అయ్యన్న సవాళ్లు: హోదా పెరిగిన భాష మారలేదు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ పదవిలోకి రావడానికి ముందు దూకుడైన మాటలకు పెట్టింది పేరు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అనుచితమైన పదజాలంతో తీవ్రంగా నిందిస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కిన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ పదవిలోకి రావడానికి ముందు దూకుడైన మాటలకు పెట్టింది పేరు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అనుచితమైన పదజాలంతో తీవ్రంగా నిందిస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. పత్రికలలో రాయడానికి కూడా సాధ్యం కానంత అసహ్యకరమైన భాషలో, అప్పట్లో రాష్ట్రానికి అధినేతను తిట్టడం ద్వారా ఆయన ఒక సెలబ్రిటీ స్థాయి నాయకుడిగా చలామణి అయ్యారు.

అలాంటి నాయకుడికి ఎంతో గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ పదవిని కట్టబెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఆ పదవిని స్వీకరించిన రోజున సభలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ హోదాలో ఉంటూ అయ్యన్న పాత్రుడు ఇదివరకటిలా ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. అయ్యన్న ఎంతో గౌరవప్రదమైన హోదాలోకి వచ్చారు గాని ఆయన తీరులో మాత్రం ఏ కొంచెమైనా మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు.

‘తనకు నమస్కారం పెట్టవలసి వస్తుందని భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లే’దంటూ అయ్యన్నపాత్రుడు తాజాగా ఒక బహిరంగ సభలో మాట్లాడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జగన్ ను హేళన చేయడం కోసం మాట్లాడుతూ సభాపతి అయ్యన్నపాత్రుడు వాడిన భాష కూడా అభ్యంతరకరంగా ఉన్నది- అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఆయన గౌరవప్రదమైన స్థానానికి వచ్చారే తప్ప ఆయన భాషలో మార్పు రాలేదని పలువురు అంటున్నారు.

ఒక పార్టీకి అధినాయకుడిగా 11 మంది శాసనసభ్యులకు నాయకుడిగా తాము అసెంబ్లీకి రావాలో అక్కర్లేదో నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఉన్న హక్కు. ఈ శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే విశ్వాసం లేకపోతే ఆయన రావాల్సిన అవసరం లేదు. సభా కార్యకలాపాలు మొత్తం ఏకపక్షంగా సాగిపోతాయని అనుకుంటే గనుక ఆయన వాటికి దూరంగా ఉండవచ్చు. ఆయన హక్కును కాదనే అధికారం ఎవరికీ లేదు. ఆయన చేసిన పని తప్పు అని ప్రజలు భావిస్తే కనుక ఈసారి ఎన్నికలలో ఇంతకంటే ఘోరమైన తీర్పును ఆయన పట్ల చూపిస్తారు. లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలోనే లోపం ఉంది, ఇలాంటి ప్రభుత్వం శాసనసభ సమావేశాల నుంచి దూరంగా ఉండడం ద్వారా జగన్ మంచి పని చేశారని ప్రజలు నమ్మితే నెక్స్ట్ టైం అధికారం కట్టబెట్టవచ్చు.

అయితే అక్కడికేదో తనను చూసి భయపడి అసెంబ్లీకి రావడం మానుకున్నట్లుగా అయ్యన్న పాత్రుడు చెప్పుకోవడం తమాషాగా ధ్వనిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే తనకంటే పెద్ద స్థాయి అయినా సరే సభలోకి వచ్చిన తర్వాత మాత్రం తనకు నమస్కారం పెట్టి తీర వలసిందేనని తన స్థాయి అలాంటిదని అయిన పాత్రుడు చెప్పుకుంటున్నారు.

జగన్ కూడా అదే విధంగా సభలోకి వచ్చినప్పుడు తనకు నమస్కారం పెట్టాలని, అలా పెట్టడం ఇష్టం లేనందువల్లనే సభకు రావడంలేదని ఆయన వివరిస్తున్నారు. పార్టీ అభిమాన దురభిమానాలు, రాగద్వేషాలు లేకుండా గౌరవప్రదంగా ఉండవలసిన స్పీకర్ స్థానంలోని వ్యక్తి ఈ రకంగా ప్రతిపక్ష నేత గురించి చులకనగా హేళనగా మాట్లాడడం పట్ల ఆలోచనాపరులు తటస్థులలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ తాను సాధారణ నాయకుడిని కాదని.. స్పీకర్ స్థానంలో ఉన్న సమన్నతమైన హోదా లో ఉన్న వ్యక్తిని తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని అంటున్నారు.

21 Replies to “అయ్యన్న సవాళ్లు: హోదా పెరిగిన భాష మారలేదు..!”

  1. వామ్మో.. వెంకట్ రెడ్డి కలం నుండి నీతులు వరదల్లా పారుతున్నాయి సుమీ ..

    గత ఐదేళ్లు చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని వైసీపీ నాయకులు తిట్టినప్పుడు.. చెడుగుడు, కౌంటర్లు.. అంటూ మురిసిపోయిన నీ కలం.. ఇప్పుడు.. కర్మ తిరిగి ఎగతన్నుతుంటే.. భూతుల్లాంటి నీతులు కక్కుతున్నారు..

    మన చెంచాగాళ్ళు చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ ని తిట్టినప్పుడు, వెటకారం చేసినప్పుడు కూడా నీ కలం.. బాధ పడి ఉంటె.. ఇప్పుడు నీ ఏడుపు కి రాగం ఉండేది..

    కాబట్టి.. మీరు నేర్పిన విద్యయే నీరజాక్షా..

    మీరు తిట్టారు.. తిట్టించుకొన్నాం..

    మీరు కొట్టారు.. కొట్టించుకొన్నాం..

    ఇప్పుడు.. మా అవకాశం వచ్చింది.. మూసుకుని ఉండండి..

      1. వై నాట్ 175 అని చెప్పుకుని 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌలే గాడు.. బోసాడీకే.

      2. వై నాట్ 175 అని చెప్పుకుని 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌ లే గాడు.. బోసాడీకే.

      3. వై నాట్ 175 అని చెప్పుకుని 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌ లే గాడు.. బో సా డీ కే.

      4. వై నాట్ 175 అని డప్పులు కొట్టుకుని 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌ లే గాడు.. బో సా డీ కే.

      5. వై నాట్ 175 అని డప్పులు వాయించి 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌ లే గాడు.. బో సా డీ కే.

      6. వై నాట్ 175 అని డప్పులు వాయించి 11 తెచ్చుకున్నోడు.. 0.5 హౌ లే గా డు.. బో సా డీ కే.

  2. “మీ అమ్మ కడుపున ఎందుకు పుట్టనా అని నువ్వు బాధపడాలి” అన్నప్పుడు మేత మాటలు హోదాకి తగిన మాటలే అయితే ఇవి కూడా తగిన మాటలే..

Comments are closed.