Advertisement

Advertisement


Home > Politics - Political News

మోదీని లాగుతారా ... ఆక్రోశంతో ప్ర‌శ్నిస్తున్న ఆర్‌కే

మోదీని లాగుతారా ... ఆక్రోశంతో ప్ర‌శ్నిస్తున్న ఆర్‌కే

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కంటే ఆంధ్ర‌జ్యోతి - ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు ప్ర‌ధాని మోడీపై విప‌రీత‌మైన ప్రేమ పుట్టుకొచ్చింది. మంత్రి కొడాలి నాని ఏదో ప్ర‌శ్నిస్తే ... వైసీపీ ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు సోము వీర్రాజు, చంద్ర‌బాబునాయుడు త‌దిత‌రులు నోరు మెద‌ప‌కుండానే ... ఆర్‌కే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. మంత్రిని నిల‌దీస్తున్నాడు.

అందులోనూ త‌న స్వామి చంద్ర‌బాబునాయుడు వాయిస్‌గా ఆర్‌కే అరిచి గోల పెడుతున్నాడు. ఒక్క ప్ర‌శ్న‌తో రెండు ప్ర‌యోజ‌నాల చందంగా ... ఆంధ్ర‌జ్యో తిలో మోడీపై బాబు టెలికాన్ఫ‌రెన్స్ వార్త‌ను చూడాల్సి వుంది. మోడీపై భ‌క్త‌ని ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా బీజేపీకి బాబును ద‌గ్గ‌ర చేయ‌డం, ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయొచ్చ‌నే వ్యూహం ...ఆంధ్ర‌జ్యోతిలో చూడొచ్చు.

నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆ పార్టీ నేతలతో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు బుధ‌వారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ల‌ను ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌చురించిన వార్త‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం. టెలికాన్ఫ‌రెన్స్‌లో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌ల‌ను ఆ రెండు ఎల్లో ప‌త్రిక‌లు క్యారీ చేసిన తీరు చూస్తే ... ఆర్‌కే అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ముందుగా ఈనాడులో ఆ మీటింగ్‌కు సంబంధించిన వార్త‌ను క్యారీ చేసిన తీరు చూద్దాం.

‘న‌మ్మ‌కాల‌ను హేళ‌న చేయ‌కూడ‌దు’ అనే శీర్షిక‌తో వార్త‌ను లోప‌లి పేజీలో ఇచ్చారు. ‘ ఏసుపై న‌మ్మ‌కంతో జ‌గ‌న్ త‌న ఇంటిపై శిలువ చిహ్నం వేయించుకున్నారు. నేను వేంక‌టేశ్వ‌ర‌స్వామిని న‌మ్ముతా. ముస్లింలు అల్లాను న‌మ్ముతారు. అంద‌రి న‌మ్మ‌కా ల‌ను గౌర‌వించాలే త‌ప్ప ... హేళ‌న చేయ‌డం త‌గ‌దు. తిరుమ‌ల‌పై మంత్రి కొడాలి నాని వ్యాఖ్య‌లు బాధాక‌రం. డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని అడిగితే ... మోడీ కూడా స‌తీస‌మేతంగా వెళ్లాలంటూ ఉన్మాదిలో మాట్లాడుతున్నారు. భార్య ఉన్న‌ప్పుడు భ‌ర్త మాత్ర‌మే ఆల యాల పూజ‌ల్లో పాల్గొన‌డం అరిష్టం’ అని రాశారు.

ఆంధ్ర‌జ్యోతిలో మొద‌టి పేజీలో ‘సీఎంను ప్రశ్నిస్తే మోదీని లాగుతారా’ అనే శీర్షిక‌తో ఆన్‌లైన్ మీటింగ్‌కు సంబంధించిన వార్త‌ను ప్రాధాన్య‌త‌తో ప్ర‌చురించారు. ఇక్క‌డ వార్త సాగిన తీరు ఇదీ ... ‘తిరుమల ఆలయ సంప్రదాయాలను ఎందుకు పాటించరని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తే అందులోకి ప్రధాని మోదీని లాగడమేంటని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. 

తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేవారు సతీసమేతంగా రావాలి. ఇదే విషయాన్ని కొందరు అడిగారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీని సతీ సమేతంగా రమ్మని చెప్పండని కొందరు మంత్రులు సవాళ్లు విసురుతు న్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చకు... ప్రధానికి సంబంధం ఉందా? ఇక్కడ రంకెలు వేస్తారు... అక్కడకు వెళ్లి కాళ్లపై పడతారు’

మోడీని స‌తీస‌మేతంగా వెళ్లాల‌ని మంత్రి కొడాలి ఉన్మాదిలా మాట్లాడుతున్నార‌ని చంద్ర‌బాబు అన్న‌ట్టు ఈనాడులో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ విషం చిమ్మేందుకు అన్న‌ట్టు బాబు అన్న‌ట్టు ప్ర‌ధాని మోదీని లాగ‌డ‌మేంటి? ఇక్క‌డ జ‌రుగు తున్న చ‌ర్చ‌కు, ప్ర‌ధానికి సంబంధం ఉందా? అని రంకెలేస్తున్నార‌ని, అక్క‌డికి వెళ్లి కాళ్ల‌పై ప‌డ‌తార‌ని ఆంధ్ర‌జ్యోతిలో ఆర్‌కే రాసు కెళ్లారు. ఇవ‌న్నీ ఆర్‌కే జోడించిన మాట‌లని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌పై చంద్ర‌బాబే ఆ విధంగా మాట్లాడిన‌ప్పుడు ...ఇక బీజేపీ ఎంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించాలి? ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌లు కేంద్రంలో అధికారం చెలా యిస్తున్న బీజేపీ రాష్ట్ర నేత‌ల మ‌న‌సుల్లో విష‌పు బీజాలు చ‌ల్లే ప్ర‌య‌త్నంగా ఆంధ్ర‌జ్యోతి తాజా అక్ష‌రాల్ని చూడాల్సి వుంటుంది.

ఏపీలో మ‌తం పేరుతో విద్వేషాగ్నిని ర‌గిల్చి జ‌గ‌న్ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేయాల‌నే ప్ర‌తిప‌క్షాల కుట్ర‌ల‌కు ఆర్‌కే  అక్ష‌రాల ఆజ్యం ఎంత వ‌ర‌కు దోహ‌దం చేస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది. 

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?