Advertisement

Advertisement


Home > Politics - Political News

కోడెల అంతిమయాత్ర లేక టీడీపీ విజయయాత్ర..?

కోడెల అంతిమయాత్ర లేక టీడీపీ విజయయాత్ర..?

ప్రజలకు ఉత్సాహంగా అభివాదాలు.. విక్టరీ సంకేతాలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మొదలుకుని, బాలకృష్ణతో పాటు.. చోటామోటా నేతలు కూడా తమ కార్యకర్తలకు విజయ సంకేతాన్ని చూపుతూ.. కోడెల అంతిమయాత్రను సాగించారు. ఆ సీన్లన్నీ చూశాకా అది కోడెల శివప్రసాద్ రావు అంతిమయాత్రనా లేక తెలుగుదేశం పార్టీ విజయయాత్రనా.. అంటూ అనేకమంది సందేహిస్తూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ కోడెల మరణం నుంచి సానుభూతిని పొందాలని చూస్తోందని స్పష్టం అవుతోంది. ఇలాంటి శవరాజకీయాలు చంద్రబాబు నాయుడుకు కొత్త కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా నయం కోడెల ఆత్మహత్యను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాస్తులపై దాడులూ గట్రా చేయలేదు! అలాచేస్తే వచ్చే సానుభూతి కూడా పోతుందని భయపడినట్టుగా ఉన్నారు.

ఇప్పుడు కోడెల మీద ఎనలేని సానుభూతి చూపిస్తూ, ఆయన మరణాన్ని తన రాజకీయం కోసం క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు.. ఇదివరకూ కోడెల ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కనీసం పరామర్శించలేదని జనాలు అనుకుంటున్నారు. అప్పుడు కోడెలకు గుండెపోటన్నారు, అయితే అప్పుడే అది ఆత్మహత్యాయత్నం అని ఇప్పుడు బయటకు వస్తోంది. తెలంగాణ పోలీసుల పరిశోధనలో ఈ విషయం తేలిందట. కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది.

మరి ఆ విషయాలు చంద్రబాబుకు తెలిసి ఉండవా? కోడెల గుండెపోటుకే గురయ్యాడని అనుకుందాం.. అప్పుడైనా చంద్రబాబు పరామర్శించాలి కదా, అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు కోడెల చనిపోయారు కాబట్టి.. చంద్రబాబు నాయుడి రాజకీయం మొదలైంది. బతికి ఉన్నప్పుడు అలా కనీసం పట్టించుకోకుండా ఉండటం, చనిపోయాకా వాళ్ల శవాల మీద రాజకీయాలు చేయడం.. ఇదీ చంద్రబాబు మార్కు నీతి అని సామాన్యులు అనుకుంటున్నారిప్పుడు.

ఇక కోడెల అంతిమయాత్రను.. చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్లంతా ఒక విజయయాత్రలా సెలబ్రేట్ చేసుకోవడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ వీళ్లకు ఏమైందని.. సామాన్య ప్రజానీకం అనుకుంటున్నారు.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?