Advertisement

Advertisement


Home > Politics - Analysis

మోడీ కూడా అదే పాట పాడేసారు

మోడీ కూడా అదే పాట పాడేసారు

మొత్తానికి ప్రధాని మోడీ కూడా అదే పాట పాడేసారు. వైకాపా పాలనలో అవినీతి తప్ప అభివృద్ది లేదని గొంతు విప్పారు. ఇప్పటి వరకు మోడీ ఏనాడూ వైకాపాను పెద్దగా విమర్శించింది లేదు. సెంట్రల్ భాజపాలో థర్డ్ నుంచి కింద వరకు వున్నవారు అడపాదడపా వైకాపా మీద, జగన్ మీద విమర్శలు కురిపిస్తూనే వచ్చారు. ఆఖరికి అమిత్ షా కూడా తీవ్రమైన పదజాలం వాడి విమర్శలు కురిపించారు. ఇక మిగిలింది ప్రధాన్ నరేంద్ర మోడీ ఒక్కరే. ఇప్పుడు ఆయన కూడా అదే పాట పాడేసారు.

వైకాపా కు అధికారం ఇస్తే రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయిందని ప్రధాని ఆరోపించారు. ఒక పక్క ‘ఇండియా’కూటమి ని విమర్శిస్తూనే, పనిలో పనిగా వైకాపా మీద కూడా మాటలు విసిరారు. 2019లో తాను ఏమన్నారో మరిచి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు తరచు పురంధీశ్వరి ఆరోపిస్తున్నట్లు, లిక్కర్ అవినీతిని కూడా మోడీ ప్రస్తావించారు.

అంటే మొత్తం మీద ఇక జగన్ ఒక్కరు ఒక వైపు, టోటల్ దేశ రాజకీయ పక్షాలు అన్నీ ఒక వైపు అని క్లారిటీ వచ్చేసింది. అటు ఇండియా కూటమితో జగన్ కు సంబంధాలు లేవు. ఇప్పుడు ఎన్డీఎ తో నూ లేవు. మోడీ అండ వుంది అనుకుంటే అదీ లేదని అర్థమవుతోంది. మొత్తం మీద ఇది జగన్ కు క్లిష్టకాలం. ఈ టఫ్ టైమ్ లో జగన్ నెగ్గుకొస్నే అర్జునుడు మెరుస్తాడు. లేదంటే అభిమన్యుడిగా మిగిలిపోతాడు.

కొసమెరుపు ఏమిటంటే మోడీ అండ్ కో ఎంత గట్టిగా విమర్శిస్తే జగన్ కు అంత మంచిది అనే కామెంట్లు కూడా ఇంకా వినిపించడం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?