Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం ఏ మ‌లుపు తిరుగుతుందో!

ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం ఏ మ‌లుపు తిరుగుతుందో!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. పార్టీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వినే భూమా వ‌ర్గం ఆశించింది. అయితే పార్ల‌మెంట‌రీ విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి కూడా వారికి ద‌క్క‌లేదు. ఆ పై పార్టీ క‌మిటీల్లో ఈ యువ‌నేత‌కు ఎలాంటి ప్రాధాన్య‌త‌నూ ఇవ్వ‌క‌పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ఎప్పుడు ఎదురుకాని  భారీ ఓటమిని అఖిల ప్రియ చవి చూసింది అయినా కూడా  అఖిల ప్రియ టీడీపీ  పార్టీ తరుపున  తన గళం వినిపిస్తూనే  ఉన్న  పార్టీ కమిటీల్లో చోటు  దక్కించుకోలేక పోయారామె. కారణం ఎవరికీ అంతు పట్టట్లేదు కానీ చంద్ర బాబు అంతరంగం ఇంకోలా ఉందట.

అఖిల ప్రియా, ఆమె భర్త  భార్గవ రామ్ నాయుడు వరుస  వివాదాలు  ఆళ్లగడ్డ లో  ఈమె పరిస్థితి ఏమి బాగాలేకపోవడం బంధువులు అనుచరులు దూరం కావడం, ఆమె భర్త భార్గవ రామ్ నాయుడు పెత్తనం  వల్ల రెడ్డి సామజిక  వర్గం  భూమా కుటుంబానికి దూరం కావడం జిల్లా టీడీపీ  నాయకుల తో సఖ్యత లేక పోవడం సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా దూరం  జరగడం ఇలా పలు కారణాలు చంద్రబాబు ను ఆలోచనలో  పడవేశాయట‌.

గత 30 సంవత్సరాలు గా ఆళ్లగడ్డ లో జరిగిన 9 ఎన్నికల్లో భూమా  గంగుల కుటుంబాలే తలపడ్డాయి 7 సార్లు భూమా  కుటుంబం విజయం సాధిస్తే 2 సార్లు గంగుల  కుటుంబం విజయం సాధించింది  ప్రతి గ్రామంలో ఇరు కుటుంబాలకు బలమైన వర్గాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకొక కుటుంబం ఆళ్లగడ్డ రాజకీయాల్లో రావడం అంత సులభం కాదు. 

అందుకే  చంద్రబాబు కన్ను అఖిల ప్రియ తో  విభేదించి బీజేపీ  తీర్థం   పుచ్చుకున్న భూమా నాగి రెడ్డి అన్న  కుమారుడు భూమా కిషోర్ రెడ్డి పైన పడినట్టు వినికిడి. భూమా కిషోర్ రెడ్డి బీజేపీ పార్టీ తరుపున  ఆళ్లగడ్డ లో చురుకు తిరుగుతూ భూమా అభిమానులను నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. 

ఇతన్ని భవిష్యత్తులో  టీడీపీ లోకి  లాగితే ఆళ్లగడ్డ లో టీడీపీ బలపడుతుంది అని చంద్రబాబు ఆలోచన అంట అందుకే అఖిల ప్రియకు పార్టీ పదవుల్లో మొండి చెయ్యి  చూపించాడని వినికిడి రాజకీయ  చదరంగం ఆడడం యూజ్ అండ్  త్రో  గా మనుషులను వాడడంలో  చంద్రబాబును  మించినవాడు లేడు అనే టాక్ వినిపిస్తోందిప్పుడు.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?