Advertisement

Advertisement


Home > Politics - Political News

నేను చ‌చ్చిపోవాలేమో...స‌మంత ఎందుక‌న్న‌దంటే?

నేను చ‌చ్చిపోవాలేమో...స‌మంత ఎందుక‌న్న‌దంటే?

తొలి నాళ్ల‌లో అందంతో ఆల‌రించిన ఆమె..ఆ త‌ర్వాత న‌ట‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో త‌న ప్ర‌తిభ‌ను చాటారు. ఆ అగ్ర‌హీరోయిన్ స‌మంత‌. హీరోయిన్‌గా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న స‌మంత పేరు వింటే...ఆమె న‌టించిన పాత్ర‌లే గుర్తుకొస్తాయి. రంగ‌స్థ‌లంలో ఆమె ప‌ల్లెటూరి పిల్ల‌గా త‌న పాత్ర‌కు జీవం పోశారు. అలాగే మ‌హా న‌టి, మ‌జిలీ, ఓ బేబీ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్ర‌లు అభిమానుల ప్రేమాభిమానాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. లాక్‌డౌన్ వేళ‌లో ఇంటికే ప‌రిమిత‌మైన స‌మంత ట్విట‌ర్‌లో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

లాక్‌డౌన్‌లో తెలుసుకున్న గొప్ప విష‌యం ఏంట‌నే ప్ర‌శ్న‌కు క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఎప్పుడూ ప‌రుగెత్తాల్సిన ప‌నిలేద‌ని తెలుసుకున్నాన‌న్నారు. అలాగే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే క‌ల ఇంట్లోనే ఉండ‌చ్చ‌ని, ప్రేమానురాగాలు నిండిన కుటుంబంతో గ‌డ‌ప‌డ‌మే ఆ క‌ల కావ‌చ్చ‌న్నారు. సెలబ్రిటీగా జీవితంలో క‌ష్టంగా తోచిన విష‌యాలేంటి అనే ప్ర‌శ్న‌కు మ‌న గురించి ప్ర‌చారం అవుతున్న అబ‌ద్ధాల‌ను వింటున్న‌ప్పుడు క‌ష్టంగా అనిపిస్తుంద‌న్నారు.

త‌న‌ను మంచి అమ్మాయిగా మార్చేది ఉప‌వాస‌మే అన్నారు. అభిమానులే త‌న బ‌లం, బ‌ల‌హీన‌త అని స‌మంత చెప్పుకొచ్చారు. త‌న‌కు న‌చ్చిన సినిమాల గురించి కూడా స‌మంత చెప్పారు. ఇటీవ‌ల త‌న‌కు బాగా న‌చ్చిన సినిమా జోజో ర్యాబిట్ అని స‌మంత తెలిపారు. అలాగే త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ సినిమా ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పుకొచ్చింది.

నాగ‌చైత‌న్యే త‌న సంతోష‌మ‌ని స‌మంత తెలిపారు. అమ‌ల గురించి చెప్ప‌మంటే...మంచి స్నేహితురాలు, త‌న‌కు గొప్ప మార్గ‌ద‌ర్శి అని ఆమె వెల్ల‌డించారు. చివ‌రిగా ఆమె ఓ ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. అదేంటంటే...రామ్‌తో క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అభిమానులు ఎదురు చూస్తున్నార‌ని, ఏమంటార‌ని ప్ర‌శ్నించ‌గా---అమ్మో...త‌న ఎన‌ర్జీకి మ్యాచ్ అయ్యేలా చేయాలంటే నేను చ‌చ్చిపోవాలేమో అని స‌మంతా న‌వ్వుతూ స‌ర‌దాగా చెప్పుకొచ్చారు.

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?