ఆయన తెలంగాణలో ఒక సాధారణ ఎమ్మెల్యే. కానీ ఆయన బిల్డప్ మాత్రం.. తెలంగాణ అనే సామ్రాజ్యానికి తానే సర్వాధికారినని, చక్రవర్తినని భావిస్తున్నట్టుగా ఉంటోంది. ఏపీ వాళ్లనందరినీ తెలంగాణలోకి రానివ్వకుండా తాము అనుకుంటే నిర్ణయం తీసుకుంటాం అని ఆయన హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఏపీ వాళ్లను వ్యాపారాలు చేసుకోనివ్వం అని కూడా బెదిరిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతలేసి మాటలు అంటున్న ఈ మహానుభావుడు ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా? ఆయన మరెవ్వరో కాదు.. జడ్చర్ల నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ఇంతకూ ఆయనకు అంతగా ఏపీ వారిని తెలంగాణ నుంచి వెలివేయాలన్నంత కోపం ఎందుకొచ్చిందో కదా అని అనుకుంటున్నారా? తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను అక్కడ అనుమతించడం లేదట. తమ అనుచరులను దర్శనానికి పంపాలంటే కష్టంగా ఉన్నదంట. అందువల్ల.. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులపై తెలంగాణ నుంచి బహిష్కరణాస్త్రం ప్రయోగిస్తా అని ఈ ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతున్నారు.
తిరుమలకు వెళ్లిన అనిరుధ్ రెడ్డి అక్కడే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం. తిరుమలలో తమ సిఫారసు ఉత్తరాలకు వీఐపీ బ్రేక్ లు, గదులు ఇవ్వకపోవడంపై ఆయనకు కోపం వచ్చింది. ఏఫీ ప్రజాప్రతినిధులు ఉత్తరాలు ఇస్తే యాదాద్రి, భద్రాచలంలో అనుమతిస్తామని .. తమకు మాత్రం తిరుమలలో ఎందుకు అనుమతించరు అని ఆయన ప్రశ్నించారు. ఆయన అంతవరకే పరిమితం అయి ఉంటే బాగుండేది.
తెలంగాణ ఎమ్మెల్యేల ఉత్తరాలను తిరుమలలో అనుమతించకపోతే గనుక.. తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం ఇతర ఆలయాల్లో ఏపీ వారి ఉత్తరాలను కూడా బుట్టదాఖలు చేస్తాం అని బెదిరించి ఉంటే కూడా సబబుగానే ఉండేది. కానీ.. అనిరుధ్ రెడ్డి కాస్త శృతి మించి, తన స్థాయికి మించి మాట్లాడారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంటే తెలుగుదేశం వారు హైదరాబాదు వచ్చి తలదాచుకుంటారు.. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే వైపీపీవారు వచ్చి తలదాచుకుంటారు. ఏపీ వాళ్లు తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న మేం ఏమీ అనడం లేదు.. అని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలంతా కలిసి ఏపీ వాళ్లను తమ రాష్ట్రానికి రానివ్వకుండా ఒక తీర్మానం చేసుకుంటే బుద్ధి వస్తుందని చెబుతున్నారు. తమ సిఫారసు ఉత్తరాల్ని పట్టించుకోకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో ఏపీ వారంతా బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అనిరుధ్ రెడ్డి తన గురించి తాను ఏం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆయన అమాయకంగా మాట్లాడుతున్నారా? అజ్ఞానంతో మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక రాష్ట్ర ప్రజలను మరో తెలంగాణ కు రానివ్వకుండా చేయడానికి ఆయన తనను తాను తెలంగాణ చక్రవర్తిగా ఊహించుకుంటున్నారేమో కూడా తెలియదు! ఆయన తన మాటలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఇది ఇరు రాష్ట్రాల బంధాలను దెబ్బతీసే వ్యాఖ్యలు అని ఇరురాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర ప్రజలు, సెటిలర్స్, మిగతా రాష్ట్రాల ప్రజలు తలుచుకుంటే అసలు మీ తెలంగాణ ప్రజలు అడుగుపెట్ట గలరా హైదరాబాద్ లో..
రాజకీయ మూర్ఖలకు మూర్ఖత్వానికి అంబాసిడర్…….
Call boy works 9989793850
ఇలాని ఒక్కడు అంద్రొల్ల మీద పడి పడి బూతులు మాట్లాడి …వాదె పదవి పొయి బాథ్ ఊం లొ పడి తుంటి ఇరగొట్టుకున్నాడు
ఇప్పుడు వీడొక్కడు లెచాడు ..వీడెం ఇరగ్గొట్టుకుంటాడొ చూద్దం
ఇలాని ఒక్కడు అంద్రొల్ల మీద పడి పడి బూ..తు..లు మాట్లాడి … పదవి పొయి ..bath room లొ పడి తుంటి ఇ..రగొట్టుకు..న్నాడు
ఇప్పుడు వీ..డొక్క..డు లెచాడు ..వీడెం ఇరగ్గొట్టుకుంటాడొ చూద్దం