Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీని నోరెత్తకుండా చేస్తున్న మంత్రి గారు

టీడీపీని నోరెత్తకుండా చేస్తున్న మంత్రి గారు

అసలే టీడీపీ ఇపుడు చాలా ఇబ్బందులో ఉంది. అందులోనూ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడాక, జనం మద్దతు ఎటువైపో తెలిశాక క్యాడర్ బాగా డీలా పడి ఉంది. మరో వైపు కరోనా పేరిట హై కమాండ్ చాన్నాళ్ళుగా హైదరాబాద్ లో మకాం వేసింది. అక్కడ నుంచే జూమ్ యాప్ ద్వారా కధ మొత్తం నడుస్తోంది.

ఈ సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకటికి పదిసార్లు గట్టిగా గర్జిస్తున్నారు. ఏ క్షణమైనా ఘడియైనా విశాఖకు రాజధాని తరలిరావడం ఖాయమని బొత్స అంటున్న మాటలు టీడీపీకి గుక్క తిప్పుకోనీయకుండానే ఉన్నాయి.

గత ఏడాది వరకూ విశాఖ రాజధాని అంటే కస్సుమన్న తమ్ముళ్ళు కూడా ఇపుడు ఎందుకో సైలెంట్ అయిన సీన్ కనిపిస్తోంది. మరో వైపు చూస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ఏనాడో మొదలైపోయింది, న్యాయ వివాదాలు అన్నీ అధిగమించి మేము మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని బొత్స చెబుతున్నారు.

విశాఖ నడిబొడ్డున ఆయన గట్టిగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా అవత‌ల వైపు నుంది సౌండ్ పెద్దగా రాకపోవడం బట్టి చూస్తూంటే రాజకీయంగా వైసీపీ పై చేయి సాధించింది అనుకోవాలి. 

ఇక ముఖ్యమంత్రి క్యాప్ ఆఫీస్ విశాఖకు తరలివస్తే వైసీపీ అనుకున్నట్లుగానే జరిగిపోతోంది అని కూడా భావించాలి. కోర్టు తీర్పు కనుక అనుకూలం అయితే వైసీపీ కల పూర్తిగా సాకారం అయినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?