Advertisement

Advertisement


Home > Politics - Political News

లాజిక్ ఓకే.. నీ విచక్షణ ఏమైంది పవన్!

లాజిక్ ఓకే.. నీ విచక్షణ ఏమైంది పవన్!

ప్రతిపక్షం అన్న తర్వాత ఏదో ఒకటి విమర్శించాలి. ఎంత మంచి పనిచేసినా అందులో ఏదో ఒక కొర్రీ పెట్టాలి. కనీసం కొర్రీ పెట్టడానికి కూడా ఆస్కారం లేకపోతే, వితండవాదం మొదలుపెట్టాలి. అడ్డమైన లాజిక్కులు బయటకు తీయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. ఏమాత్రం వంక పెట్టడానికి వీల్లేకుండా మొదలైన రైతుభరోసా కార్యక్రమంపై అడ్డమైన లాజిక్కులు బయటకు తీస్తున్నారు పవన్.

రైతు భరోసా పథకం కింద ఇస్తున్న మొత్తంలో కేంద్రం వాటా కూడా ఉందని, కేంద్రం ఇచ్చిన డబ్బును కూడా కలిపి రైతు భరోసా కింద ఆర్థికసాయం అందించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు పవన్. ఇక్కడ పవన్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే.. రైతులకు ఆర్థిక సాయం అందించడం ముఖ్యమా లేక ఆ సాయం కేంద్రం నుంచి వచ్చిదా లేక రాష్ట్రం ఇస్తుందా అని పనికిమాలిన కొర్రీలు తీయడం ముఖ్యమా?

నిజానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర సాయం లేకుండా ఏ పథకాన్ని ప్రవేశపెట్టడానికి వీలుకాదు. అంతలా రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయినా ఈ విషయాన్ని జగన్ దాచడానికి ప్రయత్నించలేదు. తన ప్రతిష్టాత్మక రైతుభరోసా కార్యక్రమానికి పీఎం కిసాన్ అనే పదాన్ని కూడా జోడించారు. ఇదే విషయాన్ని పథక ప్రారంభంలో కూడా చెప్పారు. అంతేకాదు.. తను చెప్పిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తున్నారు. అది కూడా చెప్పిన టైమ్ కంటే ఏడాది ముందే ప్రారంభించారు. ఇవన్నీ పవన్ కు తెలియనివి కావు. కానీ వీటిని పవన్ మనసు అంగీకరించదు.

ఇప్పుడు మాత్రమేకాదు, చంద్రబాబు హయాంలో కూడా కేంద్ర నిధులు వచ్చాయి. ఎన్నో పథకాల కింద కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఏ ఒక్క పథకం క్రెడిట్ ను కేంద్రానికి ఇవ్వలేదు చంద్రబాబు. ఓవైపు బీజేపీతో కాపురం చేస్తూ కూడా పథకాల్లో మోడీ పేరెత్తడానికి బాబుకు మనసురాలేదు. ఆర్భాటంగా ప్రారంభించిన నీరు-చెట్టు పథకం నుంచి ఎన్నికలకు ముందు ఆఖరి నిమిషంలో ప్రకటించిన నిరుద్యోగ భృతి వరకు ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంది. మరి అప్పుడు లేవని పవన్ గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తోంది?

రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 12వేల 500 రూపాయలకు కేంద్రసాయం 6వేలు కలిపి 18వేల 500 ఇవ్వాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ డిమాండ్ ను జగన్ పరిశీలిస్తారు. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రైతులకు లబ్దిచేకూర్చే ఏ చిన్న విషయాన్ని జగన్ విడిచిపెట్టరు. ఈ విషయంలో పవన్ కల్యామ్ తెచ్చిపెట్టుకున్న ఆక్రోషంతో, బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదు. ఇకనైనా పవన్ ఇలాంటి చిల్లర లాజిక్కులు బయటకు తీయకుండా, సహేతుక విమర్శలు చేస్తూ, నిర్మాణాత్మక సలహాలు ఇస్తే బాగుంటుంది.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?