయేలా పవన్ బూతు పదాలు వాడారు.

నెల్లూరు జిల్లాలో పార్టీ మీటింగ్ ల అనంతరం చిన్న పంచాయితీ జరిగింది. స్థానికంగా ఆధిపత్యం కోసం చూస్తున్న ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అందులో ఒకరు పవన్ కల్యాణ్ పీఏకి వ్యక్తిగతంగా మెసేజ్ లు కూడా పంపించారు.

గతంలో ఒకటి రెండు సార్లు ఇదే విషయం పవన్ దృష్టికి వచ్చినా ఆయన చూసీ చూడనట్టు ఉన్నారు. ఇటీవల కార్యకర్తల మీటింగ్ జరిగిన సందర్భంలో సదరు నాయకుడు పవన్ కల్యాణ్ ముందే కన్నీళ్లు పెట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేశారు. తాజాగా.. ఇప్పుడు అదే నాయకుడు పవన్ ముందు మరోసారి ఆరోపణల పర్వం మొదలు పెట్టారు.

దీంతో పవన్ కి బాగా మండింది. అసలే పార్టీ పరిస్థితి బాగోలేని సమయంలో ఇలా ఒకరిపై ఒకరు వంతులు పెట్టుకుని పార్టీ పరువు మరింత దిగజారుస్తారా అంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగితే సరిపోయేది, కానీ పవన్ నోటి వెంట ఊహించని విధంగా బూతులు వచ్చేసరికి సదరు నాయకుడు షాకయ్యాడు.

మనోడివి కదా అని టికెట్ ఇచ్చి ప్రోత్సహించాను, ఇలా చాడీలు చెప్పి పార్టీ పరువు బజారుకీడుస్తావా.. అంటూ మండిపడ్డారు పవన్. ఓ దశలో నిన్ను అందరిముందు కొడితే ఏం చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. మీడియా పరోక్షంలో జరిగిన ఈ ఘటన స్పాట్ లో ఉన్న వాళ్లందర్నీ షాక్ కు గురిచేసింది.

ఆ తర్వతా ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడే సరికి పవన్ ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది. పైగా పవన్ ఇప్పుడు పార్టీ విషయంలో, పార్టీ నేతలపై పూర్తి ఫ్రస్టేషన్లో ఉన్నారట. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో.. తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం కూడా డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్ అంతా ఆ చోటా నాయకుడిపై తీర్చుకున్నారు పవన్. బూతులు తిట్టి తన ఆవేశాన్ని తగ్గించుకున్నారు కానీ మిగతా నాయకుల ముందు పలుచన అయ్యారు. 

ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?